కంటెంట్‌కు వెళ్లండి

Wife గురించి బైబిల్ వచనాలు

171 వచనాలు · 13 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. నా ప్రభువా, మీ దేవుడైన యెహోవా పేరిట, మీ జీవం తోడు, రక్తం చిందించకుండ మీ చేతులతో మీరే పగతీర్చుకోకుండా యెహోవా మిమ్మల్ని ఆపారు. మీ శత్రువులు నా ప్రభువైన మీకు కీడు చేయాలనుకునే వారికి నాబాలు గతే పడుతుంది.

  2. మీ సేవకురాలినైన నేను నా ప్రభువైన మీకు తెచ్చిన ఈ కానుకను మీ వెంట ఉన్న మీ సేవకులకు ఇవ్వనివ్వండి.

  3. “మీ సేవకురాలి పాపాన్ని క్షమించండి. నా ప్రభువైన మీరు యెహోవా యుద్ధాలను చేస్తున్నారు కాబట్టి నా ప్రభువు యొక్క రాజ్యాన్ని స్థిరపరుస్తారు. మీరు జీవించినంతకాలం మీకు కీడు కలుగదు.

  4. మిమ్మల్ని బాధించాలని, ప్రాణం తీయాలని ఎవరైనా ప్రయత్నిస్తే, నా ప్రభువైన మీ ప్రాణం మీ దేవుడైన యెహోవా దగ్గర ఉన్న జీవపు మూటలో భద్రంగా కట్టబడుతుంది. ఒకడు వడిసెలతో రాయి విసిరినట్లుగా ఆయన మీ శత్రువుల ప్రాణాలను విసిరివేస్తారు.

  5. యెహోవా నా ప్రభువైన మీకు వాగ్దానం చేసినదంతటిని నెరవేర్చి మిమ్మల్ని ఇశ్రాయేలీయుల మీద పాలకునిగా నియమిస్తారు.

  6. నిష్కారణంగా మీరు రక్తం చిందించారన్న లేదా స్వయంగా మీరే పగతీర్చుకున్నారన్న హృదయ వేదన గాని దుఃఖం గాని నా ప్రభువైన మీకు కలుగకూడదు. యెహోవా నా ప్రభువైన మీకు విజయాన్ని ఇచ్చినప్పుడు మీరు మీ సేవకురాలినైన నన్ను జ్ఞాపకం చేసుకోండి” అని మనవి చేసుకుంది.

  7. అందుకు దావీదు అబీగయీలుతో, “నన్ను కలుసుకోడానికి నిన్ను పంపిన ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు స్తుతి కలుగును గాక.

  8. నీవు సమయోచితంగా మంచి పని చేసి ఈ రోజు రక్తపాతం చిందించకుండ నన్ను కాపాడావు నా సొంత చేతులతో నేను పగతీర్చుకోకుండ నన్ను అడ్డుకున్నావు కాబట్టి నీవు దీవించబడుదువు గాక.

  9. ఒకవేళ నీవు త్వరగా వచ్చి నన్ను కలిసి ఉండకపోతే, నీకు హాని చేయకుండ నన్ను ఆపిన ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా జీవం తోడు, రేపు తెల్లవారేసరికి నాబాలుకు సంబంధించిన మగవారిలో ఒక్కడు కూడా ప్రాణాలతో ఉండేవాడు కాదు” అన్నాడు.

  10. తర్వాత దావీదు తన కోసం ఆమె తెచ్చిన వాటిని ఆమె చేతితో తీసుకుని, “నీ మాటలు నేను విని నీ మనవి అంగీకరించాను, సమాధానంతో ఇంటికి వెళ్లు” అని ఆమెతో చెప్పాడు.

  11. అబీగయీలు తిరిగి నాబాలు దగ్గరకు వచ్చినప్పుడు, రాజులు విందు చేసినట్లు అతడు ఇంట్లో విందు చేసి, బాగా త్రాగుతూ ఆనందిస్తూ మత్తులో మునిగిపోయాడు కాబట్టి తెల్లవారే వరకు అతనితో ఆమె ఏమీ మాట్లాడలేదు.

  12. ఉదయాన నాబాలు మత్తు వదిలిన తర్వాత అతని భార్య అతనితో ఆ సంగతులన్ని చెప్పినప్పుడు భయంతో అతని గుండె ఆగి రాయిలా బిగుసుకుపోయాడు.

  13. పది రోజుల తర్వాత యెహోవా నాబాలును మొత్తగా అతడు చనిపోయాడు.

  14. నాబాలు చనిపోయాడని దావీదు విన్నప్పుడు, “నాబాలు నా పట్ల అవమానకరంగా ప్రవర్తించినందుకు నా పక్షాన పగతీర్చుకున్న యెహోవాకు స్తుతి కలుగును గాక. ఆయన తన సేవకుడు తప్పు చేయకుండ కాపాడాడు, నాబాలు చేసిన తప్పును అతని తలపైకి తెచ్చాడు” అని అన్నాడు. తర్వాత దావీదు తనను పెండ్లి చేసుకోమని అబీగయీలును అడగడానికి ఆమె దగ్గరకు కబురు పంపించాడు.

  15. దావీదు సేవకులు కర్మెలులో ఉన్న అబీగయీలు దగ్గరకు వచ్చి, “దావీదు నిన్ను పెళ్ళి చేసుకోవడానికి నిన్ను తీసుకురమ్మని మమ్మల్ని పంపాడు” అని చెప్పారు.

  16. ఆమె లేచి మోకరించి తల నేలపై ఆనించి, “నా ప్రభుని ఇష్టం; నా ప్రభుని సేవకులకు సేవ చేసి కాళ్లు కడగడానికి నేను సిద్ధంగా ఉన్నాను” అని చెప్పింది.

  17. వెంటనే అబీగయీలు లేచి గాడిద మీద తన అయిదుగురు సేవకురాళ్లను వెంటబెట్టుకుని దావీదు దూతలతో వెళ్లి దావీదును పెళ్ళి చేసుకుంది.

  18. ఏడవ రోజున, రాజైన అహష్వేరోషు ద్రాక్షరసంతో ఉల్లాసంగా ఉన్నప్పుడు, తనకు సేవచేసే మెహుమాను, బిజ్తా, హర్బోనా, బిగ్తా, అబగ్తా, జేతరు, కర్కసు అనే ఏడుగురు నపుంసకులకు రాణియైన వష్తిని తన రాజకిరీటాన్ని ధరింపజేసి తన అందాన్ని ప్రజలకు, సంస్థానాధిపతులకు చూపించడానికి, తన ముందుకు తీసుకురావాలని ఆజ్ఞాపించాడు. ఆమె చూడటానికి చాలా అందంగా ఉంటుంది.

  19. To bring Vashti the queen before the king with the crown royal, to shew the people and the princes her beauty: for she was fair to look on.

  20. అయితే ఆ నపుంసకులు రాజు ఆజ్ఞను రాణియైన వష్తికి తెలియజేసినప్పుడు, ఆమె రావడానికి ఒప్పుకోలేదు. అప్పుడు రాజు ఆగ్రహంతో, కోపంతో మండిపడ్డాడు.

  21. చట్టం, న్యాయం విషయాల్లో రాజు నిపుణులను సంప్రదించడం ఆచారం కాబట్టి, కాలాలను అర్థం చేసుకునే జ్ఞానులతో,

  22. కర్షెనా, షెతారు, అద్మాతా, తర్షీషు, మెరెసు, మర్సెనా మెముకాను అనే ఏడుగురు రాజుకు సన్నిహితులు. రాజు దగ్గర ప్రత్యేక హోదాలో రాజ్యంలో ఉన్నతమైన స్థానాల్లో ఉన్న పర్షియా, మెదీయకు చెందిన ఈ ఏడుగురు సంస్థానాధిపతులతో రాజు మాట్లాడాడు.

  23. “చట్టం ప్రకారం రాణియైన వష్తిపై ఏం చర్య తీసుకోవాలి?” అని రాజు అడిగాడు. “రాజైన అహష్వేరోషు అనే నేను నపుంసకుల ద్వారా పంపిన ఆజ్ఞకు రాణియైన వష్తి లోబడలేదు.”

  24. అప్పుడు మెముకాను రాజు ఎదుట సంస్థానాధిపతుల ఎదుట జవాబిస్తూ, “వష్తి రాణి తప్పు చేసింది, రాజు పట్ల మాత్రమే కాదు కాని అహష్వేరోషు రాజు పరిపాలిస్తున్న అన్ని సంస్థానాధిపతుల ఎదుట, ప్రజలందరి ఎదుట తప్పు చేసింది.

  25. రాణి ప్రవర్తన స్త్రీలందరికి తెలిసిపోతుంది, అప్పుడు వారు తమ భర్తలను చులకన చేస్తూ, ‘రాజైన అహష్వేరోషు తన రాణియైన వష్తిని తన ముందుకు రమ్మని ఆజ్ఞాపిస్తే ఆమె రాలేదు’ అంటారు.