Wife గురించి బైబిల్ వచనాలు: Unclassified scriptures relating to
Unclassified scriptures relating to గురించి వచనాలు
యెహోవా దేవుడు, “నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, అతనికి తగిన తోడును చేస్తాను” అని అనుకున్నారు.
అప్పుడు ఆ మనుష్యుడు ఇలా అన్నాడు: “ఈమె నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో మాంసం; ఈమె నరుని నుండి వచ్చింది కాబట్టి ఈమె ‘నారీ’ అని పిలువబడుతుంది.”
అందుకే పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకుంటాడు, వారిద్దరు ఏకశరీరం అవుతారు.
తర్వాత దేవుడు స్త్రీతో ఇలా అన్నారు, “నీకు ప్రసవ వేదన అధికం చేస్తాను; తీవ్రమైన ప్రసవ వేదనతో పిల్లలను కంటావు. నీ వాంఛ నీ భర్త కోసం కలుగుతుంది, అతడు నిన్ను ఏలుతాడు.”
అప్పుడు రాజు నిర్ణయాన్ని అతని మహారాజ్యమంతా ప్రకటిస్తే, అల్పుల నుండి ఘనుల వరకు స్త్రీలందరూ తమ భర్తలను గౌరవిస్తారు” అన్నాడు.
ఈ సలహా రాజుకు, అతని సంస్థానాధిపతులకు నచ్చింది, కాబట్టి మెముకాను ప్రతిపాదించినట్లు రాజు చేశాడు.
అప్పుడు రాజు, ప్రతి పురుషుడు తన కుటుంబానికి తానే యజమానిగా ఉండాలని ఆజ్ఞాపిస్తూ తన రాజ్యంలోని అన్ని ప్రాంతాలకు ప్రతి సంస్థానానికి ప్రజలందరికి వారివారి భాషల్లో వ్రాయించి తాకీదులు పంపాడు.
మీ ఇంట్లో మీ భార్య ఫలించే ద్రాక్షతీగెలా ఉంటుంది; మీ భోజనపు బల్లచుట్టూ మీ పిల్లలు ఒలీవ మొక్కల్లా ఉంటారు.
యెహోవా పట్ల భయం కలవారు ఈ విధంగా ఆశీర్వదించబడతారు.
మంచి భార్య తన భర్తకు కిరీటం వంటిది కానీ అపకీర్తిగల భార్య వాని యెముకల్లో కుళ్ళువంటిది.
జ్ఞానం ఉన్న స్త్రీ తన ఇల్లు కట్టుకుంటుంది, కాని మూర్ఖురాలు తన స్వహస్తాలతో తన ఇల్లు కూల్చివేస్తుంది.
భార్య దొరికిన వానికి మేలు దొరుకుతుంది, వాడు యెహోవా నుండి దయ పొందుతాడు.
బుద్ధిహీనుని పిల్లలు తన తండ్రికి నష్టము తెచ్చును, భార్యతోటిపోరు ఆగకుండా పడుచుండు నీటిబొట్లతో సమానము.
ఇల్లు సంపద పితరులు ఇచ్చిన స్వాస్థ్యం, వివేకంగల భార్య యెహోవా యొక్క దానము.
గయ్యాళియైన భార్యతో పెద్ద ఇంట్లో ఉండడం కంటే, మిద్దెమీద ఒక మూలను నివసించడం మేలు.
ప్రాణం విసిగించే గయ్యాళి భార్యతో కాపురం చేయడం కంటే అడవిలో నివసించడం మంచిది.
గయ్యాళియైన భార్యతో పెద్ద ఇంట్లో ఉండడం కంటే మిద్దెమీద ఒక మూలను నివసించడం మేలు.
“భూమిని వణికించునవి మూడు కలవు, అవి భరించలేనివి నాలుగు కలవు.
అవి ఏమనగా రాజరికానికి వచ్చిన దాసుడు, తినడానికి పుష్కలంగా ఉన్న దైవభక్తి లేని మూర్ఖుడు,
పెళ్ళి చేసుకున్న ధిక్కార స్త్రీ, యజమానురాలి స్థానాన్ని తీసుకున్న చేసికొన్న దాసి.
గుణవతియైన భార్య ఎవరు కనుగొనగలరు? ఆమె ముత్యాల కంటే విలువైనది.
ఆమె భర్త ఆమెపై పూర్తి నమ్మిక కలిగి ఉంటాడు అతనికి లాభం తక్కువకాదు.
ఆమె బ్రతుకు దినాలన్ని, అతనికి మేలు చేస్తుంది గాని కీడు చేయదు.
ఆమె గొర్రె ఉన్నిని నారను తెచ్చుకుని, ఆసక్తి కలిగి తన చేతులతో పని చేస్తుంది.
ఆమె దూరము నుండి తన ఆహారాన్ని తెచ్చే, వర్తకుల ఓడల లాంటిది.