Skip to content

Ahasuerus

29 వచనాలు · 2 కుటుంబ సభ్యులు

Ahasuerus ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. అహష్వేరోషు పరిపాలన ఆరంభంలో యూదా వారి మీద, యెరూషలేము వారిమీద ఫిర్యాదు చేస్తూ ఉత్తరం వ్రాసి పంపారు.

  2. ఇండియా నుండి కూషు దేశం వరకు 127 సంస్థానాలను పరిపాలించిన రాజైన అహష్వేరోషు కాలంలో జరిగిన సంఘటనలు ఇవి.

  3. ఆ సమయంలో అహష్వేరోషు రాజ సింహాసనం ఉన్న షూష కోట నుండి పరిపాలించాడు.

  4. వష్తి రాణి కూడా తన రాజైన అహష్వేరోషు యొక్క రాజ్య భవనంలో ఉన్న స్త్రీలందరికి విందు ఏర్పాటు చేసింది.

  5. ఏడవ రోజున, రాజైన అహష్వేరోషు ద్రాక్షరసంతో ఉల్లాసంగా ఉన్నప్పుడు, తనకు సేవచేసే మెహుమాను, బిజ్తా, హర్బోనా, బిగ్తా, అబగ్తా, జేతరు, కర్కసు అనే ఏడుగురు నపుంసకులకు రాణియైన వష్తిని తన రాజకిరీటాన్ని ధరింపజేసి తన అందాన్ని ప్రజలకు, సంస్థానాధిపతులకు చూపించడానికి, తన ముందుకు తీసుకురావాలని ఆజ్ఞాపించాడు. ఆమె చూడటానికి చాలా అందంగా ఉంటుంది.

  6. “చట్టం ప్రకారం రాణియైన వష్తిపై ఏం చర్య తీసుకోవాలి?” అని రాజు అడిగాడు. “రాజైన అహష్వేరోషు అనే నేను నపుంసకుల ద్వారా పంపిన ఆజ్ఞకు రాణియైన వష్తి లోబడలేదు.”

  7. అప్పుడు మెముకాను రాజు ఎదుట సంస్థానాధిపతుల ఎదుట జవాబిస్తూ, “వష్తి రాణి తప్పు చేసింది, రాజు పట్ల మాత్రమే కాదు కాని అహష్వేరోషు రాజు పరిపాలిస్తున్న అన్ని సంస్థానాధిపతుల ఎదుట, ప్రజలందరి ఎదుట తప్పు చేసింది.

  8. రాణి ప్రవర్తన స్త్రీలందరికి తెలిసిపోతుంది, అప్పుడు వారు తమ భర్తలను చులకన చేస్తూ, ‘రాజైన అహష్వేరోషు తన రాణియైన వష్తిని తన ముందుకు రమ్మని ఆజ్ఞాపిస్తే ఆమె రాలేదు’ అంటారు.

  9. “కాబట్టి రాజుకు ఇష్టమైతే, రాజైన అహష్వేరోషు ముందుకు వష్తి రాణి ఇక ఎన్నడూ రాకూడదని రాజాజ్ఞ జారీ చేయండి. అది రద్దు కాకుండా ఉండడానికి దానిని పర్షియా మెదీయ శాసన గ్రంథాల్లో వ్రాయాలి. అంతేకాక, ఆమెకంటే యోగ్యురాలికి రాణి స్థానాన్ని ఇవ్వాలి.

  10. తర్వాత రాజైన అహష్వేరోషు కోపం తగ్గినప్పుడు, అతడు వష్తిని, ఆమె చేసిన దానిని, ఆమె గురించి ఎలాంటి శాసనం ఇచ్చాడో జ్ఞాపకం చేసుకున్నాడు.

  11. ఒక యువతి రాజైన అహష్వేరోషు దగ్గరకు వెళ్లే సమయం రాకముందు, ఆమె ఆరు నెలలు పాటు గోపరస తైలం, మరో ఆరు నెలలు వివిధ పరిమళద్రవ్యాలు వాడాలి.

  12. అలా ఎస్తేరు రాజైన అహష్వేరోషు పరిపాలనలోని ఏడవ సంవత్సరంలో టెబేతు అనే పదవ నెలలో రాజభవనంలోకి వెళ్లింది.

  13. మొర్దెకై రాజు ద్వారం దగ్గర కూర్చుని ఉన్న సమయంలో, రాజు యొక్క ద్వారా సంరక్షకులుగా ఉన్న బిగ్తాన్, తెరెషు అనే ఇద్దరు రాజు అధికారులు రాజైన అహష్వేరోషు మీద కోప్పడి అతన్ని చంపాలని కుట్రపన్నారు.

  14. ఈ సంఘటనలు జరిగిన తర్వాత, రాజైన అహష్వేరోషు అగగీయుడైన హమ్మెదాతా కుమారుడైన హామానుకు ఇతర సంస్థానాధిపతులందరికన్నా ఉన్నత స్థానాన్ని ఇచ్చి అతన్ని గౌరవించాడు.

  15. మొర్దెకై ఏ జాతివాడో తెలుసుకుని, అతన్ని ఒక్కడినే చంపితే సరిపోదు అని అతడు అనుకున్నాడు. బదులుగా హామాను, అహష్వేరోషు రాజ్యమంతటిలో ఉన్న మొర్దెకై ప్రజలను అనగా యూదులందరిని నాశనం చేసే మార్గం కోసం ఆలోచించాడు.

  16. రాజైన అహష్వేరోషు పరిపాలనలోని పన్నెండవ ఏట, మొదటి నెల అయిన నీసానులో హామాను సమక్షంలో ఏ నెల ఏ రోజున అలా చేయాలో అని పర్షియా భాషలో పూరు, అనగా చీటి వేశారు. ఆ చీటిలో అదారు అనే పన్నెండవ నెల వచ్చింది.

  17. అప్పుడు హామాను రాజైన అహష్వేరోషుతో ఇలా అన్నాడు, “మీ రాజ్యంలోని సంస్థానాలన్నిటిలో ఉండే ప్రజల్లో ఉన్న ఒక జాతి ప్రజలు వేరుగా ఉంటున్నారు. వారి చట్టాలు ఇతర ప్రజల చట్టాలకు వేరుగా ఉన్నాయి; వారు రాజు శాసనాలను పాటించరు; అలా వారిని సహించడం రాజుకు అంత మంచిది కాదు.

  18. తర్వాత మొదటి నెల పదమూడవ రోజున రాజ కార్యదర్శులను పిలిపించారు. వారు హామాను ఆజ్ఞలన్నిటిని రాజు సంస్థానాధిపతులకు, సంస్థానాధికారులకు, ఆ సంస్థానాల్లోని ప్రజల అధిపతులకు, అధికారులకు వారి వారి లిపిలో వారి భాషలో వ్రాసి పంపాలని ఆజ్ఞాపించారు. వాటిని రాజైన అహష్వేరోషు పేరిట వ్రాసి వాటిపై రాజు ఉంగరంతో ముద్ర వేశారు.

  19. అందులో రాజభవన ద్వారపాలకులైన బిగ్తాన్, తెరెషు అనే ఇద్దరు రాజ్యాధికారులు అహష్వేరోషు రాజును చంపడానికి కుట్రపన్నిన సంగతిని మొర్దెకై తెలియజేసినట్లు వ్రాయబడి ఉంది.

  20. అందుకు రాజైన అహష్వేరోషు ఎస్తేరు రాణిని, “అలా చేయడానికి తెగించినవాడు ఎవడు? వాడెక్కడ?” అని అడిగాడు.

  21. అదే రోజు రాజైన అహష్వేరోషు యూదుల శత్రువైన హామాను ఇంటిని ఎస్తేరు రాణికి ఇచ్చాడు. మొర్దెకైతో తనకున్న బంధుత్వం గురించి ఎస్తేరు రాజుకు చెప్పింది. మొర్దెకై రాజు సముఖంలోకి వచ్చాడు.

  22. రాజైన అహష్వేరోషు ఎస్తేరు రాణికి, యూదుడైన మొర్దెకైకి జవాబిస్తూ అన్నాడు, “హామాను యూదులపై దాడి చేసినందుకు నేను అతని ఆస్తిని ఎస్తేరుకు ఇచ్చాను. అతడు సిద్ధం చేసిన స్తంభానికి అతన్ని వ్రేలాడదీశారు.

  23. రాజైన అహష్వేరోషు సంస్థానాలన్నిటిలో యూదులు ఇలా చేయడానికి నియమించబడిన రోజు అదారు నెల అనే పన్నెండవ నెల, పదమూడవ రోజు.

  24. యూదులు రాజైన అహష్వేరోషు సంస్థానాలన్నిటిలో తమ పట్టణాల్లో సమావేశమై, వారిని నాశనం చేయాలని నిర్ణయించుకున్న వారిపై దాడి చేశారు. వారి ఎదుట ఎవరూ నిలువలేకపోయారు, ఎందుకంటే ఇతర దేశాల ప్రజలందరు వారికి భయపడ్డారు.

  25. మొర్దెకై ఈ సంగతులన్ని నమోదు చేసి, రాజైన అహష్వేరోషు సంస్థానాలన్నిటికి దగ్గరలో దూరంలో నివసిస్తున్న యూదులందరికి ఉత్తరాలు పంపాడు.