Skip to content

Queen గురించి బైబిల్ వచనాలు

49 వచనాలు · 9 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. షేబ దేశపు రాణి సొలొమోను యొక్క ఖ్యాతి గురించి యెహోవాతో అతనికి ఉన్న సంబంధం గురించి విని చిక్కు ప్రశ్నలతో సొలొమోనును పరీక్షిద్దామని వచ్చింది.

  2. ఆమె ఒంటెల మీద సుగంధ ద్రవ్యాలను, చాలా బంగారం, వెలగల రాళ్లు ఎక్కించి, గొప్ప పరివారంతో బయలుదేరి యెరూషలేముకు చేరింది. ఆమె సొలొమోను దగ్గరకు వచ్చి, తన మనస్సులో ఉన్నదంతా చెప్పింది.

  3. సొలొమోను ఆమె ప్రశ్నలన్నిటికి జవాబులిచ్చాడు; వివరించలేనంత కష్టమైనది రాజుకు ఏది లేదు.

  4. షేబ రాణి సొలొమోనుకు ఉన్న జ్ఞానమంతటిని, అతడు కట్టించిన రాజభవనాన్ని,

  5. అతని భోజనబల్ల మీద ఆహారాన్ని, అతని అధికారుల కూర్చునే విధానాన్ని, ప్రత్యేక వస్త్రాలు ధరించి పరిచారం చేసే దాసులను, అతనికి పాత్ర అందించేవారిని, యెహోవా మందిరం వద్ద అతడు అర్పించే దహనబలులను చూసి ఆమె ఆశ్చర్యపడింది.

  6. ఆమె రాజుతో, “మీరు సాధించిన వాటి గురించి, మీ జ్ఞానం గురించి నా దేశంలో నేను విన్నది నిజమే.

  7. అయితే నేను వచ్చి కళ్ళారా చూసే వరకు వారి మాటలు నమ్మలేకపోయాను. నిజానికి, ఇక్కడున్న వాటిలో సగం కూడా నాకు చెప్పలేదు; జ్ఞానంలోను, ధనంలోను నేను విన్నదానికంటే మీరు ఎంతో గొప్పగా ఉన్నారు.

  8. మీ ప్రజలు ఎంత సంతోషంగా ఉంటారో! మీ ముందు నిలబడి మీ జ్ఞానాన్ని వింటున్న మీ అధికారులు ఎంత సంతోషంగా ఉంటారో!

  9. మీలో ఆనందిస్తూ, మిమ్మల్ని ఇశ్రాయేలు సింహాసనం మీద కూర్చోబెట్టిన మీ దేవుడైన యెహోవాకు స్తుతి కలుగును గాక! ఇశ్రాయేలు పట్ల ఆయనకున్న నిత్యమైన ప్రేమను బట్టి నీతిన్యాయాల ప్రకారం కార్యాలు జరిగించడానికి యెహోవా మిమ్మల్ని రాజుగా చేశారు” అని అభినందించింది.

  10. ఆమె రాజుకు 120 తలాంతుల బంగారం, చాలా సుగంధద్రవ్యాలు, వెలగల రాళ్లు ఇచ్చింది. షేబ రాణి ఇచ్చినంత సుగంధద్రవ్యాలు రాజైన సొలొమోనుకు మరెప్పుడూ రాలేదు.

  11. (హీరాము ఓడలు ఓఫీరు నుండి బంగారాన్ని తెచ్చాయి; అక్కడినుండి వారు చాలా ఎర్ర చందనం చెక్కలు, వెలగల రాళ్లు తెచ్చారు.

  12. ఆ చందనం వాడి, వాటితో రాజు యెహోవా మందిరానికి, రాజభవనానికి స్తంభాలను, సంగీతకారులకు సితారలు వీణలు చేయించాడు. ఆ రోజు నుండి ఇంతవరకు అలాంటి చందనం దొరకలేదు కనబడలేదు.)

  13. రాజైన సొలొమోను షేబ రాణికి తన రాజ నిధి నుండి ఇచ్చింది మాత్రమే కాక, ఆమె కోరిందంతా, అడిగినదంతా ఇచ్చాడు. తర్వాత ఆమె తన పరివారంతో తన స్వదేశానికి వెళ్లిపోయింది.

  14. ఫరోకు హదదు అంటే చాలా ఇష్టం కలిగి అతనికి తన భార్య తహ్పెనేసు రాణి యొక్క సోదరిని ఇచ్చి పెళ్ళి చేశాడు.

  15. అప్పుడు రాణి తన ప్రక్కన కూర్చుని ఉండగా రాజు, “నీ ప్రయాణానికి ఎన్ని రోజులు పడుతుంది? మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తావు?” అని అడిగాడు. నేను ఎన్ని రోజులో చెప్పినప్పుడు రాజు నన్ను పంపడానికి ఇష్టపడ్డాడు.

  16. వష్తి రాణి కూడా తన రాజైన అహష్వేరోషు యొక్క రాజ్య భవనంలో ఉన్న స్త్రీలందరికి విందు ఏర్పాటు చేసింది.

  17. ఏడవ రోజున, రాజైన అహష్వేరోషు ద్రాక్షరసంతో ఉల్లాసంగా ఉన్నప్పుడు, తనకు సేవచేసే మెహుమాను, బిజ్తా, హర్బోనా, బిగ్తా, అబగ్తా, జేతరు, కర్కసు అనే ఏడుగురు నపుంసకులకు రాణియైన వష్తిని తన రాజకిరీటాన్ని ధరింపజేసి తన అందాన్ని ప్రజలకు, సంస్థానాధిపతులకు చూపించడానికి, తన ముందుకు తీసుకురావాలని ఆజ్ఞాపించాడు. ఆమె చూడటానికి చాలా అందంగా ఉంటుంది.

  18. To bring Vashti the queen before the king with the crown royal, to shew the people and the princes her beauty: for she was fair to look on.

  19. అయితే ఆ నపుంసకులు రాజు ఆజ్ఞను రాణియైన వష్తికి తెలియజేసినప్పుడు, ఆమె రావడానికి ఒప్పుకోలేదు. అప్పుడు రాజు ఆగ్రహంతో, కోపంతో మండిపడ్డాడు.

  20. చట్టం, న్యాయం విషయాల్లో రాజు నిపుణులను సంప్రదించడం ఆచారం కాబట్టి, కాలాలను అర్థం చేసుకునే జ్ఞానులతో,

  21. కర్షెనా, షెతారు, అద్మాతా, తర్షీషు, మెరెసు, మర్సెనా మెముకాను అనే ఏడుగురు రాజుకు సన్నిహితులు. రాజు దగ్గర ప్రత్యేక హోదాలో రాజ్యంలో ఉన్నతమైన స్థానాల్లో ఉన్న పర్షియా, మెదీయకు చెందిన ఈ ఏడుగురు సంస్థానాధిపతులతో రాజు మాట్లాడాడు.

  22. “చట్టం ప్రకారం రాణియైన వష్తిపై ఏం చర్య తీసుకోవాలి?” అని రాజు అడిగాడు. “రాజైన అహష్వేరోషు అనే నేను నపుంసకుల ద్వారా పంపిన ఆజ్ఞకు రాణియైన వష్తి లోబడలేదు.”

  23. అప్పుడు మెముకాను రాజు ఎదుట సంస్థానాధిపతుల ఎదుట జవాబిస్తూ, “వష్తి రాణి తప్పు చేసింది, రాజు పట్ల మాత్రమే కాదు కాని అహష్వేరోషు రాజు పరిపాలిస్తున్న అన్ని సంస్థానాధిపతుల ఎదుట, ప్రజలందరి ఎదుట తప్పు చేసింది.

  24. రాణి ప్రవర్తన స్త్రీలందరికి తెలిసిపోతుంది, అప్పుడు వారు తమ భర్తలను చులకన చేస్తూ, ‘రాజైన అహష్వేరోషు తన రాణియైన వష్తిని తన ముందుకు రమ్మని ఆజ్ఞాపిస్తే ఆమె రాలేదు’ అంటారు.

  25. రాణి ప్రవర్తన గురించి విన్న పర్షియా మెదీయ సంస్థానాధిపతుల భార్యలు ఈ రోజే రాణి అన్నట్లే రాజ అధిపతులందరితో అంటారు. దీనివలన అంతులేని తిరస్కారం కోపం కలుగుతుంది.