Skip to content

Wicked గురించి బైబిల్ వచనాలు

724 వచనాలు · 18 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. బాధితులు నలిగి కుప్పకూలిపోతారు; వారు వారి బలత్కారం వల్ల పతనమవుతారు.

  2. “దేవుడు ఎప్పటికీ గమనించరు; ఆయన తన ముఖాన్ని కప్పుకున్నారు ఇక ఎప్పుడు చూడరు” అని వారు తమలో తాము అనుకుంటారు.

  3. యెహోవా నీతిమంతులను పరీక్షిస్తారు, కాని దుష్టులను, దౌర్జన్యాన్ని ప్రేమించేవారిని ఆయన అసహ్యించుకుంటారు.

  4. ఈ జీవితకాలంలో మాత్రమే సంపదలు ఉన్న ఈ లోకసంబంధుల నుండి యెహోవా, మీ చేతితో నన్ను రక్షించండి. మీరు దుష్టుల కొరకు దాచిన దానితో వారి కడుపులను నింపుతారు; వారి పిల్లలు దానితో సంతృప్తి చెందుతారు, మిగిలిన దానిని తమ పిల్లలకు విడిచిపెడతారు.

  5. నేనైతే, నీతిగలవాడనై మీ ముఖాన్ని చూస్తాను; నేను మేల్కొనినప్పుడు, మీ స్వరూపాన్ని చూస్తూ తృప్తి పొందుతాను.

  6. వారు సాయం కోసం మొరపెట్టారు కాని వారిని రక్షించడానికి ఎవరూ లేరు యెహోవా కూడా వారికి జవాబివ్వలేదు.

  7. దుష్టులకు చాలా బాధలు కలుగుతాయి, కాని యెహోవాను నమ్ముకున్న వారి చుట్టూ ఆయన మారని ప్రేమ ఆవరించి ఉంటుంది.

  8. సంగీత దర్శకునికి. యెహోవా సేవకుడైన దావీదు కీర్తన. దుష్టుల పాప స్వభావాన్ని గురించి నా హృదయంలో నేను దేవుని నుండి వర్తమానం పొందుకున్నాను; వారి కళ్లలో దేవుని భయం లేదు.

  9. తమ పాపం బయటపడి దాన్ని ద్వేషించే వరకు వారు తమను తాము పొగడుకొంటారు.

  10. వారి నోటి మాటల్లో దుష్టత్వం, మోసం నిండి ఉన్నాయి; వారు తెలివిగా వ్యవహరించడంలో, మంచి చేయడంలో విఫలమవుతారు.

  11. వారి పడకలపై ఉండగానే చెడుకు కుట్ర చేస్తారు; వారు తమ పాప మార్గాల్లో వెళ్తారు తప్పును తిరస్కరించరు.

  12. దావీదు కీర్తన. దుష్టులను బట్టి బాధపడకు తప్పు చేసేవారిని చూసి అసూయపడకు;

  13. దుష్టులు నీతిమంతుల మీద కుట్రలు పన్నుతారు, వారిని చూసి పళ్ళు కొరుకుతారు.

  14. దుష్టుల చేతులు విరిగిపోతాయి, నీతిమంతులను యెహోవా సంరక్షిస్తారు.

  15. నిందారహితులు తమ రోజులు యెహోవా సంరక్షణలో గడుపుతారు, వారి వారసత్వం శాశ్వతంగా ఉంటుంది.

  16. విపత్తు సమయాల్లో వారు వాడిపోరు; కరువు దినాల్లో వారు సమృద్ధిని అనుభవిస్తారు.

  17. కాని దుష్టులు నశిస్తారు: యెహోవా శత్రువులు పొలంలో ఉండే పూవుల్లా ఉన్నా, వారు కాల్చబడతారు పొగలా పైకి వెళ్తారు.

  18. దుష్టులు అప్పు తెచ్చుకుంటారు కాని తీర్చరు, కాని నీతిమంతులు దయ కలిగి ఇస్తారు.

  19. యెహోవా ఆశీర్వదించినవారు భూమిని స్వాధీనపరచుకుంటారు, కాని ఆయన శపించినవారు నాశనమౌతారు.

  20. నేను దుష్టులను, క్రూరులైన మనుష్యులను చూశాను; వారు స్వస్థలంలో ఏపుగా పెరుగుతున్న చెట్టులా ఉన్నారు.

  21. కాని అంతలోనే వారు గతించిపోయారు; నేను వారి కోసం వెదికినా వారు కనబడలేదు.

  22. నిర్దోషులను గమనించు, యథార్థ హృదయులను గమనించు; సమాధానం వెదకే వారి కోసం భవిష్యత్తు వేచి ఉంది.

  23. కాని పాపులందరు నశిస్తారు, దుష్టులకు భవిష్యత్తు ఉండదు.

  24. తమ సంపదను ఇతరులకు వదిలేసి జ్ఞానులు చనిపోవడం, మూర్ఖులు తెలివిలేనివారు నశించడం అందరు చూస్తారు.

  25. వారు తమ భూములకు తమ పేర్లే పెట్టుకున్నప్పటికి సమాధే వారి నిత్య నివాసము అక్కడే వారు నిత్యం నివసిస్తారు.