Skip to content

Vision గురించి బైబిల్ వచనాలు

116 వచనాలు · 17 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ఇశ్రాయేలు రాజు యెహోషాపాతుతో, “నా గురించి ఇతడు ఎన్నడు మంచిని ప్రవచించడు, చెడు మాత్రమే ప్రవచిస్తాడు అని మీతో చెప్పలేదా?” అని అన్నాడు.

  2. మీకాయా ఇంకా ఇలా అన్నాడు, “కాబట్టి యెహోవా మాట వినండి: యెహోవా తన సింహాసనంపై కూర్చుని ఉండగా తన చుట్టూ తన కుడి ఎడమలు పరలోక సమూహాలన్ని నిలబడి ఉండడం నేను చూశాను.

  3. అప్పుడు యెహోవా, ‘అహాబు రామోత్ గిలాదు మీదికి వెళ్లి అక్కడ చచ్చేలా అతన్ని ఎవరు ప్రలోభపెడతారు?’ అని అడిగారు. “ఒకడు ఒక విధంగా ఇంకొకడు ఇంకొక విధంగా చెప్పారు.

  4. చివరికి ఒక ఆత్మ ముందుకు వచ్చి యెహోవా సమక్షంలో నిలబడి, ‘నేను అతన్ని ప్రలోభపెడతాను’ అన్నాడు.

  5. “ ‘ఎలా?’ అని యెహోవా అడిగారు. “ ‘నేను వెళ్లి అతని ప్రవక్తలందరి నోట మోసగించే ఆత్మగా ఉంటాను’ అని అతడు చెప్పాడు. “అందుకు యెహోవా, ‘నీవు అతన్ని ప్రలోభపెట్టడంలో విజయం సాధిస్తావు. వెళ్లు అలాగే చేయి’ అన్నారు.

  6. “కాబట్టి యెహోవా నీ ఈ ప్రవక్తలందరి నోట మోసపరచే ఆత్మను ఉంచారు. యెహోవా ఈ విపత్తును నీకోసం నిర్ణయించారు.”

  7. వారు కలిసి మాట్లాడుతూ నడుస్తూ వెళ్తున్నప్పుడు, అకస్మాత్తుగా అగ్ని గుర్రాలతో ఉన్న అగ్ని రథం వచ్చి వారిద్దరిని వేరు చేసింది. ఏలీయా సుడిగాలిలో ఆకాశంలోకి పైకి వెళ్లిపోయాడు.

  8. అప్పుడు ఎలీషా, “యెహోవా, ఇతడు చూచేటట్టు ఇతడి కళ్లు తెరవండి” అని ప్రార్థన చేశాడు. అప్పుడు యెహోవా ఆ సేవకుని కళ్లు తెరిపించగా ఎలీషా చుట్టూరా కొండ మీదంతా నిప్పులాంటి గుర్రాలు, రథాలు అతనికి కనిపించాయి.

  9. దేవుడు యెరూషలేమును నాశనం చేయడానికి ఒక దూతను పంపారు. అయితే ఆ దూత దానిని నాశనం చేస్తున్నప్పుడు, జరిగిన కీడును చూసి యెహోవా మనస్సు కరిగి ప్రజలను నాశనం చేస్తున్న దూతతో, “ఇక చాలు! నీ చేయి వెనుకకు తీసుకో” అని చెప్పారు. ఆ సమయంలో యెహోవా దూత యెబూసీయుడైన ఒర్నాను నూర్పిడి కళ్ళం దగ్గర నిలబడ్డాడు.

  10. దావీదు పైకి చూసినప్పుడు భూమికి ఆకాశానికి మధ్యలో నిలబడి, కత్తి పట్టుకుని దానిని యెరూషలేము మీద చాపి ఉంచిన యెహోవా దూత అతనికి కనిపించాడు. అప్పుడు దావీదు, పెద్దలు గోనెపట్ట కట్టుకుని సాష్టాంగపడ్డారు.

  11. దావీదు దేవునితో, “యుద్ధవీరులను లెక్కించమని ఆదేశించింది నేనే కదా? గొర్రెల కాపరినైన నేను పాపం చేశాను! వీరు గొర్రెల వంటి వారు, వీరేమి చేశారు? యెహోవా! నా దేవా, మీ చేతులు నా మీద నా కుటుంబం మీద పడనివ్వండి, కాని మీ ప్రజలమీదికి ఈ తెగులు రానివ్వకండి” అన్నాడు.

  12. అప్పుడు యెహోవా దూత యెబూసీయుడైన ఒర్నాను నూర్పిడి కళ్ళంలో యెహోవాకు బలిపీఠం కట్టించాలని దావీదుకు చెప్పమని గాదుకు ఆజ్ఞాపించాడు.

  13. అప్పుడు మీకాయా జవాబిస్తూ, “ఇశ్రాయేలీయులందరు కాపరి లేని గొర్రెల్లా కొండలమీద చెదిరిపోయినట్లు దర్శనం చూశాను. ‘ఈ ప్రజలకు యజమాని లేడు. ప్రతి ఒక్కరు సమాధానంగా ఇంటికి వెళ్లాలి’ అని యెహోవా చెప్తున్నారు” అన్నాడు.

  14. ఇశ్రాయేలు రాజు యెహోషాపాతుతో, “నా గురించి ఇతడు ఎన్నడు మంచిని ప్రవచించడు, చెడు మాత్రమే ప్రవచిస్తాడు అని మీతో చెప్పలేదా?” అని అన్నాడు.

  15. మీకాయా ఇంకా ఇలా అన్నాడు, “కాబట్టి యెహోవా మాట వినండి: యెహోవా తన సింహాసనంపై కూర్చుని ఉండగా తన కుడి ఎడమలు పరలోక సమూహాలన్ని నిలబడి ఉండడం నేను చూశాను.

  16. అప్పుడు యెహోవా, ‘ఇశ్రాయేలు రాజైన అహాబు రామోత్ గిలాదు మీదికి వెళ్లి అక్కడ చచ్చేలా అతన్ని ఎవరు ప్రలోభపెడతారు?’ అని అడిగారు. “ఒకడు ఒక విధంగా ఇంకొకడు ఇంకొక విధంగా చెప్పారు.

  17. చివరికి ఒక ఆత్మ ముందుకు వచ్చి, యెహోవా సమక్షంలో నిలబడి, ‘నేను అతన్ని ప్రలోభపెడతాను’ అన్నాడు. “ ‘ఎలా?’ అని యెహోవా అడిగారు.

  18. “ ‘నేను వెళ్లి అతని ప్రవక్తలందరి నోట మోసగించే ఆత్మగా ఉంటాను’ అని అతడు చెప్పాడు. “అందుకు యెహోవా, ‘నీవు అతన్ని ప్రలోభపెట్టడంలో విజయం సాధిస్తావు, వెళ్లు అలాగే చేయి’ అన్నారు.

  19. “కాబట్టి యెహోవా నీ ఈ ప్రవక్తల నోట మోసపరచే ఆత్మను ఉంచారు. యెహోవా ఈ విపత్తును నీకోసం నిర్ణయించారు.”

  20. దేవుని భయం కలిగి ఉండాలని తనకు బోధించిన జెకర్యా దినాల్లో అతడు దేవున్ని అనుసరించాడు. అతడు యెహోవాను అనుసరించినంత కాలం దేవుడు అతనికి విజయాన్ని ఇచ్చారు.

  21. “నాకొక విషయం రహస్యంగా తెలిసింది, నా చెవులు దాని గుసగుసను విన్నాయి.

  22. ప్రజలు గాఢనిద్రలో ఉన్నప్పుడు, రాత్రి వచ్చి కలవరపెట్టే కలలలో అది తెలిసింది,

  23. భయం వణకు నన్ను చుట్టుకొని నా ఎముకలన్నీ కదిలేలా చేశాయి.

  24. ఒక ఆత్మ నా ముఖాన్ని తాకుతూ వెళ్లింది, నా శరీర రోమాలు నిక్కబొడుచుకున్నాయి.

  25. అది నా దగ్గర నిలిచింది, కాని అది ఏమిటో నేను చెప్పలేను. ఒక రూపం నా కళ్ళ ముందు నిలబడింది, మెల్లగా ఒక స్వరం నాకు వినిపించింది.