కంటెంట్‌కు వెళ్లండి

The Tribe Of Zebulun గురించి బైబిల్ వచనాలు

46 వచనాలు · 23 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ఇది శారీదు నుండి సూర్యోదయం వైపు కిస్లోత్-తాబోరు భూభాగానికి తూర్పుగా తిరిగి దాబెరతు, యాఫీయా వరకు వెళ్లింది.

  2. తర్వాత తూర్పు వైపు గాత్-హెఫెరు, ఎత్ కాజీను వరకు కొనసాగింది; అది రిమ్మోను దగ్గరకు వచ్చి నేయా వైపు తిరిగింది.

  3. అక్కడ సరిహద్దు ఉత్తరాన హన్నాతోను వరకు వెళ్లి ఇఫ్తా ఎల్ లోయ దగ్గర ముగిసింది.

  4. కట్టాతు, నహలాలు, షిమ్రోను, ఇదాలా, బేత్లెహేము అనే పన్నెండు పట్టణాలు, వాటి గ్రామాలు ఉన్నాయి.

  5. ఈ పట్టణాలు, వాటి గ్రామాలు జెబూలూనుకు దాని వంశాల ప్రకారం వారసత్వంగా ఉన్నాయి.

  6. జెబూలూను గోత్రం వారు కూడా కిత్రోను నహలోలులో ఉన్న కనానీయులను వెళ్లగొట్టలేదు, కాబట్టి కనానీయులు వారి మధ్యలోనే నివసించారు. అయితే జెబూలూనీయులు వారితో వెట్టిపనులు చేయించారు.

  7. బారాకు జెబూలూనీయులను నఫ్తాలీయులను కెదెషుకు పిలిపించినప్పుడు పదివేలమంది పురుషులు అతనితో వెళ్లారు. దెబోరా కూడా అతనితో వెళ్లింది.

  8. కొందరు అమాలేకులో స్థిరపడినవారు ఎఫ్రాయిం నుండి వచ్చారు; నీ వెంట వచ్చిన వారిలో బెన్యామీను వారు ఉన్నారు. మాకీరు నుండి అధిపతులు వచ్చారు, జెబూలూను నుండి అధికారుల దండం మోసేవారు వచ్చారు.

  9. జెబూలూను ప్రజలు తమ ప్రాణాలను పణంగా పెట్టుకున్నారు; యుద్ధభూమిలో నఫ్తాలి ప్రజలు కూడా అలాగే చేశారు.

  10. అతడు మనష్షే వారి దగ్గరికి దూతను పంపి తనను కలవమని చెప్పాడు, అలాగే ఆషేరు, జెబూలూను, నఫ్తాలి వారి దగ్గరకు కూడా దూతలను పంపాడు.

  11. అతని తర్వాత, జెబూలూను వాడైన ఎలోను ఇశ్రాయేలును పది సంవత్సరాలు నడిపించాడు.

  12. తర్వాత ఎలోను చనిపోయాడు, జెబూలూను ప్రదేశంలో అయ్యాలోనులో పాతిపెట్టబడ్డాడు.

  13. జెబూలూనీయులలో అన్ని రకాల యుద్ధ ఆయుధాలు ధరించి యుద్ధానికి వెళ్లగలిగిన యుద్ధ నైపుణ్యం కలవారు, దావీదుకు నమ్మకంగా ఉండి యుద్ధం చేయగలవారు 50,000 మంది;

  14. జెబూలూనీయుల మీద: ఓబద్యా కుమారుడైన ఇష్మయా; నఫ్తాలీయుల మీద: అజ్రీయేలు కుమారుడైన యెరీమోతు;

  15. వార్తాహరులు జెబూలూను ప్రదేశం వరకు ఎఫ్రాయిం మనష్షేల దేశాల్లోని ప్రతి పట్టణానికి వెళ్లారు. అయితే ప్రజలు వారిని తృణీకరించి నవ్వులపాలు చేశారు.

  16. కాని, ఆషేరు, మనష్షే, జెబూలూను గోత్రాల్లో కొంతమంది తమను తాము తగ్గించుకొని యెరూషలేముకు వచ్చారు.

  17. ఎఫ్రాయిం మనష్షే, ఇశ్శాఖారు, జెబూలూను ప్రదేశాల నుండి వచ్చిన వారిలో చాలామంది తమను పవిత్రం చేసుకోలేదు. అయినా లేఖనాలకు విరుద్ధంగా వారు పస్కాను తిన్నారు. వారి కోసం హిజ్కియా ఇలా ప్రార్థన చేశాడు: “మంచివారైన యెహోవా, ప్రతి ఒక్కరిని క్షమించును గాక!

  18. అయినప్పటికీ బాధలో ఉన్నవారికి ఇక చీకటి ఉండదు. పూర్వకాలంలో ఆయన జెబూలూను, నఫ్తాలి ప్రాంతాలను అవమానపరిచారు కాని రాబోయే కాలంలో ఆయన సముద్ర ప్రాంతాన్ని అనగా యొర్దానుకు అవతలనున్న సముద్రతీరంలో యూదేతరులు ఉండే గలిలయ ప్రాంతాన్ని ఘనపరుస్తారు.

  19. ఆయన నజరేతును వదిలి జెబూలూను, నఫ్తాలి ప్రాంతపు సముద్రతీరాన ఉన్న కపెర్నహూముకు వెళ్లారు. వారు అక్కడ కొన్ని రోజులు నివసించారు.

  20. ప్రవక్తయైన యెషయా ద్వారా చెప్పబడిన:

  21. “జెబూలూను, నఫ్తాలి ప్రాంతాల్లో, యొర్దానుకు అవతలనున్న సముద్రతీరంలో, యూదేతరులు ఉండే గలిలయ ప్రాంతంలో,