కంటెంట్‌కు వెళ్లండి

The, Are Compared To Wicked గురించి బైబిల్ వచనాలు

58 వచనాలు · 55 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. వస్త్రాన్ని కొరికినట్లు చిమ్మెట వారిని తినివేస్తుంది; పురుగు బొచ్చును కొరికినట్లు వారిని మ్రింగివేస్తుంది. అయితే నా నీతి నిత్యం ఉంటుంది, నా రక్షణ తరతరాలు ఉంటుంది.”

  2. ముండ్ల చెట్లకు బదులు సరళ వృక్షాలు పెరుగుతాయి, దురదగొండి చెట్లకు బదులు గొంజిచెట్లు ఎదుగుతాయి. ఇది యెహోవా కీర్తిగా నిత్యమైన గుర్తుగా ఎప్పటికీ నిలిచి ఉంటుంది.”

  3. దుర్మార్గులు ఎగసిపడే సముద్రం వంటివారు. అది నెమ్మదిగా ఉండలేదు, దాని అలలు బురదను మురికిని పైకి తెస్తాయి.

  4. వారంతా మొండి తిరుగుబాటుదారులు, వారు అభాండాలు వేస్తూ తిరుగుతున్నారు. వారు ఇత్తడి, ఇనుము లాంటివారు; వారంతా అవినీతికి పాల్పడుతున్నారు.

  5. వారు తిరస్కరించబడిన వెండి అని పిలువబడతారు, ఎందుకంటే యెహోవా వారిని తిరస్కరించారు.”

  6. నేను జాగ్రత్తగా విన్నాను, కానీ వారు సరియైనది చెప్పరు. “నేనేం చేశాను?” అని అంటూ, వారిలో ఎవ్వరూ తమ దుష్టత్వాన్ని బట్టి పశ్చాత్తాపపడరు. యుద్ధంలోకి గుర్రం దూసుకెళ్లినట్లుగా, ప్రతి ఒక్కరూ తమ సొంత మార్గాన్ని వెంటే వెళ్తారు.

  7. వారు బంజరు భూములలో పొదలా ఉంటారు; వృద్ధి కలిగినప్పుడు వారు దానిని చూడరు. వారు ఎడారిలోని ఎండిన ప్రదేశాల్లో, ఎవరూ నివసించని ఉప్పు భూమిలో నివసిస్తారు.

  8. “ ‘అయితే, నేను యూదా రాజైన సిద్కియాకు, అతని అధికారులకు, యెరూషలేములో మిగిలిన వారికి ఈజిప్టులో నివసిస్తున్న వారికి తినలేనంతగా పాడైన అంజూర పండ్లకు చేసినట్టు చేస్తానని యెహోవా ప్రకటిస్తున్నారు.

  9. మనుష్యకుమారుడా, వారికి, వారి మాటలకు భయపడకు. నీ చుట్టూ ముండ్లపొదలు ముళ్ళు ఉన్నా, తేళ్ల మధ్య నివసిస్తున్నా నీవు భయపడకు. వారు తిరుగుబాటు చేసే ప్రజలు కాబట్టి వారు అన్న వాటికి వారి చూపులకు నీవేమి భయపడకు.

  10. “మనుష్యకుమారుడా, ఇశ్రాయేలీయులు నా దృష్టికి లోహపు మడ్డిలాంటి వారు; వారంతా కొలిమి లోపల మిగిలిపోయిన రాగి, తగరం, ఇనుము, తగరం వంటివారు. వారు వెండి లోహపు మడ్డి వంటివారు.

  11. ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: ‘మీరంతా లోహపు మడ్డిలా ఉన్నారు కాబట్టి నేను మిమ్మల్ని యెరూషలేము మధ్యకు పోగుచేస్తాను.

  12. వారంతా వ్యభిచారులు, పొయ్యిలా మండుతూ ఉంటారు, వంటమనిషి ముద్ద పిసికిన తర్వాత అది పొంగే వరకు వేడి చేసిన పొయ్యివంటి వారు.

  13. కాబట్టి వారు ఉదయకాలపు పొగలా ఉంటారు, ఉదయకాలపు మంచులా అదృశ్యం అవుతారు, నూర్పిడి కళ్ళంలో నుండి గాలికి ఎగిరే పొట్టులా ఉంటారు, కిటికీలో గుండా పోయే పొగలా అయిపోతారు.

  14. “ప్రజలు యెహోవాకు విరోధంగా పాపం చేశారు, కాబట్టి మనుష్యులందరి మీదికి నేను బాధను రప్పించగా వారు గ్రుడ్డివారిలా తడుముకుంటారు. వారి రక్తం దుమ్ములా, వారి మాంసం పెంటలా పారవేయబడుతుంది.

  15. “తీర్పు దినం ఖచ్చితంగా వస్తుంది; అది మండుతున్న కొలిమిలా ఉంటుంది. గర్విష్ఠులందరూ, కీడుచేసే ప్రతివాడు ఎండుగడ్డిలా ఉంటారు” అని సైన్యాల యెహోవా ప్రకటిస్తున్నారు. “రాబోయే ఆ రోజున వారు కాలిపోతారు, వారికి వేరు గాని, కొమ్మ గాని మిగలదు.

  16. నేను నియమించే ఆ రోజున దుర్మార్గులు మీ కాళ్లక్రింద ధూళిలా ఉంటారు, మీరు వారిని త్రొక్కివేస్తారు” అని సైన్యాల యెహోవా చెప్తున్నారు.

  17. గోధుమల నుండి పొట్టును వేరు చేయడానికి తన చేతిలో చేటతో ఆయన సిద్ధంగా ఉన్నారు. ఆయన గోధుమలను తన ధాన్యపు కొట్టులో పోసి, తన నూర్చెడి కళ్లాన్ని శుభ్రం చేసి, పొట్టును ఆరని అగ్నిలో కాల్చివేస్తారు” అని అన్నాడు.

  18. “పవిత్రమైన వాటిని కుక్కలకు పెట్టకండి. మీ ముత్యాలను పందుల ముందు వేయకండి. మీరు అలా చేస్తే ఆ పందులు తమ కాళ్లతో వాటిని త్రొక్కివేసి, మీమీద పడి మిమ్మల్ని ముక్కలుగా చీల్చివేస్తాయి.

  19. అయితే నా మాటలు విని వాటి ప్రకారం చేయనివారు ఇసుక మీద ఇల్లు కట్టుకున్న తెలివిలేనివారిని పోలినవారు.

  20. “ఈ తరం వారిని నేను దేనితో పోల్చాలి? వారు సంత వీధుల్లో కూర్చుని ఇతరులను పిలుస్తూ అని చెప్పుకునే చిన్న పిల్లల్లా ఉంటారు:

  21. మరికొన్ని విత్తనాలు మట్టి ఎక్కువగా లేని రాతి నేలలో పడ్డాయి. మట్టి లోతు లేకపోయినా అవి త్వరగానే మొలకెత్తాయి.

  22. పొలం అనేది ఈ లోకము. మంచి విత్తనాలు పరలోక రాజ్యానికి సంబంధించినవారు. కలుపు మొక్కలు దుష్టునికి సంబంధించినవారు.

  23. ఆ వల నిండిన తర్వాత జాలరులు దానిని ఒడ్డుకు లాగి వాటిలోని మంచి చేపలను బుట్టల్లో వేసుకుని పనికిమాలిన వాటిని అవతల పారవేస్తారు.

  24. వారిని వదిలిపెట్టండి; వారు గ్రుడ్డి మార్గదర్శకులు. గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి దారి చూపిస్తే, వారిద్దరు గుంటలో పడతారు” అన్నారు.

  25. “వేషధారులైన ధర్మశాస్త్ర ఉపదేశకులారా, పరిసయ్యులారా మీకు శ్రమ! మీరు సున్నం కొట్టిన సమాధుల్లా ఉన్నారు. అవి బయటకు అందంగా కనిపించినా లోపల మృతుల ఎముకలతోను అపవిత్రమైన దానితో నిండి ఉన్నాయి.