Skip to content

The, Are Compared To Wicked గురించి బైబిల్ వచనాలు

58 వచనాలు · 55 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. వారి ప్రజలు బలహీనులై, భయాక్రాంతులై అవమానం పాలయ్యారు. వారు పొలంలో మొక్కల్లా, పచ్చని మొక్కల్లా, ఇంటికప్పు మీద పెరిగే గడ్డిలా పెరగక ముందే వాడిపోయినట్టు ఉన్నారు.

  2. అడవి గాడిదపిల్ల మనిషిగా పుడుతుందేమో కాని, తెలివిలేనివాడు తెలివైనవానిగా మారడం కష్టము.

  3. కలలా వారు చెదిరిపోయి కనుమరుగవుతారు, రాత్రి స్వప్నంలా వారు చెదిరిపోతారు.

  4. వారు ఎంత తరచుగా గాలి ముందు ఉనకలా, తుఫానుకు కొట్టుకుపోయే పొట్టులా ఉంటారు?

  5. అయితే దుష్టులు అలా ఉండరు! వారు గాలికి కొట్టుకుపోయే పొట్టులా ఉంటారు.

  6. వేట కోసం ఆకలిగొని ఉన్న సింహంలా, చాటున పొంచి ఉన్న కొదమసింహంలా వారు ఉన్నారు.

  7. మీరు యుద్ధం చేయడానికి ప్రత్యక్షమైనప్పుడు, మీరు వారిని అగ్నిగుండంలో కాల్చివేస్తారు. యెహోవా తన ఉగ్రతతో వారిని మ్రింగివేస్తారు, ఆయన అగ్ని వారిని దహించి వేస్తుంది.

  8. ఎన్నో ఎద్దులు నన్ను చుట్టుముట్టాయి; బాషాను బలమైన ఎద్దులు నన్ను చుట్టూ మూగాయి.

  9. గడ్డిలా వారు త్వరలోనే వాడిపోతారు, పచ్చ మొక్కల్లా వారు త్వరలోనే ఎండిపోతారు.

  10. నేను దుష్టులను, క్రూరులైన మనుష్యులను చూశాను; వారు స్వస్థలంలో ఏపుగా పెరుగుతున్న చెట్టులా ఉన్నారు.

  11. మనుష్యులు ఎంత సంపద ఉన్నా నశించకుండ ఉండలేరు; నశించే జంతువుల్లా వారు ఉన్నారు.

  12. వారి విషం భయంకరమైన పాముల విషం లాంటిది చెవులు మూసుకున్న నాగుపాములా వారున్నారు

  13. మీరు వారిని పొగలా ఊదివేయండి; మైనం అగ్నికి కరిగి పోయినట్టు దుష్టులు దేవుని ఎదుట నశించెదరు గాక.

  14. నా దేవా, వారిని సుడి తిరిగే దుమ్ములా, గాలి ముందు కొట్టుకుపోయే పొట్టులా చేయండి.

  15. ¶ When the wicked spring as the grass, and when all the workers of iniquity do flourish; it is that they shall be destroyed for ever:

  16. వాటిని తయారుచేసేవారు, వాటిని నమ్మేవారు వాటి లాగే ఉంటారు.

  17. వారు కందిరీగల్లా నా చుట్టూ తిరిగారు, కాని మండుతున్న ముళ్ళపొదల్లా వారు త్వరగా కాలిపోయారు; యెహోవా పేరట నేను వారిని ఛేదించాను.

  18. భూమి మీద ఉన్న దుష్టులందరిని మీరు లోహపు మడ్డిలా విస్మరిస్తారు; కాబట్టి నేను మీ శాసనాలను ప్రేమిస్తాను.

  19. సుడిగాలి వచ్చినపుడు దుష్టులు లేకుండా పోతారు, కానీ నీతిమంతులు దృఢంగా నిలిచి ఉంటారు.

  20. తన మూర్ఖత్వాన్ని మరల కనుపరచు బుద్ధిహీనుడు తను కక్కిన దానికి తిరిగిన కుక్క వంటివాడు.

  21. చెడు హృదయంతో ప్రేమపూర్వకమైన మాటలు మట్టిపాత్రల మీద వెండి లోహపు మడ్డితో పూసినట్టు ఉంటాయి.

  22. మీరు ఆకులు వాడిపోతున్న సింధూర వృక్షంలా, నీరు లేని తోటలా అవుతారు.

  23. సైన్యాల యెహోవా ఉగ్రత వలన భూమి కాలిపోతుంది ప్రజలు అగ్నికి ఇంధనం అవుతారు; వారిలో ఒకరిపై మరొకరికి కనికరం ఉండదు.

  24. అయితే నీవు తిరస్కరించబడిన కొమ్మలా నీ సమాధి నుండి పారవేయబడ్డావు. నీవు చంపబడినవారితో కత్తితో పొడవబడిన వారితో పాతాళంలో ఉన్న రాళ్ల దగ్గరకు దిగిపోయిన వారితో కప్పబడి ఉన్నావు. కాళ్లతో తొక్కబడిన శవంలా ఉన్నావు.

  25. ప్రభువైన యెహోవా నాకు సహాయం చేస్తారు. నన్ను ఎవరు ఖండిస్తారు? వారందరూ వస్త్రంలా పాతబడిపోతారు. చిమ్మెటలు వారిని తినివేస్తాయి.