Skip to content

Solomon గురించి బైబిల్ వచనాలు

301 వచనాలు · 46 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. మీరు ధరించిన వస్త్రాలన్ని గోపరసం, అగరు, లవంగపట్ట సుగంధంతో గుభాళిస్తున్నాయి. దంతం చేత అలంకరించబడిన భవనాలలో నుండి తంతి వాయిద్యాలు మోగుతూ ఉంటే మీకెంతో ఆనందము.

  2. ఘనత వహించిన స్త్రీలలో రాజుల కుమార్తెలున్నారు. ఓఫీరు దేశపు సువర్ణాభరణాలతో అలంకరించుకుని రాణి మీ కుడి ప్రక్కన నిలిచి ఉంది.

  3. కుమారీ, విను, శ్రద్ధగా ఈ మాటలు విను: నీ సొంత ప్రజలను నీ పుట్టింటిని మరచిపో.

  4. రాజు నీ అందానికి పరవశించును గాక; ఆయన నీ ప్రభువు, ఆయనను ఘనపరచు.

  5. తూరు నగర కుమారి కానుకలతో మీ దగ్గరకు వస్తుంది, ధనికులు మీ దయ కోసం చూస్తారు.

  6. అంతఃపురంలో రాజకుమారి వైభవంలో నిండుతనం ఉంది. ఆమె ధరించిన ఖరీదైన వస్త్రాలు బంగారంతో బుట్టా వేసినవి.

  7. అందమైన కుట్టుపని చేసిన వస్త్రాలు ఆమె ధరించింది. ఆమెను రాజు దగ్గరకు తీసుకువస్తారు; ఆమె వెంట చెలికత్తెలు కన్యలు వస్తారు.

  8. వారిని ఆనందోత్సాహాలతో తీసుకురాగా, వారు రాజభవనంలో ప్రవేశిస్తారు.

  9. నీ కుమారులు నీ పూర్వికుల స్థానాన్ని తీసుకుంటారు; వారిని దేశమంతట అధికారులుగా నియమిస్తావు.

  10. నీ నామం తరతరాలు జ్ఞాపకం ఉండేలా చేస్తాను; ఈ కారణంగా జనములు నిత్యం నీకు కృతజ్ఞతలు చెప్తారు.

  11. యెహోవా దావీదుకు ఇలా ప్రమాణం చేశారు, అది నమ్మదగింది, ఆయన మాట తప్పనివారు: “మీ సంతానంలో ఒకనిని మీ సింహాసనం మీద కూర్చోబెడతాను.

  12. ప్రసంగినైన నేను, యెరూషలేములో ఇశ్రాయేలుకు రాజుగా ఉన్నాను.

  13. “చూడు, యెరూషలేములో నాకన్నా ముందు పాలించిన రాజులందరికంటే నేను గొప్పజ్ఞానిని; ఎంతో జ్ఞానాన్ని తెలివిని సంపాదించాను” అని నాలో నేను అనుకున్నాను.

  14. నేను గొప్ప పనులు మొదలుపెట్టాను: నా కోసం భవనాలు కట్టించుకున్నాను ద్రాక్షతోటలు నాటించాను.

  15. తోటలు, ఉద్యానవనాలు వేయించి వాటిలో అన్ని రకాల పండ్లచెట్లు నాటించాను.

  16. పెరుగుతున్న చెట్లకు నీరు అందించడానికి నేను చెరువులను త్రవ్వించాను.

  17. నా కోసం వెండి బంగారం సమకూర్చుకున్నాను. విదేశాల నుండి రాజ సంపదను సేకరించాను. గాయనీ గాయకులను, మనుష్యుల హృదయాన్ని సంతోషపరిచే వాటిని సంపాదించాను; స్త్రీలు కూడా నా దగ్గర ఉన్నారు.

  18. నాకన్నా ముందు యెరూషలేములోని వారందరికంటే నేనెంతో గొప్పవాడినై ఎంతో వృద్ధి చెందాను. వీటన్నిటిలో నా జ్ఞానం నాతోనే ఉంది.

  19. యెహోవా మందిరం కోసం సొలొమోను రాజు చేయించిన రెండు స్తంభాలు, గంగాళం, దాని క్రింద ఉన్న పన్నెండు ఇత్తడి ఎద్దులు, పీటలకున్న ఇత్తడిని తూకం వేయలేనంత ఎక్కువ బరువు కలవి.

  20. రాజైన దావీదు యెష్షయి కుమారుడు. దావీదు కుమారుడు సొలొమోను; అతని తల్లి అంతకుముందు ఊరియాకు భార్య.

  21. అయినా గొప్ప వైభవం కలిగి ఉన్న సొలొమోను కూడా ఈ పూలలో ఒక దానిలా అలంకరించబడలేదని నేను మీతో చెప్తున్నాను.

  22. దక్షిణదేశపు రాణి సొలొమోను జ్ఞానాన్ని వినడానికి భూమి అంచుల నుండి వచ్చింది, అయితే సొలొమోను కన్నా గొప్పవాడు ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి తీర్పు దినాన ఆమె ఈ తరం వారితో పాటు లేచి వారిని ఖండిస్తుంది.

  23. “అడవి పువ్వులు ఎలా ఎదుగుతున్నాయో చూడండి. అవి కష్టపడవు నేయవు. అయినా గొప్ప వైభవం కలిగి ఉన్న సొలొమోను కూడా ఈ పూలలో ఒక దానిలా అలంకరించబడలేదని నేను మీతో చెప్తున్నాను.

  24. ఆ గుడారాన్ని పొందుకొన్న తర్వాత, మన పితరులు యెహోషువ నాయకత్వంతో దేవుడు తమ ముందు నుండి వెళ్లగొట్టిన జనాలను నుండి స్వాధీనపరచుకున్న దేశంలోనికి తమతో పాటు దానిని తెచ్చారు. ఆ గుడారం దావీదు కాలం వరకు ఆ దేశంలోనే ఉన్నది.

  25. దావీదు దేవుని దయను అనుభవించినవాడై, యాకోబు దేవుని కోసం నివాస స్థలాన్ని ఏర్పాటుచేస్తానని దేవున్ని అడిగాడు.