Skip to content

Sickness గురించి బైబిల్ వచనాలు

120 వచనాలు · 47 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. అప్పుడు వారికి అన్నం సహించదు వారికి ఇష్టమైన భోజనమైనా సరే అసహ్యంగా ఉంటుంది.

  2. వారి మాంసం కృషించిపోయి, ఇంతకుముందు కనిపించని ఎముకలు ఇప్పుడు బయటకు కనబడతాయి.

  3. వారు సమాధికి దగ్గరవుతారు, వారి ప్రాణాలు మరణ దూతలకు దగ్గరవుతాయి.

  4. అయినాసరే వారికి ఒక దేవదూత ఉంటే, వేలాది దేవదూతల్లో ఒక దూతను, మనుష్యులు యథార్థంగా ఎలా ఉండాలో చెప్పడానికి పంపితే,

  5. ఆ దూతకు వారిపై దయ కలిగి దేవునితో, ‘వారిని సమాధిలోనికి దిగిపోకుండా కాపాడండి; వారి కోసం క్రయధనం నాకు దొరికిందని చెప్తాడు.

  6. యెహోవా, నా దేవా, సహాయం కోసం నేను మీకు మొరపెట్టగా, మీరు నన్ను స్వస్థపరిచారు.

  7. ప్రధాన గాయకునికి. దావీదు కీర్తన. యెహోవా, నేను మీలో ఆశ్రయం పొందాను; నన్ను ఎప్పటికీ సిగ్గుపడనీయకండి; మీ నీతిని బట్టి నన్ను విడిపించండి.

  8. మీరు నా వైపు చెవియొగ్గి, నన్ను విడిపించడానికి త్వరగా రండి; నా ఆశ్రయదుర్గమై, బలమైన కోటవై నన్ను కాపాడండి.

  9. మీరు నా కొండ, నా కోట; మీ నామాన్ని బట్టి నన్ను నడిపించండి.

  10. నా కోసం ఏర్పాటు చేయబడిన ఉచ్చులో పడకుండ నన్ను తప్పించండి, ఎందుకంటే మీరు నా ఆశ్రయమై ఉన్నారు.

  11. మీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను. యెహోవా నా నమ్మకమైన దేవా, నన్ను విడిపించండి.

  12. విగ్రహాలను వెంబడించే వారిని నేను అసహ్యించుకుంటాను; నేనైతే యెహోవాలో నమ్మకముంచాను.

  13. మీ మారని ప్రేమలో నేను ఆనందించి సంతోషిస్తాను, నా బాధను మీరు చూశారు నా వేదన మీకు తెలుసు.

  14. మీరు నన్ను శత్రువుల చేతికి అప్పగించలేదు నా పాదాలను విశాలమైన స్థలంలో ఉంచారు.

  15. అయినాసరే వారికి జబ్బు చేసినప్పుడు, నేను గోనెపట్ట చుట్టుకున్నాను, ఉపవాసముండి నన్ను నేను తగ్గించుకున్నాను. నా ప్రార్థనలకు జవాబు రానప్పుడు,

  16. యెహోవా వారి రోగ పడక మీద వారికి స్వస్థత కలిగిస్తారు; వారి అనారోగ్యం నుండి మీరు వారికి స్వస్థత కలుగ చేస్తారు.

  17. వేటగాని వల నుండి, మరణకరమైన తెగులు నుండి, ఆయన తప్పక విడిపిస్తారు.

  18. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పుతారు, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం; ఆయన నమ్మకత్వం నీకు డాలుగాను గోడగాను ఉంటుంది.

  19. రాత్రి భయాలకు గాని, పగటి పూట ఎగిరి వచ్చే బాణాలకు గాని,

  20. చీకటిలో సంచరించే తెగులుకు గాని, మధ్యహ్నం హఠాత్తుగా కలిగే నాశనానికి గాని, నీవు భయపడాల్సిన అవసరం లేదు.

  21. నీ ప్రక్కన వేయిమంది, నీ కుడి ప్రక్కన పదివేలమంది కూలవచ్చు, అయినా, అది నీ దగ్గరకు రాదు.

  22. దావీదు కీర్తన. నా ప్రాణమా, యెహోవాను స్తుతించు; నాలోని సమస్తమా, ఆయన పవిత్ర నామాన్ని స్తుతించు.

  23. నా ప్రాణమా, యెహోవాను స్తుతించు, ఆయన ఉపకారాలలో ఏదీ మరచిపోవద్దు.

  24. ఆయన నీ పాపాలను క్షమిస్తారు, నీ రోగాలను స్వస్థపరుస్తారు.

  25. కొందరు తమ తిరుగుబాటు మార్గాల ద్వారా మూర్ఖులయ్యారు వారి దోషాల వల్ల బాధలు అనుభవించారు.