Sickness గురించి బైబిల్ వచనాలు: Often manifests saving grace to sinners during
Often manifests saving grace to sinners during గురించి వచనాలు
“లేదా ఒకరు ఎముకల్లో నిరంతరం బాధ కలిగి నొప్పితో మంచం పట్టడం ద్వారా శిక్షించబడతారు.
అప్పుడు వారికి అన్నం సహించదు వారికి ఇష్టమైన భోజనమైనా సరే అసహ్యంగా ఉంటుంది.
వారి మాంసం కృషించిపోయి, ఇంతకుముందు కనిపించని ఎముకలు ఇప్పుడు బయటకు కనబడతాయి.
వారు సమాధికి దగ్గరవుతారు, వారి ప్రాణాలు మరణ దూతలకు దగ్గరవుతాయి.
అయినాసరే వారికి ఒక దేవదూత ఉంటే, వేలాది దేవదూతల్లో ఒక దూతను, మనుష్యులు యథార్థంగా ఎలా ఉండాలో చెప్పడానికి పంపితే,
ఆ దూతకు వారిపై దయ కలిగి దేవునితో, ‘వారిని సమాధిలోనికి దిగిపోకుండా కాపాడండి; వారి కోసం క్రయధనం నాకు దొరికిందని చెప్తాడు.
కొందరు తమ తిరుగుబాటు మార్గాల ద్వారా మూర్ఖులయ్యారు వారి దోషాల వల్ల బాధలు అనుభవించారు.
వారు ఆహారాన్ని అసహ్యించుకున్నారు మరణ ద్వారాల దగ్గరకు వచ్చారు.
అప్పుడు వారు తమ ఆపదలో యెహోవాకు మొరపెట్టారు, ఆయన వారిని వారి బాధ నుండి రక్షించారు.
తన వాక్కును పంపి దేవుడు వారిని స్వస్థపరిచాడు.
యెహోవా యొక్క మారని ప్రేమ కోసం మనుష్యులకు ఆయన చేసిన అద్భుత కార్యాల కోసం ఆయనకు కృతజ్ఞతలు చెల్లించును గాక,