Skip to content

Righteousness గురించి బైబిల్ వచనాలు

480 వచనాలు · 132 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. నీతిమంతులు తమ పొరుగువారికి దారి చూపుతారు, కానీ దుష్టుని ప్రవర్తన వానిని దారి తప్పిస్తుంది.

  2. నీతిమంతుల మార్గంలో జీవం ఉంటుంది; ఆ మార్గం మరణానికి దారితీయదు.

  3. నీతి నిజాయితీగల వ్యక్తిని కాపాడుతుంది, కాని దుష్టత్వం పాపిని పడగొడుతుంది.

  4. నీతిమంతులు కడుపునిండా భోజనం చేస్తారు, కానీ దుష్టులైన వారి కడుపు నిండదు.

  5. నీతి ఒక దేశాన్ని ఘనతకెక్కేలా చేస్తుంది, పాపం ప్రజలకు అవమానం తెస్తుంది.

  6. నీతిమంతుని ఇంట్లో గొప్ప ధననిధి ఉన్నది, కాని దుష్టుని కలుగు వచ్చుబడి కష్టానికి కారణము.

  7. దుష్టుల మార్గాన్ని యెహోవా అసహ్యించుకుంటారు, నీతిని అనుసరించేవారిని ఆయన ప్రేమిస్తారు.

  8. భక్తిహీనులకు యెహోవా దూరంగా ఉంటారు, నీతిమంతుల ప్రార్ధన ఆయన అంగీకరిస్తారు.

  9. రాజులు చెడ్డపనులు చేయడాన్ని అసహ్యించుకుంటారు, నీతి వలన సింహాసనం స్ధిరపరచబడుతుంది.

  10. నెరసిన వెంట్రుకలు వైభవం కలిగిన కిరీటం, అది నీతి మార్గంలో సాధించబడుతుంది.

  11. మనం బలులు అర్పించడం కంటే మనం సరియైనది, న్యాయమైనది చేయడమే యెహోవాకు ఎక్కువ ఇష్టము.

  12. నీతిని శాశ్వత ప్రేమను వెంటాడేవాడు ప్రాణాన్ని, వృద్ధిని, ఘనతను పొందుతాడు.

  13. రాజు ఎదుట నుండి చెడ్డ అధికారులను తొలగించండి, నీతి ద్వారా ఆయన సింహాసనం స్థాపించబడుతుంది.

  14. ఎవడు వెంటాడకుండానే దుష్టులు పారిపోతారు, కాని నీతిమంతులు సింహంలా ధైర్యంగా నిలబడతారు.

  15. నీతిమంతులు పేదవారికి న్యాయం జరగాలని చూస్తారు, కాని దుష్టులకు అలాంటి ఆలోచించరు.

  16. మీకు మేలు కలుగుతుందని నీతిమంతులకు చెప్పండి ఎందుకంటే వారు తాము చేసిన క్రియల ప్రతిఫలాన్ని అనుభవిస్తారు.

  17. ఇశ్రాయేలు వంశం సైన్యాల యెహోవా ద్రాక్షతోట, యూదా ప్రజలు ఆయన ఆనందించే ద్రాక్షలు. ఆయన న్యాయం కోసం చూడగా రక్తపాతం కనబడింది; నీతి కోసం చూడగా రోదనలు వినబడ్డాయి.

  18. కాని నీతిగా పేదలకు తీర్పు తీరుస్తాడు, భూమిపై ఉన్న పేదల కోసం న్యాయంతో నిర్ణయాలు తీసుకుంటాడు. అతడు తన నోటి దండంతో భూమిని కొడతాడు; తన పెదవుల ఊపిరిచేత దుష్టులను చంపుతాడు.

  19. నీతి అతని నడికట్టుగా ఉంటుంది నమ్మకత్వం అతని తుంటికి నడికట్టుగా ఉంటుంది.

  20. రాత్రివేళ నా ప్రాణం మీ కోసం ఆరాటపడుతుంది; ఉదయం నా ఆత్మ మిమ్మల్ని వెదుకుతుంది. మీ తీర్పులు భూమి మీదికి వచ్చినప్పుడు, ఈ లోక ప్రజలు నీతిని నేర్చుకుంటారు.

  21. కాని చెడ్డవారికి దయ చూపిస్తే, వారు నీతిని నేర్చుకోరు. యథార్థమైన దేశంలో ఉన్నా కూడా వారు చెడు చేస్తూనే ఉంటారు యెహోవా ఘనతను వారు పట్టించుకోరు.

  22. నేను న్యాయాన్ని కొలమానంగా, నీతిని మట్టపు గుండుగా చేస్తాను: వడగండ్లు మీ అబద్ధం అనే ఆశ్రయాన్ని తుడిచివేస్తాయి. మీ దాగుచోటు నీటికి కొట్టుకుపోతుంది.

  23. చూడండి, ఒక రాజు నీతిగా రాజ్యపాలన చేస్తాడు అధికారులు న్యాయంగా పాలిస్తారు.

  24. అప్పుడు యెహోవా న్యాయం అరణ్యంలో నివసిస్తుంది, ఆయన నీతి ఫలభరితమైన భూమిలో ఉంటుంది.

  25. సమాధానం ఆ నీతి యొక్క ఫలంగా ఉంటుంది; దాని ఫలితంగా నెమ్మది భద్రత నిత్యం కలుగుతాయి.