Righteousness గురించి బైబిల్ వచనాలు: Shall never be moved
Shall never be moved గురించి వచనాలు
నిందారహితంగా నడుచుకొనేవారు, నీతిని జరిగించేవారు, తమ హృదయం నుండి సత్యాన్ని మాట్లాడేవారు;
వడ్డీ తీసుకోకుండ బీదలకు డబ్బు అప్పిచ్చేవారు; నిర్దోషులకు వ్యతిరేకంగా లంచం తీసుకోనివారు. వీటిని చేసేవారు ఎన్నటికి కదిలించబడరు.
మీ భారాన్ని యెహోవాపై మోపండి ఆయన మిమ్మల్ని సంరక్షిస్తారు; నీతిమంతులను ఆయన ఎన్నడు కదలనివ్వరు.
నీతిమంతులు ఎన్నడు కదిలించబడరు, కాని దుష్టులు దేశంలో ఉండరు.
చెడుతనం ద్వారా మనుష్యులు స్ధిరపరచబడరు, అయితే నీతిమంతులు ఎప్పటికిని పెరికివేయబడరు.