Skip to content

Righteousness గురించి బైబిల్ వచనాలు

480 వచనాలు · 132 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. అప్పుడు నా ప్రజలు సమాధానకరమైన నివాసాల్లో సురక్షితమైన ఇళ్ళలో ఎలాంటి ఆటంకాలు లేని విశ్రాంతి స్థలాల్లో నివసిస్తారు.

  2. నీతిగా నడుచుకుంటూ నిజాయితీగా మాట్లాడేవారు, అవినీతి వలన వచ్చే లాభాన్ని విడిచిపెట్టి తమ చేతులతో లంచం తీసుకోకుండ, హత్య చేయాలనే కుట్రలు వినబడకుండ చెవులు మూసుకుని చెడుతనం చూడకుండ కళ్లు మూసుకునేవారు,

  3. వారు ఉన్నత స్థలాల్లో నివసిస్తారు, పర్వతాల కోటలు వారికి ఆశ్రయంగా ఉంటాయి. వారికి ఆహారం దొరుకుతుంది, వారికి నీళ్లు శాశ్వతంగా ఉంటాయి.

  4. మీ కళ్లు రాజును అతని వైభవంలో చూస్తాయి, విశాలంగా విస్తరించిన దేశాన్ని చూస్తాయి.

  5. “పైనున్న ఆకాశాల్లారా, నా నీతిని వర్షింపనివ్వండి; మేఘాలు వాటిని క్రిందికి కురిపించాలి. భూమి విశాలంగా తెరవాలి, రక్షణ మొలవాలి, నీతి దానితో కలిసి వర్ధిల్లాలి; యెహోవానైన నేను దానిని సృష్టించాను.

  6. ‘యెహోవాలోనే నీతి, బలము’ అని ప్రజలు నా గురించి చెప్తారు.” ఆయన మీద కోప్పడిన వారందరు ఆయన దగ్గరకు వస్తారు, వారు సిగ్గుపరచబడతారు.

  7. మొండి హృదయంతో నా నీతికి దూరంగా ఉన్నవారలారా, నా మాట వినండి.

  8. “యాకోబు వారసులారా, ఇశ్రాయేలు అనే పేరుతో పిలువబడి యూదా కుటుంబం నుండి వచ్చే వారలారా వినండి, యెహోవా పేరిట ప్రమాణం చేస్తూ ఇశ్రాయేలు దేవుని వేడుకుంటూ సత్యాన్ని గాని నీతి గాని అనుసరించని వారలారా వినండి.

  9. “నీతిని అనుసరిస్తూ యెహోవాను వెదికే వారలారా, నా మాట వినండి: మీరు ఏ బండ నుండి చెక్కబడ్డారో దానివైపు చూడండి, మీరు ఏ గని నుండి తీయబడ్డారో దానివైపు చూడండి;

  10. “సరియైనది తెలిసినవారలారా, నా మాట వినండి. నా బోధను హృదయంలో ఉంచుకున్న ప్రజలారా, వినండి: కేవలం మనుష్యులు వేసే నిందలకు భయపడకండి వారి దూషణకు దిగులుపడకండి.

  11. నీకు వ్యతిరేకంగా తయారుచేయబడిన ఏ ఆయుధం విజయం సాధించదు, నిన్ను దూషించే ప్రతి నాలుకను నీవు ఖండిస్తావు. యెహోవా సేవకులు పొందే స్వాస్థ్యం ఇదే, నా వలన వారికి కలిగే నిరూపణ ఇదే” అని యెహోవా ప్రకటిస్తున్నారు.

  12. మీరు సంతోషంగా బయటకు వెళ్తారు, మీరు సమాధానంగా తీసుకెళ్తారు. మీ ఎదుట పర్వతాలు కొండలు పాటలు పాడడం ప్రారంభిస్తాయి, పొలం లోని చెట్లన్నీ తమ చేతులతో చప్పట్లు కొడతాయి.

  13. ముండ్ల చెట్లకు బదులు సరళ వృక్షాలు పెరుగుతాయి, దురదగొండి చెట్లకు బదులు గొంజిచెట్లు ఎదుగుతాయి. ఇది యెహోవా కీర్తిగా నిత్యమైన గుర్తుగా ఎప్పటికీ నిలిచి ఉంటుంది.”

  14. “నేను కోరుకునే ఉపవాసం అన్యాయపు సంకెళ్ళను విప్పడం, బరువైన కాడి త్రాళ్లు తీసివేయడం, బాధించబడిన వారిని విడిపించడం, ప్రతీ కాడిని విరగ్గొట్టడం కాదా?

  15. మీ ఆహారాన్ని ఆకలితో ఉన్నవారితో పంచుకోవడం, ఇల్లు లేక తిరుగుతున్న పేదలకు ఆశ్రయం కల్పించడం, మీరు ఎవరినైనా నగ్నంగా చూస్తే, వారికి బట్టలు ఇవ్వడం, మీ రక్తసంబంధులకు ముఖం దాచకపోవడమే కదా ఉపవాసం?

  16. అప్పుడు మీ వెలుగు ఉదయకాంతిలా ప్రకాశిస్తుంది. మీకు వెంటనే స్వస్థత కలుగుతుంది; అప్పుడు మీ నీతి మీ ముందుగా నడుస్తుంది యెహోవా మహిమ మీ వెనుక కాపలాగా ఉంటుంది.

  17. అప్పుడు మీరు పిలిస్తే యెహోవా జవాబిస్తారు; మీరు మొరపెడితే ఆయన నేనున్నాను అంటారు. “మీరు ఇతరులను బాధించడం, వ్రేలుపెట్టి చూపిస్తూ చెడు మాట్లాడడం మానేస్తే,

  18. ఆకలితో ఉన్నవారికి మీ దగ్గర ఉన్నది ఇచ్చి, బాధించబడినవారి అవసరాలను తీరిస్తే, చీకటిలో మీ వెలుగు ప్రకాశిస్తుంది, మీ చీకటి మధ్యాహ్నపు వెలుగుగా మారుతుంది.

  19. యెహోవా మిమ్మల్ని నిత్యం నడిపిస్తారు; కరువు కాలంలో ఆయన మిమ్మల్ని తృప్తిపరచి మీ ఎముకలను బలపరుస్తారు. మీరు నీరు పెట్టిన తోటలా ఎప్పుడూ నీరు వచ్చే నీటి ఊటలా ఉంటారు.

  20. పూర్వకాలపు శిథిలాలను మీ ప్రజలు కడతారు. అనేక తరాల నాటి పునాదులను మీరు మరల వేస్తారు; మీరు కూలిన గోడలను మరమత్తు చేసే మేస్త్రీగా, నివాసయోగ్యంగా వీధుల్ని బాగు చేసేవారిగా పిలువబడతారు.

  21. “నా పరిశుద్ధ దినాన మీకు ఇష్టం వచ్చినట్లు చేయకుండా నా సబ్బాతును పాటిస్తే, సబ్బాతు ఆనందాన్ని కలిగిస్తుందని యెహోవా పరిశుద్ధ దినం ఘనమైనదని అనుకుంటే, దానిని గౌరవించి మీ సొంత మార్గంలో మీరు వెళ్లకుండా, మీకిష్టమైన పనులు చేయకుండా వట్టిమాటలు మాట్లాడకుండా ఉంటే,

  22. అప్పుడు మీరు యెహోవాలో ఆనందిస్తారు, దేశంలో ఉన్నతస్థలాల మీద నేను మిమ్మల్ని ఎక్కిస్తాను, మీ తండ్రియైన యాకోబు స్వాస్థ్యాన్ని మీరు అనుభవించేలా చేస్తాను.” యెహోవా తెలియజేసిన మాట ఇదే.

  23. ఎవరూ లేరని ఆయన చూశారు, మధ్యవర్తి ఎవరూ లేకపోవడం చూసి ఆయన ఆశ్చర్యపోయారు; కాబట్టి ఆయన చేయి ఆయనకు సహాయం చేసింది, ఆయన నీతి ఆయనను నిలబెట్టింది.

  24. ఆయన నీతిని తన కవచంగా ధరించారు, రక్షణను తన తలమీద శిరస్త్రాణంగా ధరించారు; ఆయన ప్రతీకార వస్త్రాలను ధరించారు పై వస్త్రం ధరించినట్లు ఆయన తనను తాను ఆసక్తితో చుట్టుకున్నారు.

  25. అప్పుడు నీ ప్రజలందరు నీతిమంతులుగా ఉంటారు; వారు దేశాన్ని శాశ్వతంగా స్వతంత్రించుకుంటారు. నా వైభవం కనుపరచడానికి వారు నేను నాటిన కొమ్మగా నా చేతుల పనిగా ఉంటారు.