Skip to content

Righteousness గురించి బైబిల్ వచనాలు

480 వచనాలు · 132 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. మీ భారాన్ని యెహోవాపై మోపండి ఆయన మిమ్మల్ని సంరక్షిస్తారు; నీతిమంతులను ఆయన ఎన్నడు కదలనివ్వరు.

  2. నీతిమంతులు యెహోవాయందు ఆనందించుదురు గాక. ఆయననే ఆశ్రయించెదరు గాక. యథార్థ హృదయులను ఆయన ఘనపరచుదురు గాక!

  3. ఆయన మీ ప్రజలకు నీతితో బాధితులకు న్యాయంతో తీర్పు తీర్చును గాక.

  4. రాజు నిజాయితీ కలిగి న్యాయాన్ని ప్రేమిస్తాడు కాబట్టి మీరు అతన్ని సుస్థిరంగా నిలబెడతారు; యాకోబు ప్రజల పట్ల అంటే ఇశ్రాయేలీయుల పట్ల నీతి నాయ్యాలు జరిగిస్తారు.

  5. నీచమైన దేనినైనా సరే నేను నా కళ్లెదుట ఉంచను. విశ్వాసం లేనివారు చేసేది నాకు అసహ్యం; అందులో నేను పాలుపంచుకోను.

  6. కుటిల హృదయం నాకు దూరమై పోవాలి; చెడుతో నాకు ఎటువంటి సంబంధం ఉండదు.

  7. న్యాయంగా ప్రవర్తించేవారు ధన్యులు, వారు ఎల్లప్పుడు సరియైనది చేస్తారు.

  8. చాలాసార్లు ఆయన విడిపించాడు, అయినా వారి తిరుగుబాటు ఆలోచనలు కార్యరూపం దాల్చాయి. తిరగబడి, అపరాధులై, దురవస్థ చెందారు.

  9. వారి ఇళ్ళలో ధనం, ఐశ్వర్యం ఉన్నాయి, వారి నీతి నిత్యం నిలిచి ఉంటుంది.

  10. దయ కనికరం గలవారికి నీతిమంతులకు, యథార్థవంతులకు చీకట్లో కూడా వెలుగు ఉదయిస్తుంది.

  11. దయతో అప్పు ఇచ్చేవారికి, తమ వ్యాపారాన్ని న్యాయంగా నిర్వహించే వారికి మేలు కలుగుతుంది.

  12. నీతిమంతులు ఎప్పటికీ కదల్చబడరు; వారు నిత్యం జ్ఞాపకంలో ఉంటారు.

  13. దుర్వార్తల వలన వారు భయపడరు; యెహోవా అందలి నమ్మకం చేత వారి హృదయం స్థిరంగా ఉంటుంది.

  14. వారి హృదయాలు భద్రంగా ఉన్నాయి, వారికి భయం ఉండదు; చివరికి వారు తమ శత్రువులపై విజయంతో చూస్తారు.

  15. వారు ధారాళంగా బహుమానాలను పేదలకు పంచిపెట్టారు, వారి నీతి నిరంతరం నిలిచి ఉంటుంది; వారి కొమ్ము ఘనత పొంది హెచ్చింపబడుతుంది.

  16. దుష్ట పథకాలను రూపొందించే వారు దగ్గరలో ఉన్నారు, కాని వారు మీ ధర్మశాస్త్రానికి దూరంగా ఉన్నారు.

  17. మీ యాజకులు మీ నీతిని ధరించుకొందురు గాక; నమ్మకస్థులైన మీ ప్రజలు సంతోషగానం చేయుదురు గాక.’ ”

  18. యెహోవా గుడ్డివారికి చూపునిస్తారు, యెహోవా క్రుంగి ఉన్నవారిని లేవనెత్తుతారు, యెహోవా నీతిమంతులను ప్రేమిస్తారు.

  19. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండడం గురించి నీవు తెలుసుకుంటావు, దేవుని తెలివిని కనుగొంటావు.

  20. ఎందుకంటే యెహోవాయే జ్ఞానాన్ని ప్రసాదించేవాడు; తెలివి వివేచన ఆయన నోట నుండే వస్తాయి.

  21. యథార్థవంతులకు విజయం దాచి ఉంచేది ఆయనే, నిందారహితులుగా నడుచుకొనే వారికి ఆయనే డాలు.

  22. ఎందుకంటే న్యాయం యొక్క కాలగతులు కాపాడేది ఆయనే, తన నమ్మకమైన వారిని కాపాడేది ఆయనే.

  23. అప్పుడు నీవు నీతిన్యాయాలను యథార్థతను, ప్రతి మంచి మార్గాన్ని గ్రహిస్తావు.

  24. జ్ఞానం నీ హృదయంలోకి వస్తుంది, తెలివి నీ ప్రాణానికి సంతోషాన్ని కలిగిస్తుంది.

  25. బుద్ధి నిన్ను కాపాడుతుంది, వివేకం నీకు కావలి కాస్తుంది.