కంటెంట్‌కు వెళ్లండి

Punishments గురించి బైబిల్ వచనాలు

133 వచనాలు · 47 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. షిమీ రాజుతో, “మీరు చెప్పింది మంచిది, మీ దాసుడననైన నేను నా ప్రభువైన రాజు చెప్పినట్లు చేస్తాను” అన్నాడు. కాబట్టి షిమీ యెరూషలేములో కొంతకాలం నివసించాడు.

  2. అయితే మూడేళ్ళ తర్వాత షిమీ దాసులలో ఇద్దరు పారిపోయి గాతు రాజు, మయకా కుమారుడైన ఆకీషు దగ్గరకు వెళ్లారు. “మీ దాసులు గాతులో ఉన్నారు” అని షిమీకి చెప్పబడింది.

  3. వెంటనే షిమీ తన గాడిదకు జీను కట్టుకుని తన దాసులను వెదకడానికి గాతులో ఉన్న ఆకీషు దగ్గరకు వెళ్లాడు. షిమీ వెళ్లి గాతు నుండి తన దాసులను తీసుకువచ్చాడు.

  4. షిమీ యెరూషలేము నుండి గాతుకు వెళ్లి, తిరిగివచ్చిన సంగతి సొలొమోనుకు తెలిసినప్పుడు,

  5. రాజు షిమీని పిలిపించి అతనితో, “ ‘నీవు ఉన్నచోట నుండి ఎక్కడికి వెళ్లినా నీవు ఖచ్చితంగా చస్తావు’ అని యెహోవా పేరిట ప్రమాణం చేయించి నిన్ను హెచ్చరించలేదా? అప్పుడు నీవు నాతో, ‘మీరు చెప్పింది మంచిది. నేను లోబడతాను’ అని అన్నావు.

  6. మరి ఎందుకు యెహోవా పేరిట నీవు చేసిన ప్రమాణాన్ని, నేను జారీ చేసిన ఆజ్ఞను పాటించలేదు?” అని అన్నాడు.

  7. రాజు షిమీతో ఇంకా మాట్లాడుతూ, “నీవు నా తండ్రియైన దావీదుకు చేసిన కీడు గురించి నీకు తెలుసు. ఇప్పుడు నీవు చేసిన చెడుకు యెహోవా నీకు తిరిగి చెల్లిస్తారు.

  8. కాని రాజైన సొలొమోను ఆశీర్వదించబడతాడు, దావీదు సింహాసనం యెహోవా ఎదుట నిరంతరం సుస్థిరంగా ఉంటుంది” అని అన్నాడు.

  9. తర్వాత రాజు యెహోయాదా కుమారుడైన బెనాయాకు ఆజ్ఞ ఇవ్వగా అతడు బయటకు వెళ్లి షిమీని కొట్టాడు. అతడు చనిపోయాడు. రాజ్యం సొలొమోను చేతుల్లో సుస్థిరమైంది.

  10. అంతేగాక యూదా సైన్యం మరో 10,000 మందిని ప్రాణాలతో పట్టుకుని, వారిని ఒక కొండచరియపైకి తీసుకెళ్లి అక్కడినుండి క్రిందికి పడవేశారు. వారంతా ముక్కలైపోయారు.

  11. నీ దేవుని ధర్మశాస్త్రాన్ని, రాజు చట్టాన్ని అతిక్రమించిన వారికి తప్పనిసరిగా మరణశిక్ష, దేశ బహిష్కరణ, ఆస్తుల జప్తు లేదా జైలు శిక్ష విధించాలి.

  12. నేను వారిని గద్దించి శపించాను. ఆ పురుషులలో కొంతమందిని కొట్టి వారి జుట్టు పెరికించాను. నేను వారితో దేవుని పేరిట ప్రమాణం చేయించి, “మీరు మీ కుమార్తెలకు వారి కుమారులతో పెళ్ళి చేయకూడదు, వారి కుమార్తెలతో మీరు మీ కుమారులు పెళ్ళి చేసుకోకూడదు.

  13. రాజు సేవచేసే నపుంసకులలో హర్బోనా అనే ఒకడు, “నిజానికి, రాజు తరపున మాట్లాడిన మొర్దెకైని చంపించడానికి హామాను తన ఇంటి వద్ద యాభై మూరల ఒక ఉరికంబాన్ని చేయించాడు” అని చెప్పాడు. వెంటనే రాజు, “దానిమీదే అతన్ని ఉరితీయండి” అని అన్నాడు.

  14. మొర్దెకై కోసం హామాను చేయించిన ఉరికంబం మీద హామానును ఉరితీశారు. అప్పుడు రాజు కోపం చల్లారింది.

  15. ఎందుకంటే అది దుష్టత్వం అవుతుంది, ఒక శిక్షించవలసిన పాపము.

  16. తాను చెప్పింది జరిగే వరకు, యెహోవా యోసేపు ప్రవర్తనను పరీక్షించారు, వారు అతని పాదాలను సంకెళ్ళతో గాయపరిచారు, అతని మెడ సంకెళ్ళలో ఉంచబడింది.

  17. అమాయకులకు జరిమానా విధించడం మంచిది కాకపోతే, నిజాయితీగల అధికారులను కొట్టడం సరికాదు.

  18. బుద్ధిహీనున్ని రోటిలోని గోధుమలలో వేసి రోకటితో దంచినా సరే వాని మూర్ఖత్వం వదిలిపోదు.

  19. నన్ను కొట్టినవారికి నా వీపు అప్పగించాను, నా గడ్డం పెరికినవారికి నా చెంపలు అప్పగించాను; హేళన చేసిన వారి నుండి, ఉమ్మివేసిన వారి నుండి నా ముఖం దాచుకోలేదు.

  20. అతడు యిర్మీయా ప్రవక్తను కొట్టించి, యెహోవా మందిరం దగ్గర బెన్యామీను ఎగువ ద్వారం దగ్గర ఉన్న కొయ్యకు బంధించాడు.

  21. కాబట్టి వారు యిర్మీయాను తీసుకెళ్లి, చెరసాల ప్రాంగణంలో ఉన్న రాజు కుమారుడైన మల్కీయా నీటి గోతిలోకి దింపినప్పుడు దాంట్లో వారు యిర్మీయాను త్రాళ్లతో నీటి గోతిలోకి దించారు; దాంట్లో నీళ్లు లేవు, బురద మాత్రమే ఉంది, యిర్మీయా ఆ బురదలో మునిగిపోయాడు.

  22. నేను రోషంతో నా కోపాన్ని చూపించగా కోపాగ్రతతో వారు నిన్ను శిక్షిస్తారు. వారు నీ ముక్కు నీ చెవులు నరికివేస్తారు, నీలో మిగిలి ఉన్నవారు కత్తివేటుకు కూలిపోతారు. నీ కుమారులను కుమార్తెలను వారు తీసుకెళ్తారు, నీలో మిగిలిన వారు అగ్నిచేత కాల్చబడతారు.

  23. రాజు కల్దీయ జ్యోతిష్యులతో, “నేను ఆ కలను మరచిపోయాను. మీరు నాకు వచ్చిన కలను, దాని భావాన్ని చెప్పకపోతే మిమ్మల్ని ముక్కలుగా చేసి, మీ ఇళ్ళను కూల్చివేస్తాను.

  24. దానికి సాగిలపడి పూజించని వారు వెంటనే మండుతున్న అగ్నిగుండంలో పడవేయబడతారు.”

  25. అప్పుడు రాజు ఆదేశం ఇవ్వగా, వారు దానియేలును తీసుకెళ్లి సింహాల గుహలో పడవేశారు. రాజు దానియేలుతో, “నీవు నిత్యం సేవిస్తున్న నీ దేవుడే నిన్ను రక్షిస్తాడు” అని అన్నాడు.