Punishments గురించి బైబిల్ వచనాలు: Sometimes deferred for a considerable time
Sometimes deferred for a considerable time గురించి వచనాలు
“సెరూయా కుమారుడు యోవాబు నాకు ఏమి చేశాడో నీకే తెలుసు. ఇశ్రాయేలు సేనాధిపతులైన నేరు కుమారుడైన అబ్నేరుకు, యెతెరు కుమారుడైన అమాశాకు ఏమి చేశాడో నీకు తెలుసు. సమాధానం కాలంలో వారిని యుద్ధ కాలంలో చంపినట్లు చంపి రక్తపాతం చేసి, తన నడికట్టుపై చెప్పులపై రక్తపు మరకలు చేసుకున్నాడు.
నీకు తోచిన ప్రకారం అతనికి చేయవచ్చు, అయితే నెరిసిన తలవెంట్రుకలతో సమాధానంతో సమాధికి వెళ్లనివ్వకు.
“బాగా గుర్తుంచుకో, నేను మహనయీముకు పారిపోయే రోజు, బహూరీము వాడైన బెన్యామీనీయుడు, గెరా కుమారుడైన షిమీ నన్ను ఘోరంగా శపించాడు. అతడు నన్ను కలుసుకోడానికి యొర్దాను నది దగ్గరకు వచ్చినప్పుడు, నేను యెహోవా పేరిట ‘నేను నిన్ను కత్తితో చంపను’ అని అతనికి ప్రమాణం చేశాను.
అయితే ఇప్పుడు అతన్ని నిర్దోషిగా పరిగణించకు. నీవు జ్ఞానంగల వాడవు; అతనికి ఏం చేయాలో నీకు తెలుసు. అతని నెరసిన తలను రక్తంతో సమాధికి తీసుకెళ్లు.”