- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
Priests గురించి బైబిల్ వచనాలు
ముఖ్య బైబిల్ వచనాలు
ఒకవేళ తల ముందు భాగంలో వెంట్రుకలు రాలిపోయి, నుదురు బోడిగా ఉంటే, అతడు పవిత్రుడు.
అయితే అతని బట్టతలపై గాని లేదా నుదిటిపై గాని గులాబి రంగు పుండు ఉంటే, అది అతని తలమీద గాని నుదుటి మీద గాని ఏర్పడుతున్న తీవ్రమైన కుష్ఠువ్యాధి.
యాజకుడు అతన్ని పరీక్షించాలి, ఒకవేళ అతని తలపై గాని నుదిటిపై వాచిన పుండు గులాబి రంగులో తీవ్రమైన కుష్ఠువ్యాధిలా ఉంటే,
ఆ పురుషుడు వ్యాధిగ్రస్తుడు, అపవిత్రుడు. యాజకుడు అతని తలపై ఉన్న కుష్ఠువ్యాధిని బట్టి అతన్ని అపవిత్రునిగా ప్రకటించాలి.
“అలాంటి కుష్ఠువ్యాధి ఉన్నవారెవరైనా తప్పనిసరిగా చిరిగిన బట్టలు ధరించాలి, చింపిరి జుట్టుతో ఉండాలి, వారు తమ నోటిని కప్పుకుని, ‘అపవిత్రులం! అపవిత్రులం!’ అని బిగ్గరగా అరవాలి.
వారికి వ్యాధి ఉన్నంత వరకు వారు అపవిత్రులే. వారు ఒంటరిగా జీవించాలి; వారు శిబిరం బయట నివసించాలి.
“అపవిత్రమైన మరకతో పాడైన వస్త్రానికి సంబంధించి, అవి ఉన్నివైనా లేదా నార వస్త్రాలైనా,
నారతో నేసిన వస్త్రాలైనా లేదా ఉన్నితో అల్లిన వస్త్రాలైనా, చర్మమైనా, చర్మంతో చేసినవైనా,
ఒకవేళ వస్త్రాల్లో గాని, చర్మంలో గాని, నేసిన దుస్తుల్లో గాని లేదా అల్లిన దుస్తుల్లో గాని, లేదా ఏదైనా చర్మంతో చేయబడిన వస్తువు మీద గాని పాడైన చోట పచ్చగా లేదా ఎరుపుగా ఉంటే, అది కుష్ఠు మరక యొక్క లక్షణం కాబట్టి తప్పక యాజకునికి చూపించాలి.
యాజకుడు ఆ పాడైన చోటును పరీక్షించి ఏడు రోజులు ఆ వస్తువును వేరుగా ఉంచాలి.
ఏడవ రోజు అతడు దానిని పరీక్షించాలి, ఒకవేళ వస్త్రంలో గాని, నేసిన దానిలో గాని లేదా అల్లిన దానిలో గాని, లేదా చర్మంలో గాని, చర్మంతో చేసినవైనా దానిలో గాని వ్యాపిస్తే, దాని ఉపయోగం ఏదైనా, అది తీవ్రమైన కుష్ఠు మరక; ఆ వస్తువు అపవిత్రము.
పాడైన వస్త్రమైనా, నారతో గాని ఉన్నితో గాని నేసిన లేదా అల్లిన వస్త్రాలైనా, లేదా చర్మంలో గాని, చర్మంతో చేసిన వస్తువైనా అతడు తప్పక కాల్చివేయాలి, ఎందుకంటే అది తీవ్రమైన మరక, ఆ వస్తువు తప్పనిసరిగా కాల్చివేయబడాలి.
“కానీ ఒకవేళ యాజకుడు దానిని పరీక్షించినప్పుడు, మరక వస్త్రంపై గాని, నేసిన దుస్తులపై గాని లేదా అల్లిన దుస్తులపై గాని, చర్మంపై గాని లేదా చర్మంతో చేసిన వస్తువుపై గాని వ్యాపించి ఉండకపోతే,
దానిని ఉతకమని అతడు ఆదేశించి దానిని మరో ఏడు రోజులు వేరుగా ఉంచాలి.
దానిని ఉతికిన తర్వాత, యాజకుడు దానిని మళ్ళీ పరీక్షించాలి, ఒకవేళ ఆ మరక మారకుండా వ్యాపించకుండ అలాగే ఉంటే, అది అపవిత్రమే. వస్త్రం ఎటువైపు పాడైనా, దానిని కాల్చివేయాలి.
ఒకవేళ యాజకుడు దానిని పరీక్షించినప్పుడు, ఆ వస్త్రం ఉతికిన తర్వాత మరక పోయినట్లైతే, అతడు ఆ పాడైన భాగాన్ని వస్త్రమైనా, చర్మమైనా నేసిన వస్త్రమైనా అల్లిన వస్త్రమైనా సరే కత్తిరించివేయాలి.
అయితే ఒకవేళ అది దుస్తుల్లో గాని నేసిన, అల్లిన వస్త్రాల్లో గాని లేదా చర్మంతో చేసిన వాటిలో గాని మళ్ళీ కనిపిస్తే, అది వ్యాపించే మరక అని గుర్తించి అది ఎలాంటి మరకైనా సరే దానిని కాల్చివేయాలి.
వస్త్రమైనా, నేసినదైనా అల్లినదైనా, చర్మంతో చేసిన వస్తువైనా సరే ఉతికిన తర్వాత మరక తొలగిపోతే దానిని మళ్ళీ ఉతకాలి. అప్పుడు అది పవిత్రమవుతుంది.”
ఉన్ని లేదా నార దుస్తుల్లో గాని నేసిన లేదా అల్లిన వస్త్రాల్లో గాని చర్మంతో చేసిన వస్తువులలో గాని కుష్ఠు మరకలు ఉంటే, వాటిని పవిత్రమైనవిగా గాని అపవిత్రమైనవిగా గాని ప్రకటించడానికి ఈ నియమాలు వర్తిస్తాయి.
“మీ స్వాస్థ్యంగా నేను మీకు ఇస్తున్న కనాను దేశానికి మీరు వచ్చిన తర్వాత, ఆ దేశంలోని ఒక ఇంట్లో నేను కుష్ఠు మచ్చను ఉంచితే,
వెంటనే ఆ ఇంటి యజమాని యాజకుడి దగ్గరకు వెళ్లి, ‘నేను నా ఇంట్లో అపవిత్రమైన మచ్చ చూశాను’ అని చెప్పాలి.
ఆ ఇంట్లో ఉన్నదంతా అపవిత్రంగా కాకుండ ఉండడానికి యాజకుడు ఆ మచ్చను పరీక్షించడానికి రాకముందే ఆ ఇళ్ళంతా ఖాళీ చేయించాలి. ఆ తర్వాత యాజకుడు లోపలికి వెళ్లి ఇంటిని పరీక్షించాలి.
అతడు గోడలపై ఉన్న మచ్చను పరీక్షించినప్పుడు ఆ గోడల మీద పచ్చని గీతలు గాని ఎర్రని గీతలు గోడ పగుళ్లలో ఉంటే,
యాజకుడు ఆ ఇంటి ద్వారం నుండి బయటకు వెళ్లి ఏడు రోజులు దానిని మూసివేయాలి.
ఏడవ రోజున యాజకుడు ఆ ఇంటిని పరిశీలించడానికి మరలా రావాలి. ఒకవేళ గోడలపై మరక వ్యాపించి ఉంటే,