Priests గురించి బైబిల్ వచనాలు: Teaching the law
Teaching the law గురించి వచనాలు
లేవీ గురించి అతడు ఇలా అన్నాడు: “యెహోవా, మీ తుమ్మీము, ఊరీము మీ నమ్మకమైన సేవకునికి చెందినవి. మస్సాలో మీరతనిని పరీక్షించారు; మెరీబా నీళ్ల దగ్గర అతనితో మీరు వాదించారు.
అతడు యాకోబుకు నీ కట్టడలను ఇశ్రాయేలీయులకు నీ ధర్మశాస్త్రాన్ని బోధిస్తాడు, అతడు మీ ఎదుట ధూపం వేస్తాడు, మీ బలిపీఠం మీద దహనబలులు అర్పిస్తాడు.
“యాజకులు సైన్యాలకు అధిపతియైన యెహోవా దూతలు. ఎందుకంటే మనుష్యులు వారి నోట ధర్మశాస్త్రం విని నేర్చుకుంటారు. కాబట్టి వారు జ్ఞానాన్ని కలిగి బోధించాలి.