కంటెంట్‌కు వెళ్లండి

Priests గురించి బైబిల్ వచనాలు: Part of all sacrifices

14 వచనాలు · 86 కోణాలు

Part of all sacrifices గురించి వచనాలు

  1. యాజకుల కుటుంబాలలో ప్రతి పురుషుడు దాన్ని పరిశుద్ధాలయ ప్రాంగణంలో తినవచ్చు; అది అతిపరిశుద్ధము.

  2. “ ‘అదే నియమం పాపపరిహారబలి, అపరాధపరిహారబలి, రెండింటికీ వర్తిస్తుంది: వాటితో ప్రాయశ్చిత్తం చేసే యాజకునికి అవి చెందుతాయి.

  3. దహనబలి తెచ్చినప్పుడు దాన్ని అర్పించే యాజకునికి ఆ బలి పశువు చర్మం చెందుతుంది.

  4. ప్రతి భోజనార్పణ, పొయ్యిమీద వండిందైనా కుండలో లేదా పెనం మీద చేయబడినదైనా గాని, అర్పించే యాజకునికి చెందుతుంది.

  5. ప్రతి భోజనార్పణ, ఒలీవనూనెతో కలిపినదైనా లేదా పొడిగా ఉన్నదైనా, అహరోను కుమారులందరికి సమానంగా చెందుతుంది.

  6. యాజకుడు ఆ క్రొవ్వును బలిపీఠం మీద దహించాలి, కాని రొమ్ము భాగం అహరోను, అతని కుమారులకు చెందుతుంది.

  7. ఇశ్రాయేలీయుల సమాధానబలులలో నుండి నేను పైకెత్తిన రొమ్ము భాగాన్ని, అర్పించిన తొడను తీసుకుని యాజకుడైన అహరోనుకు అతని కుమారులకు ఇశ్రాయేలీయుల నుండి శాశ్వత వాటాగా ఇచ్చాను.’ ”

  8. “ ‘నాజీరు తాను ప్రత్యేకించుకున్న దానికి చిహ్నంగా ఉన్న తల వెంట్రుకలను గొరిగించుకున్న తర్వాత వండిన పొట్టేలు జబ్బను, గంపలోని ఒక పులుపు కలపకుండ చేసిన మందమైన రొట్టెను, ఒక అప్పడాన్ని యాజకుడు నాజీరు చేయబడిన వాని చేతిలో పెట్టాలి.

  9. యాజకుడు అప్పుడు వాటిని యెహోవా ఎదుట పైకెత్తి ప్రత్యేక అర్పణగా అర్పించాలి; పైకెత్తబడి అర్పించబడిన రొమ్ము, ప్రత్యేక అర్పణగా సమర్పించబడిన తొడ పరిశుద్ధమైనవి, అవి యాజకునికి చెందినవి. ఆ తర్వాత, నాజీరు చేయబడిన వాడు ద్రాక్షరసం త్రాగవచ్చు.

  10. అప్పుడు యెహోవా అహరోనుతో ఇలా అన్నాడు: “నాకు అర్పించిన అర్పణలకు నేనే నీకు బాధ్యత అప్పగించాను; ఇశ్రాయేలీయులు నాకు ఇచ్చే పరిశుద్ధ అర్పణలన్నీ నేను నీకు, నీ కుమారులకు మీ భాగంగా, మీ శాశ్వత వాటాగా నిర్ణయిస్తున్నాను.

  11. బలిపీఠం మీది నిప్పులో కాల్చివేయబడని అతి పవిత్ర అర్పణలలో కొంత భాగం మీరు తీసుకోవాలి. నాకు వారు తెచ్చే అతి పవిత్రమైన భోజనార్పణలు పాపపరిహారబలులు అపరాధబలులు నీకు, నీ కుమారులకు చెందినవి.

  12. అవి అతి పవిత్రంగా ఎంచి తినాలి. ప్రతి మగవాడు అది తినాలి. వాటిని పవిత్రమైనవిగా పరిగణించాలి.

  13. “ఇది కూడా మీదే: ఇశ్రాయేలీయులు అర్పించే అర్పణలన్నిటిలో నుండి ప్రక్కన పెట్టబడినది. నేను నీకు, నీ కుమారులు కుమార్తెలకు మీ శాశ్వత వాటాగా నిర్ణయిస్తున్నాను. మీ ఇంట్లో ఆచార ప్రకారంగా శుభ్రంగా ఉన్న ప్రతి ఒక్కరూ దానిని తినవచ్చు.

  14. ప్రజలు అర్పణలుగా తీసుకువచ్చే పశువులు, గొర్రెలు మేకల నుండి యాజకులకు చెందవలసిన వాటా: భుజం, లోపలి అవయవాలు, చెంపలు.