Priests గురించి బైబిల్ వచనాలు: Partaking of the sacrifices of consecration
Partaking of the sacrifices of consecration గురించి వచనాలు
“ప్రతిష్ఠితమైన పొట్టేలును తీసుకుని పవిత్ర స్థలంలో దాని మాంసాన్ని వండాలి.
సమావేశ గుడారపు ద్వారం దగ్గర అహరోను, అతని కుమారులు ఆ పొట్టేలు మాంసాన్ని గంపలోని రొట్టెలతో తినాలి.
వారిని ప్రతిష్ఠించడానికి, పరిశుద్ధపరచడానికి ప్రాయశ్చిత్తంగా వేటిని అర్పించారో వాటిని వారు తినాలి. అవి పవిత్రమైనవి కాబట్టి వారు తప్ప ఇతరులెవరు వాటిని తినకూడదు.
అప్పుడు మోషే అహరోనుతో, అతని కుమారులతో, “సమావేశ గుడారపు ద్వారం దగ్గర మాంసాన్ని వండి ప్రతిష్ఠార్పణల గంపలోని రొట్టెలతో తినాలి, నాకు ఆజ్ఞాపించబడిన ప్రకారం, ‘అహరోను అతని కుమారులు దానిని తినాలి.’
తర్వాత మిగిలిన మాంసాన్ని, రొట్టెను కాల్చాలి.