Skip to content

Priests గురించి బైబిల్ వచనాలు

407 వచనాలు · 86 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. “వారితో ఇలా చెప్పు: ‘రాబోయే తరాలలో మీ వారసులలో ఎవరైనా ఆచారరీత్య అపవిత్రులై ఉండి ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్ఠించే పవిత్ర అర్పణల దగ్గరకు వస్తే, వారు నా సన్నిధిలో నుండి తొలగించబడాలి. నేను యెహోవాను.

  2. “ ‘అహరోను సంతతిలో ఎవరికైనా కుష్ఠువ్యాధి గాని, స్రావ రోగం గాని ఉంటే వారు పవిత్రమయ్యేవరకు పవిత్ర పదార్థాలను తినకూడదు. వారు శవాన్ని గాని అపవిత్రమైన దేనినైనా గాని తాకినా లేదా వీర్యం విసర్జనతో ఉన్న ఎవరినైన తాకినా, వారు అపవిత్రం అవుతారు,

  3. అపవిత్రమైన ప్రాకే పురుగును తాకినా, లేదా ఆచారరీత్య అపవిత్రంగా ఉన్న మనుష్యుని తాకినవారు అపవిత్రం అవుతారు.

  4. అలాంటి వాటిలో దేనినైన తాకితే, వారు సాయంత్రం వరకు అపవిత్రంగానే ఉంటారు. వారు నీటితో స్నానం చేసే వరకు పవిత్రమైన అర్పణల నుండి దేన్ని తినకూడదు.

  5. సూర్యుడు అస్తమించినప్పుడు వారు పవిత్రం అవుతారు, తర్వాత వారు పవిత్ర అర్పణలు తినవచ్చు, ఎందుకంటే అది వారి ఆహారము.

  6. వారు చచ్చినదానిని గాని అడవి జంతువులు చీల్చిన దానిని గాని తిని అపవిత్రం కాకూడదు. నేను యెహోవాను.

  7. “ ‘పరిశుద్ధ అర్పణను యాజక కుటుంబ సభ్యులు తప్ప బయటి వారెవరూ అంటే యాజకుని అతిథి గాని అతని ఇంట్లో జీతగాడు గాని తినకూడదు.

  8. అయితే ఒకవేళ యాజకుడు డబ్బుతో బానిసను కొనుగోలు చేస్తే, లేదా బానిసలు అతని కుటుంబంలో జన్మించి ఉంటే, వారు అతని ఆహారాన్ని తినవచ్చు.

  9. ఒక యాజకుని కుమార్తె యాజకుని కాకుండ వేరేవాన్ని పెళ్ళి చేసుకుంటే, ఆమె పవిత్రమైన దానాలు దేన్ని తినకూడదు.

  10. “ ‘ఎవరైనా పొరపాటున పరిశుద్ధ ఆహారం తింటే దానికి వెలకట్టి దాని వెలలో అయిదవ వంతు కలిపి యాజకునికి ఇవ్వాలి.

  11. యాజకులు ఇశ్రాయేలీయులు యెహోవాకు సమర్పించే పవిత్రమైన అర్పణలను యాజకులు అపవిత్రం చేయకూడదు.

  12. వారి మీదికి అపరాధపరిహార రుసుము చెల్లించుకునేలా చేయకూడదు. వారిని పరిశుద్ధపరచే యెహోవాను నేనే.’ ”

  13. “ఇశ్రాయేలీయులతో మాట్లాడి వారితో ఇలా చెప్పు: ‘నేను మీకు ఇవ్వబోతున్న దేశంలోకి మీరు ప్రవేశించినప్పుడు మీరు దాని పంటను కోయండి, మీరు పండించిన మొదటి ధాన్యం యొక్క పనను యాజకుని దగ్గరకు తీసుకుని రండి.

  14. అతడు యెహోవా ఎదుట ఆ పనను పైకెత్తి దానిని అర్పించాలి తద్వార అది మీ పక్షంగా అంగీకరించబడుతుంది; దానిని యాజకుడు సబ్బాతు తర్వాత రోజున పైకెత్తి ఆడించాలి.

  15. సమావేశ గుడారంలో నిబంధన మందసాన్ని కప్పి ఉంచే తెర బయట అహరోను సాయంత్రం నుండి ఉదయం వరకు నిత్యం యెహోవా ఎదుట దీపాలను వెలిగించాలి. ఇది రాబోయే తరాలకు నిత్య కట్టుబాటుగా ఉంటుంది.

  16. యెహోవా ఎదుట మేలిమి బంగారు దీపస్తంభంపై ఉన్న దీపాలు ఎప్పుడూ వెలుగుతూ ఉండాలి.

  17. “నాణ్యమైన పిండి తీసుకుని ఒక్కొక్క రొట్టెకు రెండు ఓమెర్ల చొప్పున పన్నెండు రొట్టెలు చేయాలి.

  18. యెహోవా ఎదుట మేలిమి బంగారు బల్లపై, వాటిని ఒక వరుసకు ఆరు చొప్పున రెండు వరుసల్లో అమర్చాలి.

  19. రొట్టెను సూచించడానికి యెహోవాకు అర్పించే హోమబలిగా ఉండడానికి ప్రతి వరుస దగ్గర జ్ఞాపక భాగంగా కొంత స్వచ్ఛమైన ధూపం ఏర్పాటు చేయాలి.

  20. నిత్య నిబంధనగా, ఇశ్రాయేలు పక్షాన ప్రతి సబ్బాతు దినాన యెహోవా ఎదుట ఆ రొట్టెలను బల్లపై పెడుతూ ఉండాలి.

  21. అది అహరోను అతని కుమారులకు చెందినది, వారు దీనిని పరిశుద్ధాలయ ప్రాంతంలో తినాలి, ఎందుకంటే ఇది యెహోవాకు సమర్పించిన హోమబలులలో వారి శాశ్వత వాటాలో అతిపరిశుద్ధమైన భాగము.”

  22. మ్రొక్కుబడి చేసిన ఎవరైనా నిర్దిష్టమైన మొత్తాన్ని చెల్లించలేనంత పేదవారైతే, ప్రతిష్ఠించబడిన వ్యక్తి యాజకునికి సమర్పించబడాలి, అతడు మ్రొక్కుబడి చేసిన వ్యక్తి స్తోమత ప్రకారం విలువను నిర్ణయిస్తాడు.

  23. అవి అహరోను కుమారుల పేర్లు; వీరు అభిషేకించబడిన యాజకులు; వీరు యాజకులుగా సేవ చేయడానికి ప్రతిష్ఠించబడ్డారు.

  24. యాజకులుగా సేవ చేయడానికి అహరోనును, అతని కుమారులను నియమించు; ఎవరైనా పరిశుద్ధాలయం దగ్గరకు వస్తే వారికి మరణశిక్ష విధించబడుతుంది.”

  25. ఆ మిగిలిన ఇశ్రాయేలీయుల విమోచన కోసం అహరోనుకు అతని కుమారులకు ఆ డబ్బు ఇవ్వాలి.”