Skip to content

Priests గురించి బైబిల్ వచనాలు

407 వచనాలు · 86 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. యెహోవా తనకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం మోషే విమోచన డబ్బును అహరోను అతని కుమారులకు ఇచ్చాడు.

  2. ప్రజలు ప్రయాణించాల్సి వచ్చినప్పుడు అహరోను అతని కుమారులు లోపలికి వెళ్లి అడ్డతెర దించి నిబంధన మందసం మీద కప్పాలి.

  3. తర్వాత వారు ఆ తెరను మన్నికైన తోలుతో కప్పి, దానిపై నీలిరంగు బట్ట పరిచి మోతకర్రలను వాటి ఉంగరాల్లో దూర్చాలి.

  4. “వారు సన్నిధి బల్లమీద నీలిరంగు బట్టను పరిచి దాని మీద పళ్లాలను, పాత్రలు, గిన్నెలు, పానార్పణ కోసం జాడీలను ఉంచాలి; రొట్టె ఎప్పుడూ దాని మీద ఉండాలి.

  5. వారు వాటి మీద ఎర్రబట్ట పరిచి, మన్నికైన తోలుతో దాన్ని కప్పి, మోతకర్రలను ఉంగరాల్లో దూర్చాలి.

  6. “వారు నీలిరంగు బట్ట తీసుకుని దీపస్తంభాన్ని, దాని దీపాలను, వత్తులు కత్తిరించే కత్తెరలను, వాటి పళ్లాలను, దీపాల్లో పోసే ఒలీవనూనె జాడీలన్నిటిని కప్పాలి.

  7. తర్వాత వారు దానిని, దాని ఉపకరణాలన్నిటిని మన్నికైన తోలుతో చుట్టి మోసుకెళ్లే పలక మీద ఉంచాలి.

  8. “బంగారు బలిపీఠం మీద వారు నీలిరంగు బట్ట పరిచి, దాన్ని మన్నికైన తోలుతో కప్పి, మోతకర్రలను వాటి ఉంగరాల్లో దూర్చాలి.

  9. “వారు పరిశుద్ధాలయంలో పరిచర్య కోసం వాడే వస్తువులన్నిటిని తీసుకుని వాటిని నీలి బట్టలో చుట్టి, మన్నికైన తోలుతో కప్పి మోసుకెళ్లే పలక మీద ఉంచాలి.

  10. “వారు ఇత్తడి బలిపీఠం మీది నుండి బూడిదను తీసివేసి, దాని మీద ఊదా బట్ట కప్పాలి.

  11. తర్వాత వారు బలిపీఠం దగ్గర పరిచర్యకు వాడే అన్ని పాత్రలను, నిప్పు పెనాలు, ముళ్ళ గరిటెలు, పారలు, ప్రోక్షణ గిన్నెలతో సహా దాని మీద పెట్టాలి. దాని మీద మన్నికైన తోలు కప్పి, మోతకర్రలను వాటి స్థలంలో దూర్చాలి.

  12. “అహరోను అతని కుమారులు పరిశుద్ధ సామాగ్రి, పరిశుద్ధ ఉపకరణాలన్నిటిని కప్పడం పూర్తి చేసిన తర్వాత, ప్రజలు ప్రయాణించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే కహాతీయులు వచ్చి దానిని మోయాలి. అయితే వారు పరిశుద్ధమైన వాటిని ముట్టకూడదు, ముట్టుకుంటే వారు చస్తారు. కహాతీయులు సమావేశ గుడారంలో ఉన్నవాటిని మోయాలి.

  13. అయితే ఆ వ్యక్తికి నష్టపరిహారం చెల్లించడానికి సమీపబంధువు లేకపోతే, ఆ నష్టపరిహారం యెహోవాది, అది ప్రాయశ్చిత్త బలిగా ఇవ్వబడే పొట్టేలుతో పాటు యాజకునికి ఇవ్వబడాలి.

  14. ఒకవేళ అతడు తన భార్య మీద అసూయపడి ఆమెను అనుమానించినప్పుడు, ఆమె నిజంగానే అపవిత్రమైతే, ఒకవేళ ఆమె అపవిత్రం కాకపోయినా అతడు ఆమెను అనుమానిస్తే,

  15. అతడు తన భార్యను యాజకుని దగ్గరకు తీసుకెళ్లాలి. అతడు ఆమె పక్షంగా ఒక ఓమెరు యవల పిండి తీసుకురావాలి. దాని మీద ఒలీవనూనె పోయకూడదు ధూపం వేయకూడదు ఎందుకంటే అది అసూయ కోసం అర్పించే భోజనార్పణ, చేసిన తప్పును జ్ఞాపకం చేసే జ్ఞాపక అర్పణ.

  16. “ ‘నాజీరు తాను ప్రత్యేకించుకున్న దానికి చిహ్నంగా ఉన్న తల వెంట్రుకలను గొరిగించుకున్న తర్వాత వండిన పొట్టేలు జబ్బను, గంపలోని ఒక పులుపు కలపకుండ చేసిన మందమైన రొట్టెను, ఒక అప్పడాన్ని యాజకుడు నాజీరు చేయబడిన వాని చేతిలో పెట్టాలి.

  17. యాజకుడు అప్పుడు వాటిని యెహోవా ఎదుట పైకెత్తి ప్రత్యేక అర్పణగా అర్పించాలి; పైకెత్తబడి అర్పించబడిన రొమ్ము, ప్రత్యేక అర్పణగా సమర్పించబడిన తొడ పరిశుద్ధమైనవి, అవి యాజకునికి చెందినవి. ఆ తర్వాత, నాజీరు చేయబడిన వాడు ద్రాక్షరసం త్రాగవచ్చు.

  18. “అహరోను, అతని కుమారులతో చెప్పు, ‘ఈ విధంగా ఇశ్రాయేలీయులను దీవించాలి:

  19. “ ‘ “యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక;

  20. యెహోవా నీ మీద తన ముఖాన్ని ప్రకాశింప జేసి నిన్ను కరుణించును గాక;

  21. యెహోవా నీవైపు తన ముఖాన్ని త్రిప్పును గాక సమాధానం ఇచ్చును గాక.” ’

  22. “ఇలా అహరోను అతని కుమారులను ఇశ్రాయేలీయులను నా నామమున దీవించినప్పుడు, నేనే స్వయంగా ఆశీర్వదిస్తాను.”

  23. యెహోవా మోషేతో ఇలా చెప్పారు:

  24. “సుత్తెతో సాగగొట్టబడిన వెండితో రెండు బూరలు తయారుచేసి, సమాజం కూడుకోడానికి, శిబిరాలు బయలుదేరడాన్ని సూచించడానికి వాటిని వాడాలి.

  25. రెండు బూరలు ఒకేసారి మ్రోగితే ఆ శబ్దానికి సమాజమంతా నీ ఎదుట సమావేశ గుడార ద్వారం దగ్గర కూడుకోవాలి.