Skip to content

Priests గురించి బైబిల్ వచనాలు

407 వచనాలు · 86 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. మొదటి చీటి యెహోయారీబుకు, రెండవది యెదాయాకు,

  2. మూడవది హారీముకు, నాలుగవది శెయొరీముకు,

  3. అయిదవది మల్కీయాకు, ఆరవది మీయామినుకు,

  4. ఏడవది హక్కోజుకు, ఎనిమిదవది అబీయాకు,

  5. తొమ్మిదవది యెషూవకు, పదవది షెకన్యాకు,

  6. పదకొండవది ఎల్యాషీబుకు, పన్నెండవది యాకీముకు,

  7. పదమూడవది హుప్పాకు, పద్నాలుగవది యెషెబాబుకు,

  8. పదిహేనవది బిల్గాకు, పదహారవది ఇమ్మేరుకు,

  9. పదిహేడవది హెజీరుకు, పద్దెనిమిదవది హప్పిస్సేసుకు,

  10. పందొమ్మిదవది పెతహయాకు, ఇరవయ్యవది యెహెజ్కేలుకు,

  11. ఇరవై ఒకటవది యాకీనుకు, ఇరవై రెండవది గామూలుకు,

  12. ఇరవై మూడవది దెలాయ్యాకు, ఇరవై నాలుగవది మయజ్యాకు వచ్చాయి.

  13. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వారి పితరుడైన అహరోనుకు ఆజ్ఞాపించిన ప్రకారం, అహరోను వారికి నియమించిన నిబంధనల ప్రకారం, వారు యెహోవా మందిరంలో ప్రవేశించినప్పుడు వారు చేయాల్సిన సేవా క్రమం ఇది.

  14. వీరు తమ బంధువులైన అహరోను వారసులు చేసినట్టు, రాజైన దావీదు, సాదోకు, అహీమెలెకు, యాజకులు లేవీయుల కుటుంబ పెద్దలు ఎదుట చీట్లు వేసుకున్నారు. పెద్ద సోదరుని కుటుంబాలు చిన్న సోదరుని కుటుంబాలు కలిసి చీట్లు వేసుకున్నారు.

  15. తన తండ్రి దావీదు శాసనానికి అనుగుణంగా, అతడు వారి సేవలను జరిగించడానికి యాజకుల విభాగాలను, ప్రతిరోజు అవసరాన్ని బట్టి యాజకులకు సహాయం చేయడానికి, స్తుతి చేయడానికి లేవీయులను నియమించాడు. ప్రతి ద్వారానికి వంతు ప్రకారం ద్వారపాలకులుగా ఉండడానికి మనుష్యులను నియమించాడు. అతడు వివిధ ద్వారాలకు విభాగాల ప్రకారం ద్వారపాలకులను నియమించాడు. ఎందుకంటే ఇలా చేయాలని దైవజనుడైన దావీదు ఆదేశించాడు.

  16. ఉజ్జియా స్థిరపడిన తర్వాత అతడు విర్రవీగి పతనం అయ్యాడు. తన దేవుడైన యెహోవాకు నమ్మకద్రోహం చేసి యెహోవా మందిరంలో ధూపవేదిక మీద ధూపం వేయడానికి ప్రవేశించాడు.

  17. యాజకుడైన అజర్యా ఎనభైమంది ఇతర ధైర్యవంతులైన యెహోవా యాజకులతో అతన్ని అనుసరించాడు.

  18. వారు ఉజ్జియా రాజును ఎదిరించి, “ఉజ్జియా, యెహోవాకు ధూపం వెయ్యడం నీ పని కాదు. అహరోను వారసులైన యాజకులే ఆ పని చేయాలి. ధూపం వేయడానికి వారే ప్రతిష్ఠించబడ్డారు. పరిశుద్ధాలయం నుండి వెళ్లు. నీవు నమ్మకద్రోహిగా ఉన్నావు. దానివలన యెహోవా దేవుని వలన ఘనపరచబడవు” అన్నారు.

  19. ధూపం వేయడానికి చేతిలో ధూపం పెట్టుకున్న ఉజ్జియాకు కోపం వచ్చింది. అతడు యెహోవా మందిరంలో ధూపవేదిక ముందు యాజకుల సమక్షంలో వారి మీద విరుచుకుపడుతుండగా, అతని నుదుటిపై కుష్ఠురోగం వచ్చింది.

  20. ముఖ్య యాజకుడైన అజర్యా ఇతర యాజకులందరు అతనివైపు చూసినప్పుడు, అతని నుదిటిపై కుష్ఠురోగం ఉందని వారు చూసి, అతన్ని త్వరితంగా బయటకు తీశారు. నిజమే, యెహోవా అతన్ని బాధపెట్టారు కాబట్టి అతడు స్వయంగా బయలుదేరడానికి ఆసక్తిగా ఉన్నాడు.

  21. ఉజ్జియా రాజు చనిపోయే రోజు వరకు కుష్ఠు వ్యాధితో ఉన్నాడు. అతనికున్న కుష్ఠురోగాన్ని బట్టి అతడు యెహోవా మందిరంలోనికి వెళ్లకుండ నిషేధించబడ్డాడు. కాబట్టి అతడు వేరుగా ఒక గృహంలో నివసించాడు. అతని కుమారుడైన యోతాము రాజభవన అధికారిగా ఉంటూ దేశ ప్రజలను పరిపాలించాడు.

  22. యాజకులు కొద్దిమందే ఉన్నారు కాబట్టి దహనబలిగా దహనబలి పశువులన్నిటి చర్మం ఒలువలేకపోయారు. పనంతా పూర్తయ్యే వరకు, ఇతర యాజకులు తమను తాము ప్రతిష్ఠించుకునే వరకు, వారి వంశీయులు లేవీయులు సాయం చేశారు. యాజకులకంటే లేవీయులే ప్రతిష్ఠించుకునే విషయంలో యథార్థంగా ఉన్నారు.

  23. ఇశ్రాయేలు రాజైన దావీదు అతని కుమారుడు సొలొమోను వ్రాసిన సూచనల ప్రకారం, మీ కుటుంబాల విభాగాల ప్రకారం మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి.

  24. “మీ తోటి ఇశ్రాయేలీయులు, సామాన్య ప్రజల కుటుంబాల్లోని ప్రతి ఉపవిభాగం కోసం లేవీయుల సమూహంతో పరిశుద్ధ స్థలంలో నిలబడండి.

  25. పస్కా గొర్రెపిల్లలు వధించబడ్డాయి, లేవీయులు జంతువుల చర్మం తీస్తూ ఉండగా, యాజకులు వాటి రక్తాన్ని బలిపీఠం మీద చల్లారు.