Skip to content

Praise గురించి బైబిల్ వచనాలు

490 వచనాలు · 106 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. తన సేవకురాలి దీనస్థితిని ఆయన గమనించారు. ఇది మొదలుకొని తరతరాల వారు నన్ను ధన్యురాలు అంటారు,

  2. ఎందుకంటే మహాఘనుడు నా కోసం గొప్ప కార్యాలను చేశారు, పరిశుద్ధుడని ఆయనకు పేరు.

  3. తరతరాల వరకు ఆయనకు భయపడేవారికి, ఆయన కరుణ విస్తరిస్తుంది.

  4. ఆయన తన బాహువుతో గొప్ప కార్యాలను చేస్తారు; తమ అంతరంగాల్లో గర్వించు వారిని ఆయన చెదరగొట్టారు.

  5. సింహాసనాల నుండి పరిపాలకులను క్రిందికి పడద్రోసారు, కాని, దీనులను పైకి లేవనెత్తారు.

  6. ఆకలిగొనిన వారిని మంచి పదార్ధాలతో తృప్తిపరిచారు, కాని, ధనవంతులను వట్టి చేతులతో పంపారు.

  7. ఆయన అబ్రాహాముకు అతని సంతతివారికి నిత్యం దయ కలిగి ఉండాలని జ్ఞాపకం చేసుకొంటూ, మన పితరులకు వాగ్దానం చేసినట్లు, తన సేవకుడైన ఇశ్రాయేలుకు సహాయం చేశారు.”

  8. As he spake to our fathers, to Abraham, and to his seed for ever.

  9. వెంటనే అతని నోరు తెరుచుకుంది అతని నాలుక సడలింది, అతడు మాట్లాడుతూ దేవుని స్తుతించడం మొదలుపెట్టాడు.

  10. తండ్రి జెకర్యా పరిశుద్ధాత్మతో నిండుకొని ఈ విధంగా ప్రవచించాడు:

  11. “ఇశ్రాయేలు దేవుడైన ప్రభువు స్తుతింపబడును గాక, ఎందుకంటే ఆయన తన ప్రజలను దర్శించి వారిని విమోచించారు.

  12. దేవుడు ముందుగానే తన పవిత్ర ప్రవక్తల ద్వారా పలికించినట్లు, తన సేవకుడైన దావీదు వంశంలో మన కోసం రక్షణ కొమ్మును మొలిపించారు.

  13. As he spake by the mouth of his holy prophets, which have been since the world began:

  14. మన శత్రువుల చేతి నుండి మనల్ని ద్వేషించు వారి నుండి రక్షణ కలిగించారు,

  15. మన పితరులకు దయ చూపడానికి తన పరిశుద్ధ నిబంధనను జ్ఞాపకం చేసుకోవడానికి:

  16. మన తండ్రియైన అబ్రాహాముకు ప్రమాణం చేసినట్లుగా,

  17. మన శత్రువుల చేతి నుండి మనల్ని తప్పించి, మనం భయపడకుండా ఆయనను సేవించాలని,

  18. బ్రతికిన కాలమంతా మనం ఆయన ఎదుట పరిశుద్ధత నీతి కలిగి జీవించాలని విమోచించారు.

  19. అప్పుడు అకస్మాత్తుగా ఆ దూతతో పాటు ఆకాశంలో దూతల గొప్ప సమూహం కనబడి, ఈ విధంగా దేవుని స్తుతించారు,

  20. “అత్యున్నతమైన స్థలాల్లో దేవునికి మహిమ, ఆయనకు ఇష్టమైనవారికి భూమి మీద సమాధానం కలుగును గాక.”

  21. ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లుగా, తాము విని చూసిన వాటన్నిటిని గురించి దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తూ తిరిగి వెళ్లారు.

  22. సుమెయోను ఆ శిశువుని తన చేతుల్లోకి తీసుకుని దేవుని స్తుతిస్తూ, ఇలా అన్నాడు:

  23. ఆమె కూడ ఆ సమయంలోనే దేవాలయ ఆవరణంలో వారి దగ్గరకు వచ్చి, దేవునికి కృతజ్ఞతలు చెల్లించి, యెరూషలేము విమోచన కోసం ఎదురు చూస్తున్న వారందరితో శిశువు గురించి చెప్పింది.

  24. అదే విధంగా, పశ్చాత్తాపం అవసరంలేని తొంభై తొమ్మిది నీతిమంతుల కంటే, పశ్చాత్తాపపడిన ఒక పాపిని బట్టి పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగుతుంది అని నేను మీతో చెప్తున్నాను” అన్నారు.

  25. అలాగే పశ్చాత్తాపపడి దేవుని వైపు తిరిగిన ఒక పాపిని గురించి దేవుని దూతల మధ్య సంతోషం కలుగుతుంది అని మీతో చెప్తున్నాను” అన్నారు.