Skip to content

Perseverance గురించి బైబిల్ వచనాలు

159 వచనాలు · 26 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. మీకు బోధించబడిన ప్రకారం విశ్వాసంలో స్థిరపడుతూ, మరి ఎక్కువగా కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ, ఆయనలో మీరు జీవించడం కొనసాగించండి.

  2. ఎందుకంటే, మీరు దేవునిలో స్థిరంగా నిలబడి ఉండడం మాకు ప్రాణం వచ్చినట్లే.

  3. మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో కలిసివచ్చినపుడు మన తండ్రియైన దేవుని ముందు మీరు నిందారహితులుగా పవిత్రులుగా ఉండడానికి ఆయన మీ హృదయాలను బలపరచును గాక.

  4. అన్నిటిని పరీక్షిస్తూ మంచి వాటిని గట్టిగా పట్టుకోండి,

  5. కాబట్టి సహోదరీ సహోదరులారా, మీరు మా నోటి మాటలతో లేదా ఉత్తరాల ద్వారా మేము మీకు చేయించిన బోధను గట్టిగా పట్టుకుని దానిలో స్థిరంగా ఉండండి.

  6. మన ప్రభువైన యేసు క్రీస్తును మన తండ్రియైన దేవుడు మనల్ని ప్రేమించి తన కృప చేత మనకు నిత్య ప్రోత్సాహాన్ని స్థిరమైన నిరీక్షణను ఇచ్చి,

  7. మన హృదయాలను ధైర్యపరచి, ప్రతి మంచి పనిలో మంచి మాటల్లో మిమ్మల్ని బలపరచును గాక.

  8. సహోదరీ సహోదరులారా, మంచి చేయడంలో మీరు ఎన్నడూ అలసి పోవద్దు.

  9. ఈ సువార్త వల్లనే, నేను ఈ విధంగా కష్టాలను అనుభవిస్తున్నాను, అయినా దానిని గురించి సిగ్గుపడను, ఎందుకంటే నేను నమ్మినవాని గురించి నాకు తెలుసు; నాకు అప్పగించిన దానిని చివరి రోజు వరకు ఆయన కాపాడగలడని నేను రూఢిగా నమ్ముతున్నాను.

  10. క్రీస్తు యేసులో ప్రేమ, విశ్వాసం కలిగి, నీవు నా నుండి విన్న మంచిబోధను ఆదర్శంగా పాటించు.

  11. నా కుమారుడా, క్రీస్తు యేసులోని కృప చేత బలపడుతూ ఉండు.

  12. యేసు క్రీస్తు కోసం ఒక మంచి సైనికుని వలె నాతో పాటు కష్టాలను భరించు.

  13. మనం భరిస్తే, ఆయనతో పాటు మనం కూడా ఏలుతాము. మనం ఆయనను తిరస్కరిస్తే, ఆయన కూడా మనల్ని తిరస్కరిస్తారు;

  14. కాని నీవైతే, నీవు నేర్చుకున్న వాటిని, నీవు నమ్మి విశ్వసించిన వాటిలో స్థిరంగా కొనసాగు ఎందుకంటే, నీవు ఎవరినుండి వాటిని నేర్చుకున్నావో నీకు తెలుసు.

  15. నేను మంచి పోరాటం పోరాడాను, నా పరుగు పందాన్ని ముగించాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను.

  16. నాకు కలిగే ప్రతి కీడు నుండి ప్రభువు నన్ను కాపాడి తన పరలోక రాజ్యంలోనికి క్షేమంగా చేర్చుకుంటారు. ఆయనకే మహిమ నిరంతరం కలుగును గాక ఆమేన్.

  17. బోధించబడిన రీతిలో ఈ నమ్మకమైన వాక్యాన్ని అతడు గట్టిగా పట్టుకోవాలి. అప్పుడు అతడు తాను నేర్చుకున్న సత్య బోధతో ఇతరులను ప్రోత్సాహించి దానిని వ్యతిరేకించే వారిని ఖండించగలడు.

  18. కాబట్టి మనం ప్రక్కకు మళ్ళించబడకుండా ఉండడానికి, మనం విన్న వాటి పట్ల అత్యంత జాగ్రత్తగా శ్రద్ధ వహించాలి.

  19. “మోషే దేవుని సేవకునిగా దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వానిగా ఉన్నాడు” దేవుడు భవిష్యత్తులో చెప్పబోయేవాటికి సాక్షిగా ఉన్నాడు.

  20. అయితే క్రీస్తు, కుమారుడిగా దేవుని ఇంటిపైన నమ్మకంగా ఉన్నాడు. ఒకవేళ మన ధైర్యాన్ని, మనం కీర్తించే నిరీక్షణను గట్టిగా పట్టుకుంటే, మనమే ఆయన గృహము.

  21. ఒకవేళ మనకున్న మొదటి నిశ్చయతను అంతం వరకు గట్టిగా పట్టుకుని ఉంటే, మనం క్రీస్తులో పాలుపంచుకుంటాము.

  22. కాబట్టి, పరలోకానికి ఎక్కివెళ్లిన దేవుని కుమారుడైన యేసు అనే గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కాబట్టి మనం అంగీకరించిన విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుందాము.

  23. అందువల్ల మనం క్రీస్తు గురించిన ప్రాధమిక బోధన అంటే, మరణానికి దారితీసే చర్యల నుండి పశ్చాత్తాపం, దేవుని యందు విశ్వాసముంచడం వంటి వాటితో మళ్ళీ పునాదిని మళ్ళీ వేయక, దానికి మించి, పరిపక్వతకు వైపుకు వెళ్దాం,

  24. ఒకసారి వెలిగించబడి, పరలోకసంబంధమైన వరాలను అనుభవించినవారు తెలుసుకొని, పరిశుద్ధాత్మలో పాలిభాగస్థులై,

  25. దేవుని వాక్యం యొక్క అనుగ్రహాన్ని, భవిష్యత్కాలాల శక్తుల ప్రభావాలను రుచి చూసినప్పటికి,