కంటెంట్‌కు వెళ్లండి

National Sins గురించి బైబిల్ వచనాలు

152 వచనాలు · 34 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. కాబట్టి నేను నాయకుల దగ్గరకు వెళ్లి వారితో మాట్లాడతాను; ఖచ్చితంగా యెహోవా మార్గం వారికి తెలుసు, వారి దేవుడు ఏమి కోరుతున్నారో వారికి తెలుసు.” అయితే వారు కూడా ఏకమనస్సుతో కాడిని విరగ్గొట్టారు, బంధకాలను తెంపుకున్నారు.

  2. అందుకు నేను వారిని శిక్షించవద్దా?” అని యెహోవా ప్రకటిస్తున్నారు. “ఇలాంటి దేశం మీద నేను ప్రతీకారం తీర్చుకోవద్దా?

  3. “అల్పుల నుండి గొప్పవారి వరకు, అందరు లాభం కోసం అత్యాశతో ఉన్నారు; ప్రవక్తలు యాజకులు అంతా ఒకటే, అందరు మోసం చేసేవారే.

  4. భూమీ, విను: నేను ఈ ప్రజలమీదికి విపత్తు తెస్తున్నాను, అది వారి కుట్రల ఫలం, ఎందుకంటే వారు నా మాటలను వినలేదు, నా ధర్మశాస్త్రాన్ని తిరస్కరించారు.

  5. షేబ నుండి వచ్చే ధూపం గురించి గాని దూరదేశం నుండి వచ్చే మధురమైన సువాసనగల వస గురించి నేను ఏమి పట్టించుకోను? మీ దహనబలులు అంగీకరించదగినవి కావు; మీ బలులు నన్ను ప్రసన్నం చేయవు.”

  6. “నేను నిన్ను లోహాలు పరీక్షించేవానిగా నా ప్రజలను మిశ్రమ లోహంగా చేశాను, మీరు వారి మార్గాలను గమనిస్తారని వాటిని పరీక్షిస్తారని.

  7. వారంతా మొండి తిరుగుబాటుదారులు, వారు అభాండాలు వేస్తూ తిరుగుతున్నారు. వారు ఇత్తడి, ఇనుము లాంటివారు; వారంతా అవినీతికి పాల్పడుతున్నారు.

  8. సీసాన్ని నిప్పుతో కాల్చివేయడానికి కొలిమి తిత్తులు తీవ్రంగా ఊదుతున్నారు, కానీ శుద్ధి చేయడం వృధా అవుతుంది; దుష్టులు ప్రక్షాళన చేయబడరు.

  9. వారు తిరస్కరించబడిన వెండి అని పిలువబడతారు, ఎందుకంటే యెహోవా వారిని తిరస్కరించారు.”

  10. “ ‘నీవు దొంగిలిస్తూ, హత్య చేస్తూ, వ్యభిచారం చేస్తూ, అబద్ధ ప్రమాణం, దేవుళ్ళ మీద ప్రమాణం చేస్తూ, బయలుకు ధూపం వేస్తూ, నీకు తెలియని ఇతర దేవుళ్ళను అనుసరిస్తూ,

  11. తర్వాత వచ్చి నా పేరుతో పిలువబడే ఈ మందిరంలో నా ముందు నిలబడి, “మేము క్షేమంగా ఉన్నాము” ఈ అసహ్యకరమైన వాటన్నిటిని చేయడానికి క్షేమంగా ఉన్నాము అని అంటారా?

  12. నా పేరు కలిగిన ఈ ఇల్లు మీకు దొంగల గుహ అయ్యిందా? నేను చూస్తూనే ఉన్నాను! అని యెహోవా ప్రకటిస్తున్నారు.

  13. “ ‘షిలోహులో నా పేరు కోసం నేను మొదట నివాసం ఏర్పరచుకున్న ప్రదేశానికి వెళ్లి, నా ప్రజలైన ఇశ్రాయేలీయుల దుష్టత్వాన్ని బట్టి నేను దానికి చేసినది ఏంటో చూడండి.

  14. మీరు ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు, నేను మీతో పదే పదే మాట్లాడాను, కానీ మీరు వినలేదు; నేను మిమ్మల్ని పిలిచాను, కానీ మీరు జవాబివ్వలేదు, అని యెహోవా ప్రకటిస్తున్నారు.

  15. కాబట్టి, నేను షిలోహుకు చేసినట్టే, నా పేరు కలిగి ఉన్న ఆలయానికి, మీరు నమ్మిన ఆలయానికి, మీకు మీ పూర్వికులకు నేను ఇచ్చిన స్థలానికి ఇప్పుడు చేస్తాను.

  16. అయితే ఒకవేళ ఏ దేశమైనా నా మాట వినకపోతే, నేను ఆ జనాన్ని వేళ్లతో సహా పెళ్లగించి నిర్మూలం చేస్తాను” అని యెహోవా ప్రకటిస్తున్నారు.

  17. మీరు వినకపోతే మీ గర్వాన్ని బట్టి నేను రహస్యంగా ఏడుస్తాను; యెహోవా మంద చెరగా కొనిపోబడుతుంది కాబట్టి నా కళ్లు ఎంతగానో ఏడుస్తాయి, కన్నీరు కారుస్తాయి.

  18. దానికి ఆ దేశం దాని చెడు గురించి పశ్చాత్తాపపడితే నేను జాలిపడి, పంపాలనుకున్న విపత్తును పంపకుండ నిలిపివేస్తాను.

  19. కానీ ఒకవేళ వారు నా సభలో నిలబడి ఉంటే, వారు నా ప్రజలకు నా మాటలు ప్రకటించి వారి చెడు మార్గాల నుండి వారి చెడు పనుల నుండి వారిని తప్పించి ఉండేవారు.

  20. “అయితే డెబ్బై సంవత్సరాలు పూర్తయినప్పుడు, నేను బబులోను రాజును, అతని ప్రజలను, బబులోనీయుల దేశాన్ని వారి దోషాన్ని బట్టి శిక్షిస్తాను” అని యెహోవా ప్రకటిస్తున్నారు, “దానిని శాశ్వతంగా నిర్జనం చేస్తాను.

  21. “మోయాబు యవ్వన నుండి ప్రశాంతంగా ఉండింది, ఒక బాన నుండి మరొక బానలో పోయబడని, అడుగున మడ్డితో ఉన్న ద్రాక్షరసంలా ఉండింది, అది చెరలోకి వెళ్లలేదు. కాబట్టి దాని రుచి ఎప్పటిలాగే ఉంది, దాని సువాసన మారలేదు.”

  22. “మోయాబు గర్వం గురించి దానికి అహంకారం గురించి దాని తలపొగరు, దాని గర్వం, దాని దురహంకారం, దాని హృదయ అతిశయం గురించి విన్నాము.

  23. దాని తలపొగరు నాకు తెలుసు, దానికి ఏ విలువలేదు, దాని ప్రగల్భాలు ఏమీ సాధించవు, అని యెహోవా ప్రకటిస్తున్నారు.

  24. “బబులోను నుండి పారిపోండి! మీ ప్రాణాలు కాపాడుకోండి! దాని పాపాలను బట్టి నాశనం కాకండి. ఇది యెహోవా ప్రతీకారం తీర్చుకునే సమయం; దానికి తగిన ప్రతిఫలం ఆయన చెల్లిస్తారు.

  25. అనేక జలాల ప్రక్కన నివసించేదానా, సమృద్ధి సంపదలు కలిగి ఉన్నదానా, నీ అంతం వచ్చింది, నీవు నాశనమయ్యే సమయం వచ్చింది.