National Sins గురించి బైబిల్ వచనాలు: Punishment for, averted on repentance
Punishment for, averted on repentance గురించి వచనాలు
అయితే ఇశ్రాయేలీయులు యెహోవాతో, “మేము పాపం చేశాము. మీ ఇష్ట ప్రకారం మాకు చేయండి, కాని ఇప్పుడు దయచేసి మమ్మల్ని కాపాడండి” అని విన్నవించుకున్నారు.
తర్వాత ఇశ్రాయేలీయులు తమ మధ్యలో ఉన్న ఇతర దేవుళ్ళను తొలగించి యెహోవాను సేవించారు. యెహోవా వారు అనుభవిస్తున్న శ్రమను ఇక సహించలేకపోయారు.
రాజు ఇశ్రాయేలు అధికారులు తమను తాము తగ్గించుకొని, “యెహోవా న్యాయం గలవాడు” అని ఒప్పుకున్నారు.
వారు అలా తగ్గించుకోవడం యెహోవా చూశారు. కాబట్టి యెహోవా నుండి ఈ వాక్కు షెమయాకు వచ్చింది, “వారు తమను తాము తగ్గించుకున్నారు కాబట్టి నేను వారిని నాశనం చెయ్యను. త్వరలో వారిని శిక్షిస్తాను. షీషకు ద్వారా నా కోపాగ్ని యెరూషలేము మీద కుమ్మరించను.
చాలాసార్లు ఆయన విడిపించాడు, అయినా వారి తిరుగుబాటు ఆలోచనలు కార్యరూపం దాల్చాయి. తిరగబడి, అపరాధులై, దురవస్థ చెందారు.
అయినా వారు మొరపెట్టగానే ఆయన విన్నాడు. వారి కష్టంను చూచాడు.
దేవుడు తన నిబంధనను తలచుకొన్నాడు. వారి నిమిత్తం జ్ఞాపకం చేసుకున్నాడు. తన మారని ప్రేమను బట్టి వారిని కనికరించాడు.
చెరపట్టిన వారికి వీరి మీద జాలి కలిగింది. అది దైవనిర్ణయమే.
వారు చేసింది, వారు ఎలా తమ చెడుతనాన్ని విడిచిపెట్టారో దేవుడు చూసి తన మనస్సు మార్చుకొని, ఆయన వారికి మీదికి రప్పిస్తానని చెప్పిన కీడును రానివ్వలేదు.