కంటెంట్‌కు వెళ్లండి

Music గురించి బైబిల్ వచనాలు

324 వచనాలు · 57 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ఏడవది యెషర్యేలా పేరిట వచ్చింది, ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.

  2. ఎనిమిదవది యెషయా పేరిట వచ్చింది, ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.

  3. తొమ్మిదవది మత్తన్యా పేరిట వచ్చింది, ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.

  4. పదవది షిమీ పేరట వచ్చింది, ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.

  5. పదకొండవది అజరేలు పేరిట వచ్చింది, ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.

  6. పన్నెండవది హషబ్యా పేరిట వచ్చింది, ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.

  7. పదమూడవది షూబాయేలు పేరిట వచ్చింది, ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.

  8. పద్నాలుగవది మత్తిత్యా పేరిట వచ్చింది, ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.

  9. పదిహేనవది యెరేమోతు పేరిట వచ్చింది, ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.

  10. పదహారవది హనన్యా పేరిట వచ్చింది, ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.

  11. పదిహేడవది యొష్బెకాషా పేరిట వచ్చింది, ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.

  12. పద్దెనిమిదవది హనానీ పేరిట వచ్చింది, ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.

  13. పందొమ్మిదవది మల్లోతి పేరిట వచ్చింది, ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.

  14. ఇరవయ్యవది ఎలీయాతా పేరిట వచ్చింది, ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.

  15. ఇరవై ఒకటవది హోతీరు పేరిట వచ్చింది, ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.

  16. ఇరవై రెండవది గిద్దల్తీ పేరిట వచ్చింది, ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.

  17. ఇరవై మూడవది మహజీయోతు పేరిట వచ్చింది, ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.

  18. ఇరవై నాలుగవది రోమమ్తీ-యెజెరు పేరిట వచ్చింది, ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.

  19. తర్వాత యాజకులు పరిశుద్ధాలయం నుండి బయటకు వచ్చారు. అంతకుముందు అక్కడ ఉన్న యాజకులందరు తమ విభాగాలతో నిమిత్తం లేకుండా తమను తాము ప్రతిష్ఠించుకున్నారు.

  20. సంగీతకారులైన లేవీయులంతా, అంటే ఆసాపు, హేమాను, యెదూతూను, వారి కుమారులు, బంధువులు సన్నని నారబట్టలను ధరించి తాళాలు, తంతి వాయిద్యాలు, స్వరమండలాలు చేతపట్టుకుని బలిపీఠానికి తూర్పు వైపున నిలబడి ఉన్నారు. వారితో కలిసి బూరల ధ్వని చేయడానికి నూట ఇరవైమంది యాజకులు ఉన్నారు.

  21. బూరలు ఊదేవారు, సంగీతకారులు ఏకకంఠంతో యెహోవాకు కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించడానికి జత కలిశారు. వారికి జతగా బూరలు, తాళాలు, ఇతర వాయిద్యాలు వాయిస్తూ ఉంటే, పాటలు పాడేవారు యెహోవాను స్తుతించడానికి తమ స్వరాలెత్తి: “యెహోవా మంచివాడు. ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది” అని పాడారు. అప్పుడు యెహోవా మందిరం మేఘంతో నిండిపోయింది.

  22. యాజకులు తమ స్థలాల్లో నిలబడి ఉండగా, రాజైన దావీదు యెహోవాను స్తుతించడానికి, “ఆయన మారని ప్రేమ నిరంతరం ఉండును గాక!” అంటూ ఆయనను స్తుతిస్తూ కృతజ్ఞత చెల్లించడానికి దావీదు యెహోవా కోసం తయారుచేసిన వాయిద్యాలు వాయిస్తూ గీతాలను పాడుతూ లేవీయులు కూడా తమ స్థలాలలో నిలబడ్డారు. లేవీయులకు ఎదురుగా యాజకులు నిలబడి బూరలు ఊదుతుండగా ఇశ్రాయేలీయులంతా నిలబడి ఉన్నారు.

  23. కహాతు వంశానికి, కోరహీయుల వంశానికి చెందిన లేవీయులు కొందరు లేచి, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను పెద్ద స్వరంతో స్తుతించారు.

  24. ప్రజలతో మాట్లాడిన తర్వాత యెహోషాపాతు, యెహోవాకు ఇలా పాడటానికి, ఆయన పవిత్రత యొక్క వైభవాన్ని స్తుతించడానికి మనుష్యులను నియమించాడు, వారు సైన్యానికి ముందుగా నడిచారు: “యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించండి, ఆయన మారని ప్రేమ నిత్యం ఉంటుంది.”

  25. వారు అలా పాటలు పాడడం, స్తుతించడం మొదలుపెట్టినప్పుడు యెహోవా యూదా వారి మీద దండెత్తుతున్న అమ్మోనీయుల మీద, మోయాబీయుల మీద, శేయీరు కొండసీమవారి మీదా మాటుగాండ్రు ఉండేలా చేశారు. కాబట్టి వారు ఓడిపోయారు.