కంటెంట్‌కు వెళ్లండి

Music గురించి బైబిల్ వచనాలు

324 వచనాలు · 57 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. యూదా, బెన్యామీను, షెమయా, యిర్మీయా అనేవారు వెళ్లారు.

  2. అలాగే బూరలు ఊదుతూ కొంతమంది యాజకులు వెళ్లారు. ఆసాపు కుమారుడైన జక్కూరుకు పుట్టిన మీకాయా కుమారుడైన మత్తన్యాకు పుట్టిన షెమయా కుమారుడైన యోనాతానుకు పుట్టిన జెకర్యా,

  3. అతని సహాయకులైన షెమయా, అజరేలు, మిలలై, గిలలై, మాయి, నెతనేలు, యూదా, హనానీ అనేవారు దేవుని సేవకుడైన దావీదు నిర్దేశించిన సంగీత వాయిద్యాలు వాయిస్తూ వెళ్లారు. ధర్మశాస్త్ర శాస్త్రియైన ఎజ్రా వారిని నడిపించాడు.

  4. ఊట గుమ్మం దగ్గర వారు నేరుగా దావీదు పట్టణం గోడ మెట్ల మీదుగా దావీదు ఇంటిని దాటి తూర్పున ఉన్న నీటిగుమ్మం దగ్గరకు వెళ్లారు.

  5. కృతజ్ఞతాగీతాలు పాడే గాయకుల రెండవ బృందం వారికి ఎదురుగా వెళ్లారు. మిగిలిన సగం మంది ప్రజలతో పాటు కలిసి నేను అగ్ని గుండాల గోపురం అవతల నుండి వెడల్పు గోడ వరకు వెళ్లాము.

  6. వారు ఎఫ్రాయిం ద్వారం మీదగా వెళ్లి, యెషానా గుమ్మాన్ని, చేప గుమ్మాన్ని, హనానేలు గోపురాన్ని, వందవ గోపురాన్ని దాటి గొర్రెల గుమ్మం వరకు వెళ్లి కాపలా గుమ్మం దగ్గర ఆగారు.

  7. అప్పుడు కృతజ్ఞతాగీతాలు పాడే గాయకుల రెండు బృందాలు, నేను, నాతో పాటు ఉన్న అధికారులలో సగం మంది దేవుని మందిరంలో నిలబడ్డాము.

  8. అలాగే యాజకులైన ఎల్యాకీము, మయశేయా, మిన్యామీను, మీకాయా, ఎల్యోయేనై, జెకర్యా, హనన్యాలు తమ బూరలు పట్టుకుని ఉన్నారు.

  9. మయశేయా, షెమయా, ఎలియాజరు, ఉజ్జీ, యెహోహనాను, మల్కీయా, ఏలాము, ఏజెరులు అక్కడే ఉన్నారు. ఇజ్రహయా సారథ్యంలో గాయకులు గట్టిగా పాటలు పాడారు.

  10. ఆ రోజు దేవుడు తమకు గొప్ప ఆనందాన్ని ఇచ్చినందుకు వారు గొప్ప బలులు అర్పించి సంతోషించారు. స్త్రీలు పిల్లలు కూడా సంతోషించారు. యెరూషలేములోని ఈ సంతోష ధ్వనులు చాలా దూరం వరకు వినిపించాయి.

  11. ఆ సమయంలో ప్రజలిచ్చే ప్రథమ ఫలాలు, పదవ భాగాలు కానుకలకు సంబంధించిన గిడ్డంగులకు అధికారులుగా కొంతమంది నియమించబడ్డారు. పరిచర్య చేస్తున్న యాజకులు లేవీయులను బట్టి యూదా ప్రజలు సంతోషించారు కాబట్టి యాజకులు లేవీయుల కోసం ధర్మశాస్త్రంలో నిర్దేశించబడిన వంతులను పట్టణాల చుట్టూ ఉన్న పొలాల నుండి గిడ్డంగులకు చేరవేయడానికి వారు నియమించబడ్డారు.

  12. దావీదు అతని కుమారుడైన సొలొమోను ఆజ్ఞల ప్రకారం వారంతా సంగీతకారులు ద్వారపాలకులతో కలిసి తమ దేవుని సేవ, శుద్ధీకరణ సేవ చేశారు.

  13. చాలా కాలం క్రితం దావీదు, ఆసాపు కాలంలో సంగీతకారులను దేవునికి కృతజ్ఞతా స్తుతి గీతాలను నడిపించేవారు ఉండేవారు.

  14. అయితే జెరుబ్బాబెలు, నెహెమ్యా సమయంలో ఇశ్రాయేలీయులందరు సంగీతకారులకు, ద్వారపాలకులకు ప్రతిరోజు ఆహారం ఇచ్చేవారు. అలాగే ఇతర లేవీయులకు కూడా ఒక భాగం ప్రత్యేకంగా ప్రక్కన ఉంచేవారు. లేవీయులు అహరోను వారసులకు ఒక భాగం ప్రత్యేకంగా ప్రక్కన ఉంచేవారు.

  15. కంజర తంతి వాయిద్యాలు మోగిస్తూ పాడతారు; పిల్లనగ్రోవి ఊదుతూ ఆనందిస్తారు.

  16. నా వీణ దుఃఖానికి, నా పిల్లనగ్రోవి రోదన ధ్వనికి శ్రుతి చేయబడింది.

  17. నీతిమంతులారా, యెహోవాకు ఆనందంతో పాడండి; ఆయనను స్తుతించడం యథార్థవంతులకు తగినది.

  18. సితారాతో యెహోవాను స్తుతించండి; పది తంతుల వీణతో ఆయనను కీర్తించండి.

  19. ఆయనకు క్రొత్త పాట పాడండి; నైపుణ్యతతో వాయించండి, ఆనందంతో కేకలు వేయండి.

  20. యెహోవా వాక్కు న్యాయమైనది; ఆయన చేసే ప్రతిదీ నమ్మకమైనది.

  21. సంగీత దర్శకునికి. దావీదు కీర్తన గీతము. దేవుడు లేచును గాక, ఆయన శత్రువులు చెదిరిపోవుదురు గాక; ఆయన విరోధులు ఆయన ఎదుట నుండి పారిపోవుదురు గాక.

  22. మీరు వారిని పొగలా ఊదివేయండి; మైనం అగ్నికి కరిగి పోయినట్టు దుష్టులు దేవుని ఎదుట నశించెదరు గాక.

  23. కాని నీతిమంతులు సంతోషించి దేవుని ఎదుట ఆనందించుదురు గాక వారు సంతోషంగా ఆనందంగా ఉందురు గాక.

  24. దేవునికి పాడండి, ఆయన నామాన్ని బట్టి స్తుతి పాడండి, మేఘాల మీద స్వారీ చేసే ఆయనను కీర్తించండి; ఆయన పేరు యెహోవా; ఆయన ఎదుట ఆనందించండి.

  25. తన పరిశుద్ధ నివాసంలో ఉన్న దేవుడు, తండ్రిలేనివారికి తండ్రి, విధవరాండ్రకు సంరక్షుడు.