కంటెంట్‌కు వెళ్లండి

Music గురించి బైబిల్ వచనాలు

324 వచనాలు · 57 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ఈజిప్టు నుండి రాయబారులు వస్తారు. కూషు తనను తాను దేవునికి సమర్పించుకుంటుంది.

  2. భూలోక రాజ్యాల్లారా, దేవునికి పాడండి, ప్రభువుకు స్తుతి పాడండి. సెలా

  3. అనాది కాలం నుండి మహా ఆకాశాల్లో స్వారీ చేసే, తన స్వరంతో ఉరిమే ఆయనను కీర్తించండి.

  4. దేవుని శక్తిని ప్రకటించండి, ఆయన ప్రభావం ఇశ్రాయేలుపై ఉన్నది, ఆయన శక్తి అంతరిక్షంలో ఉంది.

  5. దేవా, మీరు మీ పరిశుద్ధాలయంలో భీకరులు; ఇశ్రాయేలు దేవుడు తన ప్రజలకు బల ప్రభావాన్ని ఇస్తారు. దేవునికే స్తుతి కలుగును గాక!

  6. నా దేవా, మీ నమ్మకత్వాన్ని బట్టి నేను సితారాతో మిమ్మల్ని స్తుతిస్తాను; ఇశ్రాయేలీయుల పరిశుద్ధుడా, నేను వీణతో మిమ్మల్ని స్తుతిస్తాను.

  7. సంగీత దర్శకునికి. గిత్తీతు అనే రాగం మీద పాడదగినది. ఆసాపు కీర్తన. మనకు బలంగా ఉన్న దేవునికి ఆనంద గానం చేయండి; యాకోబు దేవునికి బిగ్గరగా కేకలు వేయండి!

  8. సంగీతం మొదలుపెట్టండి, కంజర వాయించండి. మధురంగా సితారా వీణ మీటండి.

  9. అమావాస్య దినాన కొమ్ము ఊదండి, పౌర్ణమి పండుగ దినాన కొమ్ము ఊదండి;

  10. వారు వాయిద్యాలు వాయిస్తుండగా, “నా ఊటలన్నీ మీలోనే ఉన్నాయి” అని వారు పాడతారు.

  11. సబ్బాతు దినానికి తగిన కీర్తన. ఒక గీతము. యెహోవాను స్తుతించడం మంచిది. మహోన్నతుడా, మీ నామాన్ని కీర్తించడం మంచిది.

  12. ఉదయకాలం మీ మారని ప్రేమను రాత్రివేళ మీ నమ్మకత్వాన్ని పది తంతుల వీణ సితారా మాధుర్యంతో ప్రకటించడం మంచిది.

  13. Upon an instrument of ten strings, and upon the psaltery; upon the harp with a solemn sound.

  14. రండి! యెహోవాను గురించి ఆనంద గానం చేద్దాం; రక్షణ కొండయైన దేవునికి ఆనంద కేకలు వేద్దాము.

  15. కృతజ్ఞతార్పణతో ఆయన సన్నిధికి వద్దాం, సంగీత గానంతో ఆయనను కీర్తిద్దాము.

  16. ఒక కీర్తన. యెహోవాకు క్రొత్త పాట పాడండి, ఎందుకంటే ఆయన ఆశ్చర్యకార్యాలు చేశారు; ఆయన కుడిచేయి ఆయన పవిత్రమైన బాహువు విజయాన్ని కలిగిస్తాయి.

  17. యెహోవా రక్షణను వెల్లడించారు. దేశాల ఎదుట తన నీతిని వెల్లడించారు.

  18. ఇశ్రాయేలుకు తన ప్రేమను నమ్మకత్వాన్ని చూపాలని ఆయన జ్ఞాపకం చేసుకున్నారు; మన దేవుని రక్షణ భూమ్యంతాల వరకు కనపడింది.

  19. భూ సమస్తమా, యెహోవాకు ఆనందంతో కేకలు వేయి, సంగీతంతో ఉత్సాహ గానం చేయి;

  20. వీణతో యెహోవాకు సంగీత నాదం చేయి, వీణతో, గాన ధ్వనితో,

  21. బూరలు, పొట్టేలు కొమ్ము ఊదుతూ, రాజైన యెహోవా ఎదుట ఆనంద ధ్వనులు చేయి.

  22. సముద్రం, అందులో ఉన్నదంతా, లోకం, అందులో జీవించేవారంతా ప్రతిధ్వని చేయును గాక.

  23. యెహోవా సన్నిధిలో నదులు చప్పట్లు కొడతాయి. పర్వతాలు ఆనందంగా పాడతాయి.

  24. నా జీవితకాలమంతా నేను యెహోవాకు పాడతాను; నేను బ్రతికి ఉన్నంత కాలం నా దేవునికి నేను స్తుతిగానం చేస్తాను.

  25. ఆయనకు పాడండి, ఆయనకు స్తుతి పాడండి; ఆయన అద్భుత కార్యాలన్నిటిని గురించి చెప్పండి.