కంటెంట్‌కు వెళ్లండి

Music గురించి బైబిల్ వచనాలు

324 వచనాలు · 57 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. యెహోవాను స్తుతించండి. యెహోవా నామాన్ని స్తుతించండి; యెహోవా సేవకులారా, ఆయనను స్తుతించండి,

  2. యెహోవా మందిరంలో, మన దేవుని మందిర ఆవరణాల్లో సేవ చేసేవారలారా, ఆయనను స్తుతించండి.

  3. యెహోవా మంచివాడు కాబట్టి యెహోవాను స్తుతించండి; ఆయన నామానికి స్తుతులు పాడండి, అది మనోహరమైనది.

  4. బబులోను నదుల దగ్గర మనం కూర్చుని సీయోను పట్టణాన్ని జ్ఞాపకం చేసుకుని ఏడ్చాము.

  5. దాని మధ్యన ఉన్న నిరవంజి చెట్లకు మన సితారాలు తగిలించాము.

  6. మనల్ని పట్టుకున్నవారు పాటలు పాడమని మనల్ని అడిగారు, మనల్ని బాధించినవారు సంతోష గానాలు కోరారు; “సీయోను పాటల్లో ఒకటి పాడండి” అని అన్నారు.

  7. పరాయి దేశంలో ఉండగా యెహోవా పాటలు మనం ఎలా పాడగలము?

  8. యెరూషలేమా! నేను నిన్ను మరచిపోతే, నా కుడిచేయి దాని నేర్పును మరచిపోవాలి.

  9. నేను నిన్ను జ్ఞాపకం చేసుకోకపోతే, యెరూషలేము నాకు ఎక్కువ సంతోషం కలిగించేది అని నేను భావించకపోతే నా నాలుక నా అంగిలికి అంటుకుపోవాలి.

  10. నా దేవా, మీకు ఒక క్రొత్త పాట పాడతాను. పదితంతు వీణతో మీకు సంగీతం చేస్తాను.

  11. యెహోవాను స్తుతించండి. యెహోవాకు క్రొత్త పాట పాడండి, ఆయన యొక్క నమ్మకమైన ప్రజల సమాజంలో స్తుతి పాడండి.

  12. ఇశ్రాయేలీయులు తమ సృష్టికర్తలో సంతోషించును గాక; సీయోను ప్రజలు తమ రాజులో ఆనందించుదురు గాక.

  13. వారు ఆయన నామాన్ని నాట్యం చేస్తూ స్తుతిస్తారు తంబురతో సితారాతో గానం చేస్తారు.

  14. వారి నోళ్ళలో దేవుని స్తుతి వారి చేతుల్లో రెండంచుల ఖడ్గం ఉండును గాక.

  15. యెహోవాను స్తుతించండి. పరిశుద్ధాలయంలో దేవుని స్తుతించండి; ఆయన గొప్ప ఆకాశంలో దేవున్ని స్తుతించండి.

  16. ఆయన శక్తిగల కార్యాలను బట్టి ఆయనను స్తుతించండి; ఆయన మహా ప్రభావాన్ని బట్టి ఆయనను స్తుతించండి.

  17. బూర ధ్వనితో ఆయనను స్తుతించండి, సితారా, వీణలతో ఆయనను స్తుతించండి.

  18. కంజరతో, నాట్యంతో ఆయనను స్తుతించండి, తంతి వాయిద్యాలతో, పిల్లన గ్రోవితో ఆయనను స్తుతించండి.

  19. తాళాలు మ్రోగిస్తూ, గణగణ ధ్వని చేసే తాళాలతో, ఆయనను స్తుతించండి.

  20. ఊపిరి ఉన్న ప్రతిదీ యెహోవాను స్తుతించాలి. యెహోవాను స్తుతించండి.

  21. బాధలోనున్న వానికి పాటలు వినిపించేవాడు, బాగా చలిగా ఉన్నపుడు పై బట్టతీసివేయు వానితోను, పచ్చిపుండు మీద పుల్లని ద్రాక్షరసం పోసేవానితోను సమానము.

  22. నా కోసం వెండి బంగారం సమకూర్చుకున్నాను. విదేశాల నుండి రాజ సంపదను సేకరించాను. గాయనీ గాయకులను, మనుష్యుల హృదయాన్ని సంతోషపరిచే వాటిని సంపాదించాను; స్త్రీలు కూడా నా దగ్గర ఉన్నారు.

  23. నా కళ్లు కోరినవాటిలో దేన్ని చూడకుండ నేను నిరాకరించలేదు; సంతోషాలను అనుభవించకుండా నా హృదయాన్ని ఆటంకపరచలేదు. నా పనులన్నిటిని బట్టి నా హృదయం సంతోషించింది. నా శ్రమంతటికి కలిగిన ఫలితం ఇదే.

  24. అయితే, నా చేతులు చేసిన పనులన్నిటిని వాటికోసం నేను పడిన శ్రమనంతటి పరిశీలిస్తే, అవన్నీ అర్థరహితమే అని, గాలికి ప్రయాసపడినట్లే అని తెలుసుకున్నాను. సూర్యుని క్రింద లాభకరమైనదేదీ లేదని నేను గ్రహించాను.

  25. వారు సితారాలు, తంతి వాయిద్యాలు, కంజరలు, పిల్లనగ్రోవులు వాయిస్తూ ద్రాక్షరసం త్రాగుతూ విందు చేసుకుంటారు, కాని యెహోవా చేస్తున్న దానిని వారు గుర్తించరు ఆయన చేతిపనిని గౌరవించరు.