కంటెంట్‌కు వెళ్లండి

Music గురించి బైబిల్ వచనాలు

324 వచనాలు · 57 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు స్తుతి కలుగును గాక! అని అనగానే ప్రజలంతా, “ఆమేన్, యెహోవాకు స్తుతి” అని చెప్పారు.

  2. యెహోవా నిబంధన మందసం ఎదుట ప్రతిరోజు క్రమంగా సేవ చేయడానికి, దావీదు దాని దగ్గర ఆసాపును, అతని తోటి వారిని నియమించాడు.

  3. అలాగే ఓబేద్-ఎదోమును, అతని అరవై ఎనిమిది మంది తోటి వారిని కూడా అక్కడ నియమించాడు. యెదూతూను కుమారుడైన ఓబేద్-ఎదోము, హోసా అనేవారు ద్వారపాలకులు.

  4. దావీదు యాజకుడైన సాదోకును, అతని తోటి యాజకులను గిబియోనులోని ఆరాధన స్థలంలో ఉన్న యెహోవా సమావేశ గుడారం దగ్గర ఉంచాడు.

  5. యెహోవా ఇశ్రాయేలీయులకు ఆదేశించిన ధర్మశాస్త్రంలో వ్రాయబడిన ప్రకారం, ప్రతిరోజు ఉదయ సాయంత్రాల్లో క్రమంగా బలిపీఠం మీద దహనబలి యెహోవాకు అర్పించడానికి దావీదు వారిని నియమించాడు.

  6. “ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది” అని అంటూ ఆయనకు కృతజ్ఞతలు అర్పించడానికి వారితో కూడ హేమాను, యెదూతూను, పేర్లు చెప్పి ఎన్నుకున్న మరి కొంతమందిని అతడు నియమించాడు.

  7. బూరధ్వని చేయడానికి, తాళాలు వాయించడానికి, దేవున్ని స్తుతించడానికి ఇతర వాయిద్యాలను వాయించడానికి హేమాను, యెదూతూనులను నియమించాడు. యెదూతూను కుమారులను ద్వారపాలకులుగా నియమించాడు.

  8. ముప్పై సంవత్సరాలు అంతకు పైవయస్సు లేవీయులు లెక్కించబడ్డారు. వారు మొత్తం ముప్పై ఎనిమిది వేలమంది మనుష్యులు.

  9. నాలుగు వేలమంది ద్వారపాలకులుగా ఉండాలి, నాలుగు వేలమంది ఉద్దేశ్యం కలిగి నేను చేయించిన సంగీత వాయిద్యాలతో యెహోవాను కీర్తించాలి” అని చెప్పాడు.

  10. లేవీ కుమారులైన గెర్షోను, కహాతు, మెరారి వంశాల ప్రకారం దావీదు లేవీయులను వేరుచేసి మూడు విభాగాలు చేశాడు.

  11. దావీదు ఇచ్చిన చివరి ఆదేశాల ప్రకారం, లేవీయులలో ఇరవై సంవత్సరాలు అంతకు పైవయస్సు వారిని లెక్కించారు.

  12. వారు ప్రతిరోజు ఉదయం, సాయంకాలం నిలబడి యెహోవాను స్తుతించాలి. వారు సాయంకాలంలో, సబ్బాతు దినాల్లో, అమావాస్యల్లో, నియమించబడిన పండుగల్లో, యెహోవాకు దహనబలులు అర్పించే సమయాలన్నిటిలో వారు ఆయనను స్తుతించాలి. వారికి నియమించబడిన విధానం ప్రకారం క్రమంగా యెహోవా సముఖంలో సేవ చేయాలి.

  13. దావీదు, తన సైన్యాధిపతులతో కలిసి ఆసాపు, హేమాను, యెదూతూను అనేవారి కుమారులలో కొందరిని సితారాలు, వీణలు, తాళాలు వాయిస్తూ ప్రవచించే పరిచర్య కోసం నియమించారు. ఈ సేవకు నియమించబడినవారి జాబితా ఇది:

  14. ఆసాపు కుమారుల నుండి: జక్కూరు, యోసేపు, నెతన్యా, అషరేలా. వీరు రాజు పర్యవేక్షణలో ప్రవచిస్తూ, ఆసాపు పర్యవేక్షణలో ఉన్న ఆసాపు కుమారులు.

  15. యెదూతూను కుమారుల నుండి: గెదల్యా, జెరీ, యెషయా, షిమ్యా, హషబ్యా, మత్తిత్యా, మొత్తం ఆరుగురు, వీరు స్తుతి పాటలు పాడుతూ యెహోవాను స్తుతించడానికి వీణ వాయిస్తూ ప్రవచించే తమ తండ్రియైన యెదూతూను పర్యవేక్షణలో ఉన్నవారు.

  16. హేమాను కుమారుల నుండి: బక్కీయాహు, మత్తన్యా, ఉజ్జీయేలు, షెబూయేలు, యెరీమోతు; హనన్యా, హనానీ, ఎలీయాతా, గిద్దల్తీ, రోమమ్తీ-యెజెరు; యొష్బెకాషా, మల్లోతి, హోతీరు, మహజీయోతు.

  17. (వీరంతా రాజుకు దీర్ఘదర్శిగా ఉన్న హేమాను కుమారులు. తన వాగ్దానాల ప్రకారం హేమానును గొప్ప చేయడానికి దేవుడు హేమానుకు పద్నాలుగు మంది కుమారులను, ముగ్గురు కుమార్తెలను ఇచ్చారు.)

  18. వీరందరు తమ తండ్రుల పర్యవేక్షణలో ఉండి, యెహోవా మందిరంలో తాళాలు, వీణలు, సితారాలు వాయిస్తూ, పాటలు పాడుతూ దేవుని మందిరం దగ్గర సేవ చేసేవారు. ఆసాపు, యెదూతూను, హేమానులు రాజు పర్యవేక్షణలో ఉండేవారు.

  19. యెహోవాకు పాటలు పాడడంలో నైపుణ్యం ఉన్న వీరి బంధువులందరితో కలిపి వీరి సంఖ్య 288.

  20. చిన్నా, పెద్దా, గురువు శిష్యుడు అనే భేదం లేకుండా చీట్లు వేసి విధులు నిర్ణయించుకున్నారు.

  21. మొదటి చీటి ఆసాపు వంశంలో ఉన్న యోసేపు పేరిట వచ్చింది, రెండవది గెదల్యా పేరిట వచ్చింది, ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.

  22. మూడవది జక్కూరు పేరిట వచ్చింది, ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.

  23. నాలుగవది యిజ్రీ పేరిట వచ్చింది, ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.

  24. అయిదవది నెతన్యా పేరిట వచ్చింది, ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.

  25. ఆరవది బక్కీయాహు పేరిట వచ్చింది, ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది.