Skip to content

Edomites గురించి బైబిల్ వచనాలు

154 వచనాలు · 14 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. “ఈజిప్టు, యూదా, ఎదోము, అమ్మోను, మోయాబు అరణ్యంలో, సుదూర ప్రాంతాల్లో నివసించే వారందరినీ నేను శిక్షించే రోజులు వస్తున్నాయి. ఎందుకంటే ఈ దేశాలన్నీ నిజంగా సున్నతి పొందలేదు, ఇశ్రాయేలు ఇంటివారందరు కూడా హృదయంలో సున్నతి పొందలేదు.”

  2. యూదా రాజైన యోషీయా కుమారుడైన యెహోయాకీము ఏలుబడిలో, యెహోవా నుండి యిర్మీయాకు ఈ వాక్కు వచ్చింది:

  3. యెహోవా నాతో ఇలా అన్నారు: “సంకెళ్లు ఒక కాడిని తయారుచేసి నీ మెడ మీద పెట్టుకో.

  4. యూదా రాజైన సిద్కియా దగ్గరకు యెరూషలేముకు వచ్చిన రాయబారులతో ఎదోము, మోయాబు, అమ్మోను, తూరు, సీదోను రాజులకు కబురు పంపించు.

  5. తమ యజమానుల తెలియజేయమని వారికి ఈ సందేశం ఇవ్వు, ‘ఇశ్రాయేలు దేవుడైన సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: “మీరు మీ యజమానులకు ఇలా చెప్పండి:

  6. నా గొప్ప శక్తితో చాచిన బాహువుతో నేను భూమిని, దాని ప్రజలను దానిపై ఉన్న జంతువులను సృష్టించాను. నేను ఎవరు సరైన వారనుకుంటే వారికి దానిని ఇస్తాను.

  7. ఇప్పుడు నేను నీ దేశాలన్నిటిని నా సేవకుడు బబులోను రాజైన నెబుకద్నెజరు చేతికి అప్పగిస్తాను; అడవి జంతువులను కూడా అతనికి లోబడి చేస్తాను.

  8. అతని దేశానికి అంతం వచ్చేవరకు అన్ని దేశాలు అతనికి, అతని కుమారునికి, మనుమడికి సేవ చేస్తారు; అప్పుడు అనేక దేశాలు, గొప్ప రాజులు అతన్ని లొంగదీసుకుంటారు.

  9. “ ‘ “అయితే, ఏదైనా దేశం గాని రాజ్యం గాని బబులోను రాజైన నెబుకద్నెజరుకు సేవ చేయకపోయినా అతని కాడి క్రింద మెడ వంచకపోయినా, నేను ఆ దేశాన్ని కత్తితో, కరువుతో, తెగులుతో శిక్షిస్తాను, అతని చేతితో దానిని పూర్తిగా నాశనం చేస్తాను అని యెహోవా ప్రకటిస్తున్నారు.

  10. కాబట్టి, ‘మీరు బబులోను రాజుకు సేవ చేయరు’ అని మీతో చెప్పే మీ ప్రవక్తలు, భవిష్యవాణి చెప్పేవారు, కలల భావం చెప్పేవారు, మృతుల ఆత్మతో మాట్లాడేవారు, మంత్రగాళ్ల మాటలు మీరు వినవద్దు.

  11. మిమ్మల్ని మీ దేశం నుండి దూరం చేయడానికే వారు మీతో అబద్ధాలు ప్రవచిస్తారు; నేను నిన్ను వెళ్లగొడతాను మీరు నశిస్తారు.

  12. అయితే ఏ దేశమైనా బబులోను రాజు కాడి క్రింద మెడ వంచి అతనికి సేవ చేస్తే, నేను ఆ దేశాన్ని దాని సొంత దేశంలోనే ఉండి, దానిలో వ్యవసాయం చేయడానికి అక్కడ నివసించడానికి అనుమతిస్తానని యెహోవా ప్రకటిస్తున్నారు.” ’ ”

  13. ఎదోము గురించి: సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: “తేమానులో ఇక జ్ఞానం లేదా? వివేకవంతులు సలహా ఇవ్వడం మానివేశారా? వారి జ్ఞానం తగ్గిపోయిందా?

  14. దేదానులో నివసించేవారలారా, వెనక్కి తిరిగి పారిపోయి లోతైన గుహల్లో దాక్కోండి, నేను ఏశావు మీదికి విపత్తు రప్పించి వారిని శిక్షిస్తాను.

  15. ద్రాక్షలు పోగుచేసుకునేవారు మీ దగ్గరకు వస్తే, వారు కొన్ని ద్రాక్షలు వదిలేయరా? రాత్రివేళ దొంగలు వస్తే, వారికి కావలసినంత వారు దొంగిలించరా?

  16. అయితే నేను ఏశావును నగ్నంగా చేస్తాను; అతడు దాక్కునే స్థలాలను బయటపెడతాను, అప్పుడతడు ఎక్కడా దాక్కోలేడు. అతని సాయుధ పురుషులు నాశనానికి గురవుతారు, అతని సోదరులు పొరుగువారు కూడా నాశనమవుతారు. కాబట్టి,

  17. ‘తండ్రిలేని నీ పిల్లలను వదిలేయండి; నేను వారిని చూసుకుంటాను. నీ విధవరాండ్రు కూడా నన్ను నమ్ముకోవచ్చు’ అని చెప్పడానికి ఎవ్వరూ ఉండరు.”

  18. యెహోవా ఇలా అంటున్నారు: “పాత్రలోనిది త్రాగడానికి అర్హత లేనివారు కూడా దానిని త్రాగినప్పుడు మీరు శిక్షించబడకుండ ఎందుకు ఉండాలి? మీరు శిక్షించబడేలా దానిని మీరు త్రాగాలి.”

  19. యెహోవా, “నా జీవం తోడు, బొస్రా నాశనంగా, శాపంగా మారుతుందని, భయానకంగా, నిందలకు గురి అవుతుందని నా మీద నేను ప్రమాణం చేస్తున్నాను. దాని పట్టణాలన్ని శాశ్వతంగా శిథిలావస్థలో ఉంటాయి” అని ప్రకటిస్తున్నారు.

  20. నేను యెహోవా నుండి ఒక సందేశం వచ్చింది; “దానిపై దాడి చేయడానికి మీరంతా కలిసి రండి! లెండి! యుద్ధానికి వెళ్దాం” అని చెప్పడానికి, దేశాలకు ఒక దూత పంపబడ్డాడు.

  21. “ఇప్పుడు నేను నిన్ను దేశాల్లో అల్పమైన దానిగా, మనుష్యులు నిన్ను తృణీకరించేలా చేస్తాను.

  22. నీవు రేపిన భయాందోళనలు, నీ హృదయ గర్వం నిన్ను మోసం చేశాయి, బండ సందుల్లో నివసించేదానా, కొండ శిఖరాల మీద నివాసం ఏర్పరచుకున్నదానా, నీవు గ్రద్దలా ఎత్తైన చోట నీ గూడు కట్టుకున్నా అక్కడినుండి నేను నిన్ను క్రిందికి పడవేస్తాను” అని యెహోవా చెప్తున్నారు.

  23. “ఎదోము నాశనం అవుతుంది; దారిన వెళ్లేవారంతా నివ్వెరపోతారు, దాని గాయాలన్నిటిని చూసి ఎగతాళి చేస్తారు.

  24. సొదొమ గొమొర్రాలను వాటి చుట్టూ ఉన్న పట్టణాలతో పాటు పడగొట్టినట్లు వీటిని కూడా పడగొట్టిన తర్వాత అక్కడ ఎవరూ నివసించనట్లే; ఇక్కడ కూడా ప్రజలు నివసించరు” అని యెహోవా అంటున్నారు.

  25. “యొర్దాను పొదల్లో నుండి సింహం సమృద్ధిగా ఉన్న పచ్చిక బయళ్లకు వస్తున్నట్లుగా, నేను ఎదోమును దాని దేశం నుండి క్షణాల్లో తరిమివేస్తాను. దీని కోసం నేను నియమించిన వ్యక్తి ఎవరు? నాలాంటివారు ఎవరున్నారు, ఎవరు నన్ను సవాలు చేయగలరు? ఏ కాపరి నాకు వ్యతిరేకంగా నిలబడగలడు?”