Skip to content

Edomites గురించి బైబిల్ వచనాలు

154 వచనాలు · 14 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. కాబట్టి ఎదోమును వ్యతిరేకంగా యెహోవా ఏమి ప్రణాళిక వేశారో వినండి, తేమానులో నివసించేవారికి ఆయన ఏమి ఉద్దేశించారో వినండి: మందలోని చిన్న పిల్లలు బయటకు ఈడ్చివేయబడతాయి; వారు చేసిన దానికి వారి పచ్చికబయళ్లు పాడుచేయబడతాయి.

  2. వారు పతనమైనప్పుడు భూమి కంపిస్తుంది; వారి మొర ఎర్ర సముద్రం వరకు వినిపిస్తుంది.

  3. చూడండి! శత్రువు తన రెక్కలు బొస్రా మీదుగా విప్పి గ్రద్దలా దూసుకుపోతాడు. ఆ రోజున ఎదోము యోధులు ప్రసవ వేదనలో ఉన్న స్త్రీలా వేదనలో ఉంటారు.

  4. ఎదోము కుమారీ, ఊజు దేశంలో నివసిస్తున్నదానా, ఆనందించి సంతోషించు. అయితే గిన్నె మీకు కూడా పంపబడుతుంది; నీవు త్రాగి మత్తెక్కి వస్త్రాలు ఊడిపోయి నగ్నంగా ఉంటావు.

  5. సీయోను కుమారీ, నీ శిక్ష పూర్తి కాబోతుంది; ఆయన మీ చెరను పొడిగించరు. కానీ ఎదోము కుమారీ, ఆయన నీ పాపాన్ని శిక్షిస్తారు, నీ దుర్మార్గాన్ని బట్టబయలు చేస్తారు.

  6. “ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: ‘ఎదోమీయులు యూదా వారి మీద పగతీర్చుకున్నారు. అలా చేసి వారు దోషులయ్యారు,

  7. కాబట్టి ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: ఎదోము మీద నా చేయి చాపి మనుష్యులను పశువులను చంపి సమస్తాన్ని నిర్మూలం చేస్తాను. తేమాను పట్టణం నుండి దేదాను వరకు ప్రజలంతా కత్తివేటుకు కూలిపోతారు.

  8. నా ప్రజలైన ఇశ్రాయేలీయుల చేత ఎదోము మీద నా పగ తీర్చుకుంటాను. నా కోపం నా ఉగ్రతకు అనుగుణంగా వారు ఎదోముకు చేస్తారు. అప్పుడు నా ఉగ్రత ఎలా ఉంటుందో వారు తెలుసుకుంటారు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.’ ”

  9. “అక్కడ ఎదోము, దాని రాజులు యువరాజులు ఉన్నారు; వారికి శక్తి ఉన్నప్పటికీ, వారు ఖడ్గం చేత చంపబడినవారితో పాటు పడి ఉన్నారు. వారు సున్నతి పొందని వారితో, గొయ్యిలో దిగే వారితో పడుకుంటారు.

  10. “ఉత్తర ప్రాంత అధిపతులందరు, అలాగే సీదోనీయులందరు అక్కడ ఉన్నారు; వారు తమ శక్తి వల్ల భీభత్సం సృష్టించినప్పటికీ చంపబడినవారితో దిగివెళ్లి అవమానానికి గురయ్యారు. వారు ఖడ్గం చేత చంపబడినవారితో సున్నతి పొందని వారిగా పడి ఉన్నారు, పాతాళానికి దిగివెళ్లే వారితో తమ అవమానాన్ని భరిస్తున్నారు.

  11. యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది:

  12. “మనుష్యకుమారుడా, శేయీరు పర్వతం వైపు నీ ముఖం త్రిప్పి దానికి వ్యతిరేకంగా ప్రవచించి ఇలా చెప్పు:

  13. ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: ఓ శేయీరు పర్వతమా, నేను నీకు వ్యతిరేకిని, నేను నీకు వ్యతిరేకంగా నా చేయి చాపి నిన్ను నిర్జనమై వ్యర్థంగా మిగిలిపోయేలా చేస్తాను.

  14. నీ పట్టణాలను శిథిలాలుగా మారుస్తాను; నీవు నిర్జనమవుతావు. అప్పుడు నేనే యెహోవానని తెలుసుకుంటావు.

  15. “ ‘నీవు ఇశ్రాయేలీయుల పట్ల ఎప్పుడూ పగతో ఉండి, వారి విపత్తు సమయంలో, వారి శిక్ష ముగింపుకు చేరుకున్న సమయంలో నీవు వారిని ఖడ్గానికి అప్పగించావు,

  16. కాబట్టి నా జీవం తోడు, నేను నిన్ను రక్తపాతానికి అప్పగిస్తాను, అది నీ వెంటపడుతుంది. నీవు రక్తపాతాన్ని ద్వేషించలేదు కాబట్టి, రక్తపాతం నిన్ను వెంటాడుతుందని యెహోవా ప్రకటిస్తున్నారు.

  17. నేను శేయీరు పర్వతాన్ని నిర్జనంగా వ్యర్థంగా చేస్తాను, వస్తూ వెళ్తూ ఉండేవారు అక్కడ లేకుండా చేస్తాను.

  18. నీ పర్వతాలను శవాలతో నింపుతాను; ఖడ్గం చేత చచ్చినవారు నీ కొండలమీద, నీ లోయల్లో, నీ వాగుల్లో పడి ఉంటారు.

  19. నేను నిన్ను శాశ్వతంగా పాడైపోయేలా చేస్తాను; నీ పట్టణాల్లో ఎవరూ నివసించరు. అప్పుడు నేనే యెహోవానని నీవు తెలుసుకుంటావు.

  20. “ ‘యెహోవానైన నేను అక్కడ ఉన్నప్పటికీ, “ఈ రెండు జాతులు, దేశాలు మనవే; మనం వాటిని స్వాధీనం చేసుకుందాం” అని మీరు చెప్పారు.

  21. కాబట్టి నా జీవం తోడు నీవు వారిమీద ద్వేషంతో నీవు వారికి చూపించిన కోపం అసూయను బట్టి నేను నీ పట్ల తగిన రీతిగా వ్యవహరిస్తాను. నేను నిన్ను శిక్షించినప్పుడు నన్ను నేను వారికి పరిచయం చేసుకుంటాను అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.

  22. “అవి పాడుచేయబడ్డాయి, మనకు ఆహారంగా ఇవ్వబడ్డాయి” అని నీవు ఇశ్రాయేలు పర్వతాలను దూషించిన మాటలన్నీ యెహోవానైన నేను విన్నానని నీవు తెలుసుకుంటావు.

  23. మీరు ప్రగల్భాలు పలుకుతూ, ఏమాత్రం అదుపు లేకుండా నాకు వ్యతిరేకంగా మాట్లాడారు, అదంతా నేను విన్నాను.

  24. ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: ఒకవైపు లోకమంతా సంతోషిస్తూ ఉంటే, నేను నిన్ను నాశనం చేస్తాను.

  25. ఇశ్రాయేలీయుల వారసత్వం పాడైపోయినప్పుడు నీవు సంతోషించావు, కాబట్టి నేను నీతో అలాగే వ్యవహరిస్తాను. శేయీరు పర్వతమా, నీవూ నీతో పాటు ఎదోము అంతా పాడైపోతుంది. అప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు.’ ”