కంటెంట్‌కు వెళ్లండి

Edomites గురించి బైబిల్ వచనాలు: Amaziah, king of Judah, invades the territory of

5 వచనాలు · 14 కోణాలు

Amaziah, king of Judah, invades the territory of గురించి వచనాలు

  1. రాజ్యం తన వశంలో స్థిరమైన తర్వాత అతడు రాజైన తన తండ్రిని చంపిన ఆ అధికారులను చంపించాడు.

  2. అయితే అతడు ఆ హంతకుల సంతానాన్ని చంపలేదు. మోషే వ్రాసిన ధర్మశాస్త్రంలో, “తల్లిదండ్రులు తమ పిల్లల కోసం మరణశిక్ష పొందుకోవద్దు, లేదా వారి తల్లిదండ్రుల కోసం పిల్లలు మరణశిక్ష పొందుకోవద్దు; ప్రతి ఒక్కరూ తమ సొంత పాపం కోసం చనిపోతారు” అని యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం అతడు చేశాడు.

  3. అమజ్యా ఉప్పు లోయలో యుద్ధం చేసి పదివేలమంది ఎదోమీయులను చంపి, సెల ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుని దానికి యొక్తియేలు అనే పేరు పెట్టాడు. ఈనాటికి దాని పేరు అదే.

  4. తర్వాత అమజ్యా బలం కూడగట్టుకొని తన సైన్యాన్ని ఉప్పు లోయకు నడిపించి అక్కడ 10,000 మంది శేయీరు వారిని చంపాడు.

  5. అంతేగాక యూదా సైన్యం మరో 10,000 మందిని ప్రాణాలతో పట్టుకుని, వారిని ఒక కొండచరియపైకి తీసుకెళ్లి అక్కడినుండి క్రిందికి పడవేశారు. వారంతా ముక్కలైపోయారు.