Skip to content

Consolation Under Affliction గురించి బైబిల్ వచనాలు

87 వచనాలు · 22 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. “రండి, మనం విషయాన్ని పరిష్కరించుకుందాం” అని యెహోవా అంటున్నారు. “మీ పాపాలు రక్తంలా ఎర్రగా ఉన్నా, అవి మంచులా తెల్లగా అవుతాయి; కెంపులా ఎర్రగా ఉన్నా, అది ఉన్నిలా తెల్లగా అవుతాయి.

  2. ఆ రోజున మీరు ఇలా అంటారు: “యెహోవా, నేను మిమ్మల్ని స్తుతిస్తాను. మీరు నాపై కోప్పడినా కూడా మీ కోపం చల్లారింది మీరు నన్ను ఆదరించారు.

  3. నా ప్రజలను ఓదార్చండి, ఓదార్చండి, అని మీ దేవుడు చెప్తున్నారు.

  4. యెరూషలేముతో ప్రేమగా మాట్లాడండి ఆమె యుద్ధకాలం ముగిసిందని ఆమె పాపదోషం తీరిపోయిందని యెహోవా చేతిలో ఆమె పాపాలన్నిటి కోసం రెండింతల ఫలం పొందిందని ఆమెకు తెలియజేయండి.

  5. ఆకాశాల్లారా, ఉత్సాహ ధ్వని చేయండి; భూమీ, సంతోషించు; పర్వతాల్లారా, ఆనందంతో పాట పాడండి! ఎందుకంటే, యెహోవా తన ప్రజలను ఓదారుస్తారు, బాధించబడిన తన ప్రజల పట్ల జాలి చూపిస్తారు.

  6. యెహోవా తప్పకుండా సీయోనును ఓదారుస్తారు దాని శిథిలాలన్నిటిని దయతో చూస్తారు; దాని ఎడారులను ఏదెనులా చేస్తారు. దాని బీడుభూములను యెహోవా తోటలా చేస్తారు. ఆనంద సంతోషాలు, కృతజ్ఞతాస్తుతులు, సంగీత ధ్వనులు దానిలో కనబడతాయి.

  7. “నేను నేనే మిమ్మల్ని ఓదార్చుతాను. చనిపోయే మనుష్యులకు గడ్డివంటి మనుష్యులకు మీరు ఎందుకు భయపడతారు?

  8. ప్రభువైన యెహోవా ఆత్మ నా మీద ఉన్నది. బీదలకు సువార్త ప్రకటించడానికి యెహోవా నన్ను అభిషేకించారు. విరిగిన హృదయం గలవారిని బలపరచడానికి బందీలకు విడుదలను ఖైదీలకు చీకటి నుండి విముక్తిని ప్రకటించడానికి,

  9. యెహోవా హితవత్సరాన్ని, మన దేవుని ప్రతీకార దినాన్ని ప్రకటించడానికి దుఃఖిస్తున్న వారందరినీ ఓదార్చడానికి,

  10. ఆదరణకరమైన ఆమె రొమ్ము పాలు త్రాగి మీరు తృప్తిపొందుతారు. మీరు తృప్తిగా త్రాగి ఆమె సమృద్ధిని అనుభవిస్తూ ఆనందిస్తారు.”

  11. తల్లి తన బిడ్డను ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను. యెరూషలేములోనే మీరు ఆదరించబడతారు.”

  12. రాత్రంతా ఆమె ఘోరంగా ఏడుస్తూ ఉంటుంది, ఆమె చెంపల మీద కన్నీరు ఉంటుంది. ఆమె ప్రేమికులందరి మధ్య ఉన్నా ఆమెను ఓదార్చడానికి ఎవరూ లేరు. ఆమె స్నేహితులందరూ ఆమెను అప్పగించారు; వారు ఆమెకు శత్రువులయ్యారు.

  13. అయినప్పటికీ దానిలో నుండి బయటకు రప్పించబడిన కుమారులు కుమార్తెలలో కొంతమంది ప్రాణాలతో మిగిలి ఉంటారు. వారు మీ దగ్గరకు వస్తారు, మీరు వారి ప్రవర్తనలో పనులలో తేడాను చూసినప్పుడు నేను యెరూషలేము మీదికి రప్పించిన కీడు గురించి నేను దానికి చేసిన వాటన్నిటి గురించి మీరు ఓదార్పు పొందుతారు.

  14. వారి ప్రవర్తన వారి పనులు చూసినప్పుడు నేను కారణం లేకుండా ఏదీ చేయలేదని మీరు తెలుసుకుని ఓదార్పు పొందుతారు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.”

  15. కాబట్టి ఆమెను ఆకర్షించబోతున్నాను; నేను ఆమెను అరణ్యంలోకి నడిపించి, ఆమెతో మృదువుగా మాట్లాడతాను.

  16. మీలాంటి దేవుడెవరు? మీరు మీ వారసత్వమైన వారిలో మిగిలిన వారి పాపాలను మన్నించి, అతిక్రమాలను క్షమిస్తారు, మీరు నిత్యం కోపంతో ఉండరు కాని దయ చూపడంలో ఆనందిస్తారు.

  17. మీరు మళ్ళీ మమ్మల్ని కనికరిస్తారు; మీరు మా పాపాలను అణగద్రొక్కుతారు, మా అతిక్రమాలన్నిటిని సముద్రంలో లోతుల్లో పడవేస్తారు.

  18. “ఇది కూడా నీవు ప్రకటించు: సైన్యాల యెహోవా చెప్పే మాట ఇదే: ‘నా పట్టణాలు మళ్ళీ అభివృద్ధితో నిండుతాయి, యెహోవా మళ్ళీ సీయోనును ఆదరిస్తారు, యెరూషలేమును ఎన్నుకుంటారు.’ ”

  19. “ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించడానికి, ఆయన నన్ను అభిషేకించారు; చెరలో ఉన్నవారికి విడుదలను ప్రకటించడానికి, గ్రుడ్డివారికి చూపును ఇవ్వడానికి, బాధింపబడిన వారికి విడుదలను కలుగచేయడానికి,

  20. “మీ హృదయాలను కలవరపడనీయకండి. దేవుని నమ్మండి; నన్ను కూడా నమ్మండి.

  21. నా తండ్రి ఇంట్లో చాలా నివాసస్థలాలు ఉన్నాయి, ఒకవేళ లేకపోతే, మీ కోసం స్థలాన్ని సిద్ధం చేయడానికి వెళ్తున్నానని నేను మీతో చెప్పి ఉండేవాడినా?

  22. మీతో ఎల్లప్పుడు ఉండేలా మరొక ఆదరణకర్తను మీకు ఇవ్వమని, నేను తండ్రిని అడుగుతాను.

  23. ఆయన సత్యమైన ఆత్మ. ఈ లోకం ఆయనను చూడలేదు తెలుసుకోలేదు, కాబట్టి ఆయనను అంగీకరించదు. కానీ మీకు ఆయన తెలుసు, ఎందుకంటే ఆయన మీలో జీవిస్తున్నాడు మీలో ఉంటాడు.

  24. నేను మీ దగ్గరకు వస్తాను, మిమ్మల్ని అనాధలుగా విడిచిపెట్టను.

  25. నా సమాధానాన్ని మీతో వదిలి వెళ్తున్నాను; నా సమాధానాన్ని మీకు ఇస్తున్నాను. నేను ఈ లోకం ఇచ్చినట్టుగా ఇవ్వడం లేదు మీ హృదయాలను కలవరపడనీయకండి, భయపడకండి.