కంటెంట్‌కు వెళ్లండి

Consolation Under Affliction గురించి బైబిల్ వచనాలు: In prospect of death

12 వచనాలు · 22 కోణాలు

In prospect of death గురించి వచనాలు

  1. నా విమోచకుడు సజీవుడని, తుదకు ఆయన భూమి మీద నిలబడతారని నాకు తెలుసు.

  2. నా చర్మం నాశనమైపోయిన తర్వాత నా శరీరంతో నేను దేవుని చూస్తాను.

  3. మృత్యు నీడలా ఉన్న లోయలో నేను నడిచినా, ఏ కీడుకు భయపడను, ఎందుకంటే మీరు నాతో ఉన్నారు; మీ దండం మీ చేతికర్ర నన్ను ఆదరిస్తాయి.

  4. నా తండ్రి ఇంట్లో చాలా నివాసస్థలాలు ఉన్నాయి, ఒకవేళ లేకపోతే, మీ కోసం స్థలాన్ని సిద్ధం చేయడానికి వెళ్తున్నానని నేను మీతో చెప్పి ఉండేవాడినా?

  5. మనం నివసిస్తున్న భూసంబంధమైన గుడారం నాశనమైనా, మానవ నిర్మితం కాని దేవుడు కట్టిన ఒక శాశ్వతమైన గృహం పరలోకంలో ఉందని మనకు తెలుసు.

  6. యేసు చనిపోయి తిరిగి లేచారని మనం నమ్ముతున్నాం కాబట్టి, ఆయనలో నిద్రించినవారిని దేవుడు యేసుతో పాటు తీసుకువస్తారని నమ్ముతున్నాము.

  7. కాబట్టి దేవుని ప్రజలకు ఏడవ రోజు సబ్బాతు దినం;

  8. అప్పుడు నేను, “అయ్యా, అది మీకే తెలుసు కదా” అని చెప్పాను. అతడు నాతో ఇలా అన్నాడు, “వీరు మహా హింసలలో నుండి వచ్చినవారు. వీరు వధించబడిన గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రాలను ఉతుక్కుని తెల్లగా చేసుకున్నారు.

  9. అందుకే, “వీరు దేవుని సింహాసనం ముందు ఉండి, ఆయన మందిరంలో రాత్రింబగళ్ళు ఆయనను ఆరాధిస్తున్నారు, కాబట్టి ఆ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నవాడు తన సన్నిధితో వారిని సంరక్షిస్తాడు.

  10. ‘మరి ఎన్నడు వారికి ఆకలి ఉండదు దాహం ఉండదు; సూర్యుని తీవ్రమైన వేడి కూడా వారికి తగలదు’ ఏ వేడి వారిని కాల్చదు.

  11. ఎందుకంటే, సింహాసనం మధ్యలో ఉన్న వధించబడిన గొర్రెపిల్ల వారికి కాపరిగా ఉండి ‘జీవజలాల ఊటల దగ్గరకు వారిని నడిపిస్తాడు.’ ‘దేవుడు వారి కళ్లలో నుండి కారే ప్రతి కన్నీటి చుక్కను తుడిచివేస్తారు.’”

  12. అప్పుడు పరలోకం నుండి ఒక స్వరం, “ఇప్పటినుండి ప్రభువులో ఉంటూ చనిపోయే వారు ధన్యులు! అని వ్రాసి పెట్టు” అని చెప్పింది. దేవుని ఆత్మ, “అవును నిజమే, తమ ప్రయాస నుండి విశ్రాంతి పొందుతారు. ఎందుకంటే వారి క్రియల ఫలాన్ని వారు పొందుతారు” అని పలకడం వినిపించింది.