కంటెంట్‌కు వెళ్లండి

Consolation Under Affliction గురించి బైబిల్ వచనాలు: Promised

7 వచనాలు · 22 కోణాలు

"Consolation Under Affliction" కోసం వెతకండి

Promised గురించి వచనాలు

  1. యెహోవా తప్పకుండా సీయోనును ఓదారుస్తారు దాని శిథిలాలన్నిటిని దయతో చూస్తారు; దాని ఎడారులను ఏదెనులా చేస్తారు. దాని బీడుభూములను యెహోవా తోటలా చేస్తారు. ఆనంద సంతోషాలు, కృతజ్ఞతాస్తుతులు, సంగీత ధ్వనులు దానిలో కనబడతాయి.

  2. “నేను నేనే మిమ్మల్ని ఓదార్చుతాను. చనిపోయే మనుష్యులకు గడ్డివంటి మనుష్యులకు మీరు ఎందుకు భయపడతారు?

  3. తల్లి తన బిడ్డను ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను. యెరూషలేములోనే మీరు ఆదరించబడతారు.”

  4. అయినప్పటికీ దానిలో నుండి బయటకు రప్పించబడిన కుమారులు కుమార్తెలలో కొంతమంది ప్రాణాలతో మిగిలి ఉంటారు. వారు మీ దగ్గరకు వస్తారు, మీరు వారి ప్రవర్తనలో పనులలో తేడాను చూసినప్పుడు నేను యెరూషలేము మీదికి రప్పించిన కీడు గురించి నేను దానికి చేసిన వాటన్నిటి గురించి మీరు ఓదార్పు పొందుతారు.

  5. వారి ప్రవర్తన వారి పనులు చూసినప్పుడు నేను కారణం లేకుండా ఏదీ చేయలేదని మీరు తెలుసుకుని ఓదార్పు పొందుతారు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.”

  6. కాబట్టి ఆమెను ఆకర్షించబోతున్నాను; నేను ఆమెను అరణ్యంలోకి నడిపించి, ఆమెతో మృదువుగా మాట్లాడతాను.

  7. “ఇది కూడా నీవు ప్రకటించు: సైన్యాల యెహోవా చెప్పే మాట ఇదే: ‘నా పట్టణాలు మళ్ళీ అభివృద్ధితో నిండుతాయి, యెహోవా మళ్ళీ సీయోనును ఆదరిస్తారు, యెరూషలేమును ఎన్నుకుంటారు.’ ”