Skip to content

Consolation Under Affliction గురించి బైబిల్ వచనాలు

87 వచనాలు · 22 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. శాశ్వతమైన దేవుడు నీకు ఆశ్రయం, నిత్యమైన హస్తాలు నీ క్రింద ఉన్నాయి. ‘వారిని నాశనం చెయ్యండి!’ అంటూ ఆయన నీ శత్రువులను నీ ఎదుట నుండి తరిమివేస్తారు.

  2. నా విమోచకుడు సజీవుడని, తుదకు ఆయన భూమి మీద నిలబడతారని నాకు తెలుసు.

  3. నా చర్మం నాశనమైపోయిన తర్వాత నా శరీరంతో నేను దేవుని చూస్తాను.

  4. దేవా, మీరైతే బాధితుల ఇబ్బందిని చూస్తారు; వారి దుఃఖాన్ని మీరు లక్ష్యపెట్టి బాధ్యత తీసుకుంటారు. నిస్సహాయులు మిమ్మల్ని ఆశ్రయిస్తారు; తండ్రిలేనివారికి మీరే సహాయకులు.

  5. మృత్యు నీడలా ఉన్న లోయలో నేను నడిచినా, ఏ కీడుకు భయపడను, ఎందుకంటే మీరు నాతో ఉన్నారు; మీ దండం మీ చేతికర్ర నన్ను ఆదరిస్తాయి.

  6. నా తల్లిదండ్రులు నన్ను విడిచినా, యెహోవా నన్ను చేరదీస్తారు.

  7. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించారు కష్టాలన్నిటిలో నుండి ఆయన నన్ను రక్షించారు.

  8. యెహోవా పరిశుద్ధ జనమా, ఆయనకు భయపడండి, ఆయనకు భయపడేవారికి ఏ కొదువ ఉండదు.

  9. సింహాలు ఆకలితో బలహీనం కావచ్చు, కాని యెహోవాను వెదికేవారికి ఏ మేలు కొరతగా ఉండదు.

  10. యెహోవా వారి రోగ పడక మీద వారికి స్వస్థత కలిగిస్తారు; వారి అనారోగ్యం నుండి మీరు వారికి స్వస్థత కలుగ చేస్తారు.

  11. నేను నమ్మిన నా దగ్గరి స్నేహితుడు, నా ఆహారం తిన్నవాడే, నాకు వ్యతిరేకంగా మడిమ ఎత్తాడు.

  12. యెహోవా, నన్ను కరుణించి; వారి మీద ప్రతీకారం తీర్చుకొనేలా నన్ను పైకి లేవనెత్తండి.

  13. నా శత్రువు నాపై విజయం సాధించలేదు కాబట్టి, నేనంటే మీకు ఇష్టమని నేను తెలుసుకున్నాను.

  14. నా నిజాయితీని బట్టి మీరు నన్ను నిలబెట్టారు, మీరు నన్ను నిత్యం మీ సన్నిధిలో స్థిరపరిచారు.

  15. నా ప్రాణమా, ఎందుకిలా క్రుంగిపోతున్నావు? నాలో నీవెందుకిలా కంగారు పడుతున్నావు? దేవుని మీద నిరీక్షణ ఉంచు, ఆయనే నా రక్షకుడు నా దేవుడు, నేను ఆయనను స్తుతిస్తూనే ఉంటాను.

  16. విరిగిన ఆత్మ దేవునికి ఇష్టమైన బలి; పశ్చాత్తాపంతో విరిగిన హృదయాన్ని దేవా, మీరు నిరాకరించరు.

  17. వారు చేసిన అవమానాలకు నా గుండె బద్దలయ్యింది. నేను నిరాశలో ఉన్నాను; నేను సానుభూతి కోసం చూశాను, కానీ ఎవరూ లేరు ఆదరించేవారి కోసం చూశాను, కానీ ఒక్కరూ దొరకలేదు.

  18. నేను వృద్ధాప్యంలో ఉన్నప్పుడు నన్ను త్రోసివేయకండి; నా బలం తగ్గిపోయినప్పుడు నన్ను విడిచిపెట్టకండి.

  19. నేను వృద్ధుడనై తల నెరసినప్పటికి, నా దేవా, తర్వాత తరానికి మీ శక్తిని, రాబోయే వారందరికి మీ గొప్ప కార్యాలను ప్రకటించే వరకు నన్ను విడిచిపెట్టకండి.

  20. మీరు నా గౌరవాన్ని పెంచుతారు మరోసారి నన్ను ఓదార్చుతారు.

  21. ఆందోళన కలిగించే తలంపులు ఎక్కువ అవుతున్నాయి. మీ ఓదార్పు నాకు ఆనందాన్ని కలిగించింది.

  22. నా శ్రమలో నా ఆదరణ ఇదే: మీ వాగ్దానం నన్ను బ్రతికిస్తుంది.

  23. మీ సేవకునికి మీరు ఇచ్చిన వాగ్దాన ప్రకారం, మీ మారని ప్రేమ నాకు ఆదరణ కలిగిస్తుంది.

  24. మీ వాగ్దానం కోసం ఎదురుచూస్తూ నా కళ్లు క్షీణిస్తున్నాయి; “మీరు నన్ను ఎప్పుడు ఆదరిస్తారు?” అని నేను అంటాను.

  25. సూర్యుని క్రింద జరుగుతున్న అణచివేతనంతటిని నేను చూశాను: సూర్యుని క్రింద అణగారిన వారి కన్నీటిని నేను చూశాను, కాబట్టి వారిని ఆదరించేవారెవరూ లేరు; బాధపెట్టేవారు బలవంతులు, వారిని ఆదరించేవారెవరూ లేరు.