Skip to content

Betrayal గురించి బైబిల్ వచనాలు

31 వచనాలు · 4 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. ఆ వేగులవారు ఆ పట్టణం నుండి ఒక వ్యక్తి రావడం చూసి అతనితో, “అయ్యా, దయచేసి పట్టణంలోకి ఎలా వెళ్లాలో మాకు చూపించు, మేము నీకు ఏదైనా ఉపకారం చేస్తాం” అని అన్నారు.

  2. కాబట్టి అతడు చూపించాడు, వారు అతన్ని, అతని కుటుంబాన్నంతటిని వదిలి పట్టణస్థులందరిని ఖడ్గంతో హతం చేశారు.

  3. దావీదు నోబులో యాజకుడైన అహీమెలెకు దగ్గరకు వచ్చాడు. అయితే అహీమెలెకు దావీదు రావడం చూసి భయపడి, “నీతో ఎవరూ లేకుండా నీవు ఒక్కడివే వచ్చావెందుకు?” అని అతన్ని అడిగాడు.

  4. అందుకు దావీదు యాజకుడైన అహీమెలెకుతో, “రాజు నాకు ఒక పని అప్పగించి, ‘నేను నిన్ను పంపిన పని గురించి ఎవరికి తెలియకూడదు’ అన్నాడు. నేను నా మనుష్యులతో ఒక చోటికి వెళ్లి అక్కడ ఉండమని చెప్పాను.

  5. నీ దగ్గర ఏముంది? అయిదు రొట్టెలు గాని మరేమైనా గాని ఉంటే అవి నాకు ఇవ్వు” అన్నాడు.

  6. ఆ యాజకుడు దావీదుతో, “సాధారణ రొట్టె నా దగ్గర లేదు; నీ మనుష్యులు స్త్రీలకు దూరంగా ఉన్నట్లయితే వారు ఇక్కడ ఉన్న ప్రతిష్ఠిత రొట్టెలు తినవచ్చు” అని చెప్పాడు.

  7. అందుకు దావీదు, “ఖచ్చితంగా నేను బయలుదేరి వచ్చినప్పటి నుండి ఈ మూడు రోజులు స్త్రీలు మాకు దూరంగానే ఉన్నారు. వారి దేహాలు పవిత్రంగానే ఉన్నాయి. సాధారణ పనిమీద వెళ్లినప్పుడే ఈ మనుష్యులు పవిత్రంగా ఉంటే, ఈ రోజు ఇంకెంత పవిత్రంగా ఉంటారు!”

  8. యాజకుడు అతనికి వెచ్చని రొట్టెలు వేసే రోజున తీసివేయబడిన ప్రతిష్ఠితమైన రొట్టెలను ఇచ్చాడు, ఎందుకంటే అక్కడ యెహోవా సన్నిధి నుండి తీసివేయబడిన సన్నిధి రొట్టెలు తప్ప వేరే లేవు.

  9. ఆ రోజు సౌలు సేవకులలో ఒకడు అక్కడ యెహోవా సన్నిధిలో ఉన్నాడు; అతని పేరు దోయేగు. అతడు ఎదోమీయుడు, అతడు సౌలు యొక్క బలవంతుడైన కాపరి.

  10. దావీదు అహీమెలెకును, “రాజు అప్పగించిన పని తొందరలో నేను నా కత్తిని ఇతర ఆయుధాలను తీసుకురాలేదు, నీ దగ్గర కత్తి గాని ఈటె గాని ఉందా?” అని అడిగాడు.

  11. అందుకు యాజకుడు, “ఏలహు లోయలో నీవు చంపిన గొల్యాతు అనే ఫిలిష్తీయుని కత్తి ఇక్కడ ఉంది. అది ఏఫోదు వెనుక బట్టతో చుట్టి ఉంది. అది తప్ప ఇక్కడ మరి ఏ కత్తి లేదు, నీకు కావాలంటే అది తీసుకో” అన్నాడు. దావీదు, “దానికి సాటియైనది మరొకటి లేదు; అది నాకు ఇవ్వు” అన్నాడు.

  12. దావీదు సౌలుకు భయపడి ఆ రోజే బయలుదేరి పారిపోయి గాతు రాజైన ఆకీషు దగ్గరకు వచ్చాడు.

  13. అప్పుడు సౌలు సేవకుల దగ్గర నిలబడి ఉన్న ఎదోమీయుడైన దోయేగు, “యెష్షయి కుమారుడు నోబులోని అహీటూబు కుమారుడైన అహీమెలెకు దగ్గరకు రావడం నేను చూశాను.

  14. అహీమెలెకు అతని తరపున యెహోవా దగ్గర విచారణ చేసి, ఆహారాన్ని ఫిలిష్తీయుడైన గొల్యాతు కత్తిని అతనికి ఇచ్చాడు” అని చెప్పాడు.

  15. అప్పుడు పన్నెండుమందిలో ఒకడైన ఇస్కరియోతు యూదా, ముఖ్య యాజకుల దగ్గరకు వెళ్లి,

  16. “నేను యేసును మీకు పట్టించడానికి నాకు ఏమి ఇస్తారు?” అని వారిని అడిగాడు. అందుకు వారు ముప్పై వెండి నాణాలు లెక్కపెట్టి వానికి ఇచ్చారు.

  17. వాడు అప్పటినుండి ఆయనను అప్పగించడానికి తగిన అవకాశం కోసం ఎదురుచూశాడు.

  18. అప్పుడు ఆయన తన శిష్యుల దగ్గరకు తిరిగివచ్చి, “మీరు ఇంకా నిద్రిస్తు విశ్రాంతి తీసుకొంటున్నారా? చూడండి, మనుష్యకుమారుడు పాపుల చేతికి అప్పగించబడే సమయం వచ్చేసింది.

  19. వెళ్దాం రండి. నన్ను పట్టించేవాడు వస్తున్నాడు” అని చెప్పారు.

  20. ఆయన ఇంకా మాట్లాడుతుండగా, పన్నెండుగురిలో ఒకడైన, యూదా వచ్చాడు. అతనితో పాటు ముఖ్య యాజకులు ప్రజానాయకులు పంపిన పెద్ద గుంపు కత్తులు కర్రలు పట్టుకుని వచ్చింది.

  21. ఆయనను పట్టించేవాడు వారికి గుర్తులు చెప్పాడు, “నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో; ఆయనను మీరు బంధించాలి”

  22. యూదా వెంటనే యేసు దగ్గరకు వెళ్లి, “బోధకుడా, నీకు శుభం” అని అంటూ ఆయనను ముద్దు పెట్టుకున్నాడు.

  23. అందుకు యేసు, “స్నేహితుడా, ఏమి చేయడానికి వచ్చావో అది చేయి” అన్నారు. అప్పుడు వారు ముందుకు వచ్చి, యేసును పట్టుకొని, ఆయనను బంధించారు.

  24. పన్నెండుమందిలో ఒకడైన ఇస్కరియోతు యూదా, ముఖ్య యాజకుల చేతికి యేసును అప్పగించడానికి వారి దగ్గరకు వెళ్లాడు.

  25. ఇది విని వారు సంతోషించి వానికి డబ్బులు ఇస్తామని వాగ్దానం చేశారు. కాబట్టి వాడు యేసును అప్పగించడానికి తగిన అవకాశం కోసం ఎదురుచూశాడు.