కంటెంట్‌కు వెళ్లండి

Betrayal గురించి బైబిల్ వచనాలు: Of David, by Doeg

12 వచనాలు · 4 కోణాలు

Of David, by Doeg గురించి వచనాలు

  1. దావీదు నోబులో యాజకుడైన అహీమెలెకు దగ్గరకు వచ్చాడు. అయితే అహీమెలెకు దావీదు రావడం చూసి భయపడి, “నీతో ఎవరూ లేకుండా నీవు ఒక్కడివే వచ్చావెందుకు?” అని అతన్ని అడిగాడు.

  2. అందుకు దావీదు యాజకుడైన అహీమెలెకుతో, “రాజు నాకు ఒక పని అప్పగించి, ‘నేను నిన్ను పంపిన పని గురించి ఎవరికి తెలియకూడదు’ అన్నాడు. నేను నా మనుష్యులతో ఒక చోటికి వెళ్లి అక్కడ ఉండమని చెప్పాను.

  3. నీ దగ్గర ఏముంది? అయిదు రొట్టెలు గాని మరేమైనా గాని ఉంటే అవి నాకు ఇవ్వు” అన్నాడు.

  4. ఆ యాజకుడు దావీదుతో, “సాధారణ రొట్టె నా దగ్గర లేదు; నీ మనుష్యులు స్త్రీలకు దూరంగా ఉన్నట్లయితే వారు ఇక్కడ ఉన్న ప్రతిష్ఠిత రొట్టెలు తినవచ్చు” అని చెప్పాడు.

  5. అందుకు దావీదు, “ఖచ్చితంగా నేను బయలుదేరి వచ్చినప్పటి నుండి ఈ మూడు రోజులు స్త్రీలు మాకు దూరంగానే ఉన్నారు. వారి దేహాలు పవిత్రంగానే ఉన్నాయి. సాధారణ పనిమీద వెళ్లినప్పుడే ఈ మనుష్యులు పవిత్రంగా ఉంటే, ఈ రోజు ఇంకెంత పవిత్రంగా ఉంటారు!”

  6. యాజకుడు అతనికి వెచ్చని రొట్టెలు వేసే రోజున తీసివేయబడిన ప్రతిష్ఠితమైన రొట్టెలను ఇచ్చాడు, ఎందుకంటే అక్కడ యెహోవా సన్నిధి నుండి తీసివేయబడిన సన్నిధి రొట్టెలు తప్ప వేరే లేవు.

  7. ఆ రోజు సౌలు సేవకులలో ఒకడు అక్కడ యెహోవా సన్నిధిలో ఉన్నాడు; అతని పేరు దోయేగు. అతడు ఎదోమీయుడు, అతడు సౌలు యొక్క బలవంతుడైన కాపరి.

  8. దావీదు అహీమెలెకును, “రాజు అప్పగించిన పని తొందరలో నేను నా కత్తిని ఇతర ఆయుధాలను తీసుకురాలేదు, నీ దగ్గర కత్తి గాని ఈటె గాని ఉందా?” అని అడిగాడు.

  9. అందుకు యాజకుడు, “ఏలహు లోయలో నీవు చంపిన గొల్యాతు అనే ఫిలిష్తీయుని కత్తి ఇక్కడ ఉంది. అది ఏఫోదు వెనుక బట్టతో చుట్టి ఉంది. అది తప్ప ఇక్కడ మరి ఏ కత్తి లేదు, నీకు కావాలంటే అది తీసుకో” అన్నాడు. దావీదు, “దానికి సాటియైనది మరొకటి లేదు; అది నాకు ఇవ్వు” అన్నాడు.

  10. దావీదు సౌలుకు భయపడి ఆ రోజే బయలుదేరి పారిపోయి గాతు రాజైన ఆకీషు దగ్గరకు వచ్చాడు.

  11. అప్పుడు సౌలు సేవకుల దగ్గర నిలబడి ఉన్న ఎదోమీయుడైన దోయేగు, “యెష్షయి కుమారుడు నోబులోని అహీటూబు కుమారుడైన అహీమెలెకు దగ్గరకు రావడం నేను చూశాను.

  12. అహీమెలెకు అతని తరపున యెహోవా దగ్గర విచారణ చేసి, ఆహారాన్ని ఫిలిష్తీయుడైన గొల్యాతు కత్తిని అతనికి ఇచ్చాడు” అని చెప్పాడు.