కంటెంట్‌కు వెళ్లండి

circa AD 95

The Revelation

John's vision on Patmos unveils the cosmic victory of the Lamb over evil and the final restoration of all creation.

404 వచనాలు · 1 గ్రంథం చేర్చబడింది

  1. ప్రకటన 21:20సుమారు క్రీ.శ. 96

    అయిదవది వైడూర్యం, ఆరవది కెంపు, ఏడవది సువర్ణరత్నం, ఎనిమిదవది గోమేధికం, తొమ్మిదవది పుష్యరాగం, పదవది సువర్ణల శునీయం, పదకొండవది పద్మరాగం, పన్నెండవది కురువింద మణి.

  2. ప్రకటన 21:21సుమారు క్రీ.శ. 96

    పన్నెండు ద్వారాలు పన్నెండు ముత్యాలు, ప్రతి ద్వారం ఒక ముత్యంతో చేయబడింది. ఆ పట్టణపు ప్రధాన వీధి బంగారంతో చేయబడి, గాజులా స్వచ్ఛంగా ఉంది.

  3. ప్రకటన 21:22సుమారు క్రీ.శ. 96

    ఆ పట్టణంలో ఏ దేవాలయం నాకు కనిపించలేదు ఎందుకంటే సర్వశక్తిగల ప్రభువైన దేవుడును గొర్రెపిల్ల ఆ పట్టణానికి దేవాలయంగా ఉన్నారు.

  4. ప్రకటన 21:23సుమారు క్రీ.శ. 96

    ఆ పట్టణంపై సూర్యుడు గాని చంద్రుడు గాని ప్రకాశించాల్సిన అవసరం లేదు ఎందుకంటే దేవుని మహిమ దానికి వెలుగు ఇస్తుంది గొర్రెపిల్ల దానికి దీపము.

  5. ప్రకటన 21:24సుమారు క్రీ.శ. 96

    ప్రజలు దాని వెలుగులో నడుస్తారు, ఇంకా భూ రాజులు తమ వైభవాన్ని దానిలోనికి తెస్తారు.

  6. ప్రకటన 21:25సుమారు క్రీ.శ. 96

    ఏ రోజు దాని ద్వారాలు మూయబడవు ఎందుకంటే అక్కడ రాత్రి ఉండదు.

  7. ప్రకటన 21:26సుమారు క్రీ.శ. 96

    దేశాలు తమ మహిమ వైభవాన్ని దానిలోనికి తెస్తాయి.

  8. ప్రకటన 21:27సుమారు క్రీ.శ. 96

    గొర్రెపిల్ల జీవగ్రంథంలో పేర్లు వ్రాయబడినవారు మాత్రమే ఆ పట్టణంలోనికి ప్రవేశిస్తారు. అపవిత్రమైనవి అసహ్యకరమైనవి మోసకరమైనవి చేసేవారెవరు దానిలోనికి ఎన్నడూ ప్రవేశించరు.

  9. ప్రకటన 22:1సుమారు క్రీ.శ. 96

    అప్పుడు ఆ దేవదూత గొర్రెపిల్ల దేవుని సింహాసనం నుండి ప్రవహిస్తున్న స్వచ్ఛమైన స్ఫటికం లాంటి జీవజలనది నాకు చూపించాడు.

  10. ప్రకటన 22:2సుమారు క్రీ.శ. 96

    ఆ నది ఆ పట్టణపు ప్రధాన వీధి మధ్యన ప్రవహిస్తుంది. ఆ నదికి ఇరువైపుల జీవవృక్షం ఉంది. అది ప్రతి నెల ఫలాన్ని ఇస్తూ పన్నెండు పంటలను ఇస్తుంది. ఇంకా ఆ చెట్టు ఆకులు జనాల స్వస్థత కోసం ఉన్నాయి.

  11. ప్రకటన 22:3సుమారు క్రీ.శ. 96

    అక్కడ ఏ శాపం ఉండదు. దేవుని గొర్రెపిల్ల యొక్క సింహాసనం ఆ పట్టణంలో ఉంటాయి. ఆయన సేవకులు ఆయనను సేవిస్తుంటారు.

  12. ప్రకటన 22:4సుమారు క్రీ.శ. 96

    వారు ఆయన ముఖాన్ని చూస్తారు, వారి నుదుటి మీద ఆయన పేరు ఉంటుంది.

  13. ప్రకటన 22:5సుమారు క్రీ.శ. 96

    అక్కడ రాత్రి ఉండదు. ప్రభువైన దేవుడే వారికి కాంతిని ఇస్తారు కాబట్టి వారికి దీపకాంతి గాని సూర్యకాంతి గాని అవసరం లేదు. వారు ఎల్లకాలం పరిపాలిస్తూ ఉంటారు.

  14. ప్రకటన 22:6సుమారు క్రీ.శ. 96

    అప్పుడు ఆ దేవదూత నాతో, “ఈ మాటలు నమ్మదగినవి సత్యమైనవి. ప్రవక్తల ఆత్మలను ప్రేరేపించే ప్రభువైన దేవుడు తన సేవకులకు త్వరలో జరుగబోయే సంగతులను చూపించడానికి తన దూతను పంపారు” అని చెప్పాడు.

  15. ప్రకటన 22:7సుమారు క్రీ.శ. 96

    “ఇదిగో, నేను త్వరగా వస్తున్నాను! ఈ గ్రంథపుచుట్టలో ప్రవచించిన మాటలను పాటించేవారు ధన్యులు!”

  16. ప్రకటన 22:8సుమారు క్రీ.శ. 96

    యోహాను అనే నేను ఈ సంగతులను విని చూశాను. నేను వాటిని విని చూసినప్పుడు, నాకు వాటిని చూపిస్తున్న దేవదూతను ఆరాధించడానికి అతని పాదాల ముందు సాష్టాంగపడ్డాను.

  17. ప్రకటన 22:9సుమారు క్రీ.శ. 96

    కాని అతడు నాతో, “నీవు అలా చేయవద్దు! ఈ గ్రంథపుచుట్టలో వ్రాయబడిన మాటలను పాటించేవారిలా, నీ తోటి ప్రవక్తల్లా నేను కూడా నీ తోటి సేవకుడనే. కాబట్టి దేవున్నే ఆరాధించు!” అని చెప్పాడు.

  18. ప్రకటన 22:10సుమారు క్రీ.శ. 96

    తర్వాత అతడు నాతో, “ఈ గ్రంథపుచుట్టలో వ్రాయబడిన ప్రవచనాలను ముద్ర వేయకు ఎందుకంటే సమయం సమీపంగా ఉంది.

  19. ప్రకటన 22:11సుమారు క్రీ.శ. 96

    అన్యాయం చేసేవారిని అన్యాయం చేయనివ్వు, దుష్టుడిని దుష్టునిలా కొనసాగనివ్వు, నీతి క్రియలు చేసేవారిని నీతి క్రియలను చేస్తూ ఉండనివ్వు, పరిశుద్ధులను పరిశుద్ధులుగా కొనసాగనివ్వు” అని చెప్పాడు.

  20. ప్రకటన 22:12సుమారు క్రీ.శ. 96

    “ఇదిగో! నేను త్వరగా వస్తున్నాను! ప్రతివారికి వారు చేసిన పనుల చొప్పున వారికి ఇవ్వడానికి నా ప్రతిఫలం నా దగ్గర ఉంది.

  21. ప్రకటన 22:13సుమారు క్రీ.శ. 96

    అల్ఫా ఒమేగాను నేనే, మొదటివాడను చివరివాడను నేనే, ఆది అంతం నేనే!

  22. ప్రకటన 22:14సుమారు క్రీ.శ. 96

    “జీవ వృక్షానికి హక్కు పొంది, ద్వారాల గుండా పట్టణంలోనికి ప్రవేశించేలా తమ వస్త్రాలను ఉతుక్కున్నవారు ధన్యులు.

  23. ప్రకటన 22:15సుమారు క్రీ.శ. 96

    అయితే మాంత్రికులు, వ్యభిచారులు, హంతకులు, విగ్రహాలను పూజించే వారు, అబద్ధాలు చెప్తూ వాటిని ప్రేమించే వారందరు ఆ పట్టణానికి బయట ఉండే కుక్కలు.

  24. ప్రకటన 22:16సుమారు క్రీ.శ. 96

    “యేసు అనే నేను సంఘాల కోసమైన ఈ సాక్ష్యం మీకు ఇవ్వమని నా దూతను పంపాను. నేను దావీదు వేరును సంతానాన్ని, ప్రకాశవంతమైన వేకువ చుక్కను.”

  25. ప్రకటన 22:17సుమారు క్రీ.శ. 96

    “రండి!” అని ఆత్మ, పెండ్లికుమార్తె అంటున్నారు. ఈ మాటలు వింటున్నవారు, “రండి!” అని చెప్పాలి. దప్పికగల వారందరు రండి; ఆశపడినవారు జీవజలాన్ని ఉచితంగా పొందుకోండి.