- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 1010–970 BC
The Reign of David
David unites the tribes, conquers Jerusalem, and establishes Israel's golden age—even through deep personal failure.
ఈ కాలపు వచనాలు
- 1 దినవృత్తాంతములు 26:13సుమారు క్రీ.పూ. 1015
చిన్నవారికి పెద్దవారికి ఒకే విధంగా తమ కుటుంబాల ప్రకారం, ప్రతి ఒక్క ద్వారం దగ్గర కావలివారిగా ఉండడానికి చీట్లు వేశారు.
- 1 దినవృత్తాంతములు 26:14సుమారు క్రీ.పూ. 1015
తూర్పు వైపు ద్వారం షెలెమ్యాకు వచ్చింది. తర్వాత తెలివిగల సలహాదారుడైన అతని కుమారుడైన జెకర్యాకు కూడా చీటి వేయగా అతనికి ఉత్తరం వైపు ద్వారం వచ్చింది.
- 1 దినవృత్తాంతములు 26:15సుమారు క్రీ.పూ. 1015
ఓబేద్-ఎదోముకు దక్షిణం వైపు ద్వారం వచ్చింది, గిడ్డంగుల కాపలా అతని కుమారులకు వచ్చింది.
- 1 దినవృత్తాంతములు 26:16సుమారు క్రీ.పూ. 1015
పడమటి వైపు ద్వారం, ఎత్తైన రహదారిలో ఉన్న షల్లెకెతు ద్వారం కాపలా షుప్పీముకు, హోసాకు వచ్చింది.
- 1 దినవృత్తాంతములు 26:17సుమారు క్రీ.పూ. 1015
ప్రతిరోజు తూర్పున ఆరుగురు లేవీయులు, ఉత్తరాన నలుగురు, దక్షిణాన నలుగురు, గిడ్డంగి దగ్గర ఇద్దరిద్దరు ఉన్నారు.
- 1 దినవృత్తాంతములు 26:18సుమారు క్రీ.పూ. 1015
పడమటి ఆవరణం విషయానికి వస్తే, దగ్గర ఉన్న రాజమార్గం దగ్గర నలుగురు, ఆవరణం దగ్గర ఇద్దరు ఉన్నారు.
- 1 దినవృత్తాంతములు 26:19సుమారు క్రీ.పూ. 1015
కోరహు, మెరారి వారసులైన ద్వారపాలకుల విభాగాలు ఇవి.
- 1 దినవృత్తాంతములు 26:20సుమారు క్రీ.పూ. 1015
అహీయా నాయకత్వంలో నడిపించబడిన ఇతర లేవీయులు, దేవుని మందిరంలోని ఖజానాలకు యెహోవాకు సమర్పించబడిన కానుకల ఖజానాలకు బాధ్యత వహించారు.
- 1 దినవృత్తాంతములు 26:21సుమారు క్రీ.పూ. 1015
గెర్షోనీయుడైన లద్దానుకు చెందిన కుటుంబాల పెద్దలైన గెర్షోనీయుడైన లద్దాను వారసులు యెహీయేలీ,
- 1 దినవృత్తాంతములు 26:22సుమారు క్రీ.పూ. 1015
యెహీయేలీ కుమారులు, జేతాము అతని సోదరుడైన యోవేలు. వీరికి యెహోవా ఆలయ ఖజానాల బాధ్యత అప్పగించబడింది.
- 1 దినవృత్తాంతములు 26:23సుమారు క్రీ.పూ. 1015
అమ్రామీయులు, ఇస్హారీయులు, హెబ్రోనీయులు, ఉజ్జీయేలీయులు అనేవారి నుండి:
- 1 దినవృత్తాంతములు 26:24సుమారు క్రీ.పూ. 1015
మోషే కుమారుడైన గెర్షోము వారసుడు షెబూయేలు ఖజానా మీద ప్రధానిగా నియమించబడ్డాడు.
- 1 దినవృత్తాంతములు 26:25సుమారు క్రీ.పూ. 1015
ఎలీయెజెరు ద్వారా అతని బంధువులు: ఎలీయెజెరు కుమారుడైన రెహబ్యా, అతని కుమారుడైన యెషయా, అతని కుమారుడైన యోరాము, అతని కుమారుడైన జిఖ్రీ, అతని కుమారుడైన షెలోమీతు.
- 1 దినవృత్తాంతములు 26:26సుమారు క్రీ.పూ. 1015
(రాజైన దావీదు, సహస్రాధిపతులు, శతాధిపతులు యైన కుటుంబ పెద్దలు ఇతర సైన్యాధిపతులు ప్రతిష్ఠించిన వస్తువులున్న ఖజానాలన్నిటి బాధ్యత షెలోమీతుకు, అతని బంధువులకు అప్పగించబడింది.
- 1 దినవృత్తాంతములు 26:27సుమారు క్రీ.పూ. 1015
వారు యుద్ధంలో స్వాధీనం చేసుకున్న సొమ్ములో కొంత భాగాన్ని యెహోవా ఆలయ మరమత్తు కోసం ప్రతిష్ఠించారు.
- 1 దినవృత్తాంతములు 26:28సుమారు క్రీ.పూ. 1015
దీర్ఘదర్శి సమూయేలు, కీషు కుమారుడైన సౌలు, నేరు కుమారుడైన అబ్నేరు, సెరూయా కుమారుడైన యోవాబు ప్రతిష్ఠించినవన్నీ, ఇతర ప్రతిష్ఠితమైన వస్తువులన్నీ షెలోమీతు అతని బంధువుల సంరక్షణలో ఉన్నాయి.)
- 1 దినవృత్తాంతములు 26:29సుమారు క్రీ.పూ. 1015
ఇస్హారీయుల నుండి: కెనన్యా అతని కుమారులు మందిరపు బయటి పనులు చేయడానికి ఇశ్రాయేలీయులకు అధికారులుగా, న్యాయాధిపతులుగా నియమించబడ్డారు.
- 1 దినవృత్తాంతములు 26:30సుమారు క్రీ.పూ. 1015
హెబ్రోనీయుల నుండి: హషబ్యా, అతని బంధువులు పదిహేడు వందల మంది సమర్థులైన వారికి యొర్దాను నదికి పడమర వైపున ఉన్న ఇశ్రాయేలు ప్రాంతంలో యెహోవాకు చేసే మొత్తం సేవ రాజుకు చేసే సేవ బాధ్యత అప్పగించబడింది.
- 1 దినవృత్తాంతములు 26:31సుమారు క్రీ.పూ. 1015
హెబ్రోనీయులలో వారి కుటుంబ వంశావళుల ప్రకారం, యెరీయా వారికి ప్రధాన నాయకుడు. (దావీదు పరిపాలనలోని నలభైయవ సంవత్సరంలో వంశావళులను పరిశీలించినప్పుడు, గిలాదులోని యాజెరులో ఉన్న హెబ్రోనీయులలో పరాక్రమశాలులు ఉన్నారని తెలిసింది.
- 1 దినవృత్తాంతములు 26:32సుమారు క్రీ.పూ. 1015
కుటుంబ పెద్దలుగా ఉన్న సమర్థులైన యెరీయా బంధువులు రెండువేల ఏడువందలమంది. రాజైన దావీదు వారిని దేవుని విషయాలన్నిటిలో, రాజ వ్యవహారాలలో రూబేనీయులమీద, గాదీయులమీద, మనష్షే అర్థగోత్రం వారిమీద నియమించాడు.)
- 1 దినవృత్తాంతములు 27:1సుమారు క్రీ.పూ. 1015
ఇది ఇశ్రాయేలీయుల కుటుంబ నాయకులు, సహస్రాధిపతులు, శతాధిపతులు, వివిధ విషయాల్లో రాజుకు సేవలందించే అధికారుల జాబితా. వీరిలో ప్రతి విభాగం సంవత్సరంలో ఒక నెల చొప్పున సేవ చేస్తారు. ఒక్కొక్క విభాగంలో 24,000 మంది సైనికులు ఉన్నారు.
- 1 దినవృత్తాంతములు 27:2సుమారు క్రీ.పూ. 1015
మొదటి నెలలో మొదటి విభాగం మీద జబ్దీయేలు కుమారుడైన యషోబీము అధిపతిగా ఉన్నాడు. అతని విభాగంలో 24,000 మంది సైనికులు ఉన్నారు.
- 1 దినవృత్తాంతములు 27:3సుమారు క్రీ.పూ. 1015
అతడు పెరెసు వారసుడు, మొదటి నెల సైన్యాధిపతులందరికీ అధిపతిగా ఉన్నాడు.
- 1 దినవృత్తాంతములు 27:4సుమారు క్రీ.పూ. 1015
రెండవ నెల విభాగం మీద అహోహీయుడైన దోదైది అధిపతిగా ఉన్నాడు; అతని విభాగానికి నాయకుడు మిక్లోతు. అతని విభాగంలో 24,000 మంది సైనికులు ఉన్నారు.
- 1 దినవృత్తాంతములు 27:5సుమారు క్రీ.పూ. 1015
మూడవ నెలకు యాజకుడైన యెహోయాదా కుమారుడైన బెనాయా మూడవ సైన్యాధిపతిగా ఉన్నాడు. అతని విభాగంలో 24,000 మంది సైనికులు ఉన్నారు.