కంటెంట్‌కు వెళ్లండి

circa 930–586 BC

The Divided Kingdom

The kingdom splits into Israel and Judah; prophets warn of judgment as both nations slowly drift into idolatry and exile.

1,722 వచనాలు · 3 గ్రంథాలు చేర్చబడ్డాయి

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. అతడు ఆహాజు మేడమీది పైకప్పు మీద యూదా రాజులు కట్టించిన బలిపీఠాన్ని, యెహోవా మందిరం యొక్క రెండు ఆవరణాల్లో మనష్షే కట్టించిన బలిపీఠాన్ని పడగొట్టాడు. వాటిని అక్కడినుండి తీసివేసి, ముక్కలు ముక్కలుగా చేసి, ఆ ముక్కలను కిద్రోను లోయలో పారవేశాడు.

  2. గతంలో ఇశ్రాయేలు రాజైన సొలొమోను యెరూషలేముకు ఎదురుగా ఉన్న అవినీతి పర్వతానికి దక్షిణం వైపు సీదోనీయుల హేయ దేవత అష్తారోతుకు, మోయాబీయుల హేయ దేవుడైన కెమోషుకు, అమ్మోనీయుల హేయ దేవుడైన మిల్కోముకు కట్టించిన క్షేత్రాలను అపవిత్రం చేశాడు.

  3. యోషీయా పవిత్ర రాళ్లను పగులగొట్టి, అషేరా స్తంభాలను పడగొట్టాడు, ఆ స్థలాలను మనుష్యుల ఎముకలతో నింపాడు.

  4. బేతేలులో ఉన్న బలిపీఠాన్ని, ఇశ్రాయేలీయులు పాపం చేయడానికి కారణమైన నెబాతు కుమారుడైన యరొబాము కట్టిన పూజా స్థలాన్ని కూడా అతడు పడగొట్టాడు. ఆ క్షేత్రాన్ని కాల్చివేసి పొడి చేశాడు, అషేరా స్తంభాన్ని కూడా కాల్చివేశాడు.

  5. అప్పుడు యోషీయా చూడగా ఆ కొండమీద, అతనికి ఆ కొండమీద సమాధులు కనిపించినప్పుడు, అతనికి ఆ సమాధుల్లో నుండి ఎముకలను తీయించి, బలిపీఠాన్ని అపవిత్ర పరచడానికి వాటిని దాని మీద కాల్చివేశాడు. గతంలో దైవజనుడు చాటించిన యెహోవా వాక్కు ప్రకారం ఇది జరిగింది.

  6. రాజు, “నాకు కనిపిస్తున్న ఆ సమాధి రాయి ఏంటి?” అని అడిగాడు. అందుకు ఆ పట్టణస్థులు చెప్పారు, “అది యూదా నుండి వచ్చిన దైవజనుని సమాధి. మీరు బేతేలులో ఉన్న బలిపీఠానికి చేసిన దాని గురించి ప్రకటించింది అతడే” అని చెప్పారు.

  7. యోషీయా, “అది అలాగే ఉంచండి. ఆయన ఎముకలను తీయనీయకండి” అని చెప్పగా వారు అతని ఎముకలను సమరయ నుండి వచ్చిన ప్రవక్త ఎముకలతో పాటు అలానే ఉండనిచ్చారు.

  8. అతడు బేతేలులో ఎలా చేశాడో అలాగే, ఇశ్రాయేలు రాజులు సమరయ పట్టణాల్లో కట్టి యెహోవాకు కోపం రేపిన ఎత్తైన స్థలాల్లో ఉన్న క్షేత్రాలన్నిటినీ యోషీయా తీసివేశాడు.

  9. యోషీయా ఆ క్షేత్రాల పూజారులందరినీ బలిపీఠాల మీద వధించాడు, మనుష్యుల ఎముకలను వాటి మీద కాల్చివేశాడు. తర్వాత అతడు యెరూషలేముకు తిరిగి వెళ్లాడు.

  10. రాజు ప్రజలందరికి, “నిబంధన గ్రంథంలో వ్రాయబడినట్టు, మీరు మీ దేవుడైన యెహోవాకు పస్కా పండుగను ఆచరించండి” అని ఆజ్ఞ ఇచ్చాడు.

  11. అలాంటి పస్కా పండుగ ఇశ్రాయేలు ప్రజలను న్యాయం తీర్చిన న్యాయాధిపతుల కాలం నుండి ఇశ్రాయేలు రాజులు, యూదా రాజులు పరిపాలించిన కాలం వరకు ఎన్నడూ ఆచరించలేదు.

  12. అయితే యోషీయా రాజు పరిపాలనలోని పద్దెనిమిదవ సంవత్సరంలో యెరూషలేములో ఈ పస్కా పండుగ యెహోవాకు జరిగింది.

  13. అంతేకాక యోషీయా కర్ణపిశాచులను, ఆత్మలతో మాట్లాడేవారిని, గృహదేవతలు, విగ్రహాలు, యూదాలో యెరూషలేములో కనిపించే ఇతర అసహ్యకరమైన వస్తువులన్నిటిని తీసివేసి యాజకుడైన హిల్కీయాకు యెహోవా మందిరంలో దొరికిన గ్రంథంలో వ్రాయబడిన ధర్మశాస్త్ర విధులను నెరవేర్చడానికి అతడు ఇలా చేశాడు.

  14. 2 రాజులు 23:25సుమారు క్రీ.పూ. 641

    అతడు పూర్ణహృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణబలంతో యెహోవా వైపు తిరిగి మోషే ధర్మశాస్త్రం ప్రకారం ప్రవర్తించాడు. అతనికంటే ముందు కాని అతని తర్వాత కాని, అతనిలాంటి రాజు ఎవరూ లేరు.

  15. 2 రాజులు 23:26సుమారు క్రీ.పూ. 641

    అయినా యెహోవాకు యూదా మీద ఉన్న మహా కోపం తగ్గలేదు, ఎందుకంటే మనష్షే చేసినదంతటిని బట్టి ఆయన కోపం రగులుకుంది.

  16. 2 రాజులు 23:27సుమారు క్రీ.పూ. 641

    కాబట్టి యెహోవా అన్నారు, “నేను ఇశ్రాయేలు ప్రజలను చేసినట్టు యూదా ప్రజలను కూడా నా సముఖంలో లేకుండా చేస్తాను. నేను ఎన్నుకున్న యెరూషలేము పట్టణాన్ని, ‘నా పేరు అక్కడ ఉంటుంది’ అని చెప్పిన మందిరాన్ని విసర్జిస్తాను” అన్నారు.

  17. 2 రాజులు 23:28సుమారు క్రీ.పూ. 641

    యోషీయా పరిపాలనకు సంబంధించిన ఇతర విషయాలు, అతడు చేసినవన్నీ, యూదా రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడలేదా?

  18. 2 రాజులు 23:29సుమారు క్రీ.పూ. 610

    యోషీయా రాజుగా ఉన్నప్పుడు, ఈజిప్టు రాజైన ఫరో నెకో యూఫ్రటీసు నది దగ్గర అష్షూరు రాజుకు యుద్ధంలో సహాయపడడానికి వెళ్లాడు. రాజైన యోషీయా అతన్ని ఎదుర్కోబోయాడు, అయితే నెకో అతన్ని మెగిద్దో దగ్గర చంపాడు.

  19. 2 రాజులు 23:30సుమారు క్రీ.పూ. 610

    యెషీయా సేవకులు అతని మృతదేహాన్ని మెగిద్దో నుండి యెరూషలేముకు రథంలో తీసుకువచ్చి అతని సమాధిలో పాతిపెట్టారు. దేశ ప్రజలు యోషీయా కుమారుడైన యెహోయాహాజును అభిషేకించి, అతని తండ్రి స్థానంలో అతన్ని రాజుగా చేశారు.

  20. 2 రాజులు 23:31సుమారు క్రీ.పూ. 610

    యెహోయాహాజు రాజైనప్పుడు అతని వయస్సు ఇరవై మూడు సంవత్సరాలు, అతడు యెరూషలేములో మూడు నెలలు పరిపాలించాడు. అతని తల్లి యిర్మీయా కుమార్తెయైన హమూటలు, ఆమె లిబ్నా పట్టణస్థురాలు.

  21. 2 రాజులు 23:32సుమారు క్రీ.పూ. 610

    అతడు తన పూర్వికులు చేసినట్టే యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించాడు.

  22. 2 రాజులు 23:33సుమారు క్రీ.పూ. 610

    అతడు యెరూషలేములో పరిపాలించకుండా ఫరో నెకో అతన్ని హమాతు ప్రదేశంలో ఉన్న రిబ్లాలో ఖైదీగా చేశాడు, యూదా మీద వంద తలాంతుల వెండిని, ఒక తలాంతు బంగారాన్ని పన్నుగా విధించాడు.

  23. 2 రాజులు 23:34సుమారు క్రీ.పూ. 610

    ఫరో నెకో యోషీయా కుమారుడైన ఎల్యాకీమును యోషీయా స్థానంలో రాజుగా చేసి, అతని పేరును యెహోయాకీముగా మార్చాడు. అయితే యెహోయాహాజును ఈజిప్టుకు తీసుకెళ్లాడు, అతడు అక్కడ చనిపోయాడు.

  24. 2 రాజులు 23:35సుమారు క్రీ.పూ. 610

    ఫరో నెకో నిర్ణయించిన ఆ వెండి బంగారాలు యెహోయాకీము అతనికి ఇచ్చాడు. అలా చేయడానికి దేశం మీద పన్ను నిర్ణయించి దేశ ప్రజల నుండి వెండి బంగారాలు వసూలు చేయించాడు.

  25. 2 రాజులు 23:36సుమారు క్రీ.పూ. 610

    యెహోయాకీము రాజైనప్పుడు, అతని వయస్సు ఇరవై అయిదు సంవత్సరాలు, అతడు యెరూషలేములో పదకొండు సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి, పెదాయా కుమార్తెయైన జెబూదా, ఆమె రూమా పట్టణస్థురాలు.