- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 930–586 BC
The Divided Kingdom
The kingdom splits into Israel and Judah; prophets warn of judgment as both nations slowly drift into idolatry and exile.
ఈ కాలపు వచనాలు
- 2 రాజులు 21:8సుమారు క్రీ.పూ. 698
నేను వారికి నా సేవకుడైన మోషే ద్వారా ఇచ్చిన ధర్మశాస్త్రమంతటిని ఆచరిస్తూ నేను వారికి ఆజ్ఞాపించినదంతా జాగ్రత్తగా వారు పాటిస్తే, వారి పూర్వికులకు ఇచ్చిన దేశంలో నుండి నేను ఇశ్రాయేలీయుల పాదాలను తిరిగి వెళ్లనివ్వను” అని చెప్పారు.
- 2 రాజులు 21:9సుమారు క్రీ.పూ. 698
అయితే ప్రజలు మాట వినలేదు. మనష్షే వారిని తప్పుదారి పట్టించాడు, కాబట్టి ఇశ్రాయేలీయుల ఎదుట ఉండకుండ యెహోవా నాశనం చేసిన దేశాల కంటే ఎక్కువ చెడు చేశారు.
- 2 రాజులు 21:10సుమారు క్రీ.పూ. 698
యెహోవా తన సేవకులైన ప్రవక్తల ద్వారా ఇలా మాట్లాడారు:
- 2 రాజులు 21:11సుమారు క్రీ.పూ. 698
“యూదా రాజైన మనష్షే ఈ అసహ్యకరమైన పాపాలు చేశాడు. అతనికంటే ముందు ఉన్న అమోరీయుల కంటే మించి చెడు చేశాడు, అతడు విగ్రహాలతో యూదాను తప్పుదారి పట్టించాడు.
- 2 రాజులు 21:12సుమారు క్రీ.పూ. 698
కాబట్టి ఇశ్రాయేలు ప్రజల దేవుడైన యెహోవా చెప్పే మాట ఇదే: నేను యెరూషలేము మీదికి, యూదా మీదికి విపత్తు రప్పిస్తాను. ఆ విపత్తును గురించి విన్న వారందరి చెవులు గింగురుమంటాయి.
- 2 రాజులు 21:13సుమారు క్రీ.పూ. 698
నేను సమరయకు వ్యతిరేకంగా ఉపయోగించిన కొలమానాన్ని, అహాబు ఇంటిపై ఉపయోగించిన మట్టపు గుండును యెరూషలేము మీద వ్రేలాడదీస్తాను. ఒకడు గిన్నె తుడిచి బోర్లించినట్టు నేను యెరూషలేమును తుడిచివేస్తాను.
- 2 రాజులు 21:14సుమారు క్రీ.పూ. 698
వారసత్వంగా ఉన్న నా ప్రజల్లో మిగిలిన వారి చేయి విడిచి, వారిని శత్రువుల చేతికి అప్పగిస్తాను. వారు తమ శత్రువులందరిచేత దోచుకోబడతారు;
- 2 రాజులు 21:15సుమారు క్రీ.పూ. 698
వారి పూర్వికులు ఈజిప్టు నుండి వచ్చిన రోజు నుండి ఈ ఒక రోజు వరకు నా దృష్టిలో చెడుగా ప్రవర్తిస్తూ నాకు కోపం రేపారు.”
- 2 రాజులు 21:16సుమారు క్రీ.పూ. 698
యూదా వారు యెహోవా దృష్టిలో తప్పుగా ప్రవర్తించేటట్టు మనష్షే వారిని తప్పుదారి పట్టించడమే గాక, చాలామంది నిరపరాధుల రక్తాన్ని, యెరూషలేము ఆ చివర నుండి ఈ చివర వరకు చిందించాడు.
- 2 రాజులు 21:17సుమారు క్రీ.పూ. 698
మనష్షే పరిపాలనకు సంబంధించిన ఇతర విషయాలు, అతడు చేసిన పాపం గురించి యూదా రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడలేదా?
- 2 రాజులు 21:18సుమారు క్రీ.పూ. 643
మనష్షే చనిపోయి తన పూర్వికుల దగ్గరకు చేరాడు. ఉజ్జా తోటలో అతని రాజభవన తోటలో అతన్ని సమాధి చేశారు. అతని తర్వాత అతని కుమారుడైన ఆమోను రాజయ్యాడు.
- 2 రాజులు 21:19సుమారు క్రీ.పూ. 643
ఆమోను రాజైనప్పుడు అతని వయస్సు ఇరవై రెండు సంవత్సరాలు, అతడు యెరూషలేములో రెండేళ్ళు పరిపాలించాడు. అతని తల్లి హారూసు కుమార్తెయైన మెషుల్లెమెతు; ఆమె యోత్బా పట్టణానికి చెందినది.
- 2 రాజులు 21:20సుమారు క్రీ.పూ. 643
అతడు తన తండ్రి మనష్షేలా యెహోవా దృష్టిలో చెడుగా ప్రవర్తించాడు.
- 2 రాజులు 21:21సుమారు క్రీ.పూ. 643
అతడు తన తండ్రి జీవిత విధానాన్ని పూర్తిగా అనుసరిస్తూ, తన తండ్రి కొలిచిన విగ్రహాలను కొలిచి పూజించేవాడు.
- 2 రాజులు 21:22సుమారు క్రీ.పూ. 643
అతడు తన పూర్వికుల దేవుడైన యెహోవాను విడిచిపెట్టాడు, ఆయన మార్గాలను అనుసరించలేదు.
- 2 రాజులు 21:23సుమారు క్రీ.పూ. 641
ఆమోను సేవకులు అతని మీద కుట్రపన్ని, అతని సొంత భవనంలోనే రాజును చంపారు.
- 2 రాజులు 21:24సుమారు క్రీ.పూ. 641
అప్పుడు యూదా దేశ ప్రజలు ఆమోను రాజు మీద కుట్రపన్నిన వారినందరిని చంపేశారు. అతని స్థానంలో అతని కుమారుడైన యోషీయాను రాజుగా చేశారు.
- 2 రాజులు 21:25సుమారు క్రీ.పూ. 641
ఆమోనును పరిపాలన గురించిన ఇతర విషయాలు అతడు చేసినవి యూదా రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడ్డాయి.
- 2 రాజులు 21:26సుమారు క్రీ.పూ. 641
వారు అతన్ని ఉజ్జా తోటలో సమాధి చేశారు. అతని తర్వాత అతని కుమారుడైన యోషీయా రాజయ్యాడు.
- 2 రాజులు 22:1సుమారు క్రీ.పూ. 641
యోషీయా రాజైనప్పుడు అతని వయస్సు ఎనిమిది సంవత్సరాలు. అతడు యెరూషలేములో ముప్పై ఒక సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి అదాయా కుమార్తెయైన యెదీదా; ఆమె బొస్కతు గ్రామస్థురాలు.
- 2 రాజులు 22:2సుమారు క్రీ.పూ. 641
అతడు యెహోవా దృష్టిలో సరియైనది చేశాడు. అతడు తన పితరుడైన దావీదు జీవిత విధానాన్ని పూర్తిగా అనుసరించాడు, దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగిపోలేదు.
- 2 రాజులు 22:3సుమారు క్రీ.పూ. 642
అతని పరిపాలనలోని పద్దెనిమిదవ సంవత్సరంలో రాజైన యోషీయా మెషుల్లాము మనుమడును అజల్యా కుమారుడును, కార్యదర్శియునైన షాఫానును యెహోవా మందిరాన్ని బాగుచేయించడానికి పంపాడు. అతడు ఇలా చెప్పాడు:
- 2 రాజులు 22:4సుమారు క్రీ.పూ. 642
“నీవు ప్రధాన యాజకుడైన హిల్కీయా దగ్గరకు వెళ్లి, యెహోవా ఆలయానికి వచ్చే ప్రజల నుండి ద్వారపాలకులు వసూలు చేసిన డబ్బు మొత్తం సిద్ధంగా ఉంచమని అతనితో చెప్పు.
- 2 రాజులు 22:5సుమారు క్రీ.పూ. 642
వారు ఆ డబ్బును యెహోవా మందిర పనులు చేయించడానికి నియమించబడిన మనుష్యులకు ఇవ్వాలి. వారు ఆ డబ్బును మరమ్మత్తు పని చేసేవారికి అనగా వడ్రంగి వారికి, కట్టేవారికి, తాపీ మేస్త్రీలకు ఇవ్వాలి. వారు ఆలయ మరమ్మత్తు కోసం కలపమ్రాను, చెక్కిన రాళ్లు కొనడానికి ఆ డబ్బును వాడాలి.
- 2 రాజులు 22:6సుమారు క్రీ.పూ. 642
Unto carpenters, and builders, and masons, and to buy timber and hewn stone to repair the house.