- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
circa 930–586 BC
The Divided Kingdom
The kingdom splits into Israel and Judah; prophets warn of judgment as both nations slowly drift into idolatry and exile.
ఈ కాలపు వచనాలు
- 2 రాజులు 20:4సుమారు క్రీ.పూ. 713
యెషయా మధ్య ప్రాంగణం విడిచి వెళ్లకముందే యెహోవా వాక్కు అతనికి వచ్చింది:
- 2 రాజులు 20:5సుమారు క్రీ.పూ. 713
“నీవు వెనుకకు తిరిగివెళ్లి నా ప్రజల అధిపతియైన హిజ్కియాకు ఇలా చెప్పు, ‘నీ పూర్వికుడైన దావీదు దేవుడైన యెహోవా చెప్పే మాట ఇదే: నేను నీ ప్రార్థన విని నీ కన్నీరు చూశాను; నేను నిన్ను స్వస్థపరుస్తాను. మూడవ రోజున నీవు యెహోవా ఆలయానికి వెళ్తావు.
- 2 రాజులు 20:6సుమారు క్రీ.పూ. 713
నీ జీవితంలో ఇంకా పదిహేను సంవత్సరాల ఆయుష్షు పెంచుతాను. అంతేకాక, నిన్ను, ఈ పట్టణాన్ని, అష్షూరు రాజు చేతి నుండి రక్షిస్తాను. నా కోసం, నా సేవకుడైన దావీదు కోసం నేను ఈ పట్టణాన్ని కాపాడతాను.’ ”
- 2 రాజులు 20:7సుమారు క్రీ.పూ. 713
తర్వాత యెషయా, “అంజూర పండ్ల ముద్ద తయారుచేయండి” అని చెప్పగా వారు దానిని తెచ్చి ఆ పుండుకు రాసారు. హిజ్కియా కోలుకున్నాడు.
- 2 రాజులు 20:8సుమారు క్రీ.పూ. 713
హిజ్కియా యెషయాను, “యెహోవా నన్ను బాగు చేస్తారని, మూడవ రోజు నేను యెహోవా ఆలయానికి వెళ్తాను అనడానికి గుర్తు ఏంటి?” అని అడిగాడు.
- 2 రాజులు 20:9సుమారు క్రీ.పూ. 713
అందుకు యెషయా, “యెహోవా చెప్పిన మాట నెరవేరుస్తారని ఆయన నీకు ఇచ్చిన సూచన ఇదే: గడియారం మీద నీడ పది అంకెలు ఇప్పుడు ముందుకు వెళ్లాలా లేదా వెనుకకు వెళ్లాలా?” అన్నాడు.
- 2 రాజులు 20:10సుమారు క్రీ.పూ. 713
హిజ్కియా, “నీడ పది అంకెలు ముందుకు వెళ్లడం సులభమే. కాబట్టి నీడ పది అంకెలు వెనుకకు వెళ్లునట్లు చేయండి” అన్నాడు.
- 2 రాజులు 20:11సుమారు క్రీ.పూ. 713
అప్పుడు యెషయా ప్రవక్త యెహోవాకు ప్రార్ధించాడు. ఆహాజు చేయించిన గడియారపు పలక మీద నీడ పది అంకెలు వెనుకకు పోయేటట్టు యెహోవా చేశారు.
- 2 రాజులు 20:12సుమారు క్రీ.పూ. 712
ఆ కాలంలో బలదాను కుమారుడును బబులోనుకు రాజును అయిన మర్దూక్-బలదాను హిజ్కియాకు జబ్బుచేసిందని విని ఉత్తరాలు, కానుక అతనికి పంపాడు.
- 2 రాజులు 20:13సుమారు క్రీ.పూ. 712
హిజ్కియా రాయబారులను ఆహ్వానించి, వారికి తన భవనంలో ఉన్న ఖజానాలోని వెండి, బంగారం, సుగంధద్రవ్యాలు, ఒలీవనూనెతో సహా ఆయుధాలు, ధనాగారాలలో ఉన్నవన్నీ వారికి చూపించాడు. తన భవనంలో గాని, రాజ్యమంతట్లో గాని హిజ్కియా వారికి చూపించనిదేది లేదు.
- 2 రాజులు 20:14సుమారు క్రీ.పూ. 712
తర్వాత రాజైన హిజ్కియా దగ్గరకు ప్రవక్తయైన యెషయా వెళ్లి, “ఆ మనుష్యులు ఏమి చెప్పారు? ఎక్కడి నుండి నీ దగ్గరకు వచ్చారు?” అని అడిగాడు. అందుకు హిజ్కియా, “వారు బబులోను అనే దూరదేశం నుండి వచ్చారు” అని జవాబిచ్చాడు.
- 2 రాజులు 20:15సుమారు క్రీ.పూ. 712
“నీ భవనంలో వారు ఏమేమి చూశారు?” అని ప్రవక్త అడిగాడు. హిజ్కియా, “నా భవనంలో ఉన్నవన్నీ చూశారు. నా ధనాగారంలో ఏదీ మరుగు చేయక అన్నీ వారికి చూపించాను” అన్నాడు.
- 2 రాజులు 20:16సుమారు క్రీ.పూ. 712
అప్పుడు యెషయా హిజ్కియాతో, “యెహోవా వాక్కు విను:
- 2 రాజులు 20:17సుమారు క్రీ.పూ. 712
ఒక సమయం రాబోతుంది, నీ భవనంలో ఉన్నవన్నీ ఈనాటి వరకు మీ పూర్వికుల కూడబెట్టినవన్నీ బబులోనుకు తీసుకెళ్తారు. ఇక్కడ ఏమీ మిగలదని యెహోవా చెప్తున్నారు.
- 2 రాజులు 20:18సుమారు క్రీ.పూ. 712
నీకు పుట్టబోయే నీ సంతానంలో కొంతమంది బబులోనుకు కొనిపోబడి బబులోను రాజు యొక్క రాజభవనంలో నపుంసకలుగా అవుతారు.”
- 2 రాజులు 20:19సుమారు క్రీ.పూ. 712
హిజ్కియా యెషయాతో, “నీవు చెప్పిన యెహోవా వాక్కు మంచిదే” అని అన్నాడు. ఎందుకంటే అతడు, “నా జీవితకాలంలో సమాధానం సత్యం ఉంటాయి కదా” అని అనుకున్నాడు.
- 2 రాజులు 20:20సుమారు క్రీ.పూ. 712
హిజ్కియా పరిపాలనకు సంబంధించిన ఇతర విషయాలు, అతడు సాధించినవన్నీ, అతడు కొలను త్రవ్వించి, కాలువ కట్టించి, నీటిని పట్టణానికి సరఫరా చేసిన సంగతి యూదా రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడలేదా?
- 2 రాజులు 20:21సుమారు క్రీ.పూ. 698
హిజ్కియా చనిపోయి తన పూర్వికుల దగ్గరకు చేరాడు. అతని తర్వాత అతని కుమారుడు మనష్షే రాజయ్యాడు.
- 2 రాజులు 21:1సుమారు క్రీ.పూ. 698
మనష్షే రాజైనప్పుడు అతని వయస్సు పన్నెండేళ్ళు, అతడు యెరూషలేములో యాభై అయిదు సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి పేరు హెఫ్సిబా.
- 2 రాజులు 21:2సుమారు క్రీ.పూ. 698
అతడు యెహోవా దృష్టికి చెడుగా ప్రవర్తించాడు, ఇశ్రాయేలీయుల ఎదుట నుండి యెహోవా వెళ్లగొట్టిన జనాలు చేసే హేయక్రియలు చేశాడు.
- 2 రాజులు 21:3సుమారు క్రీ.పూ. 698
తన తండ్రి హిజ్కియా పడగొట్టిన క్షేత్రాలను అతడు తిరిగి కట్టించాడు; ఇశ్రాయేలు రాజైన అహాబు చేసినట్టు అతడు బయలు బలిపీఠాలను కట్టి, అషేరా స్తంభాన్ని చేశాడు. అతడు నక్షత్ర సమూహమంతటికి మ్రొక్కి వాటిని పూజించాడు.
- 2 రాజులు 21:4సుమారు క్రీ.పూ. 698
యెహోవా తన మందిరాన్ని ఉద్దేశించి, “యెరూషలేములో నా పేరు ఉంచుతాను” అని చెప్పిన ఆ యెహోవా మందిరంలో అతడు బలిపీఠాలను కట్టించాడు.
- 2 రాజులు 21:5సుమారు క్రీ.పూ. 698
యెహోవా మందిరంలో ఉన్న రెండు ఆవరణాల్లో నక్షత్ర సమూహమంతటికి అతడు బలిపీఠాలు కట్టించాడు.
- 2 రాజులు 21:6సుమారు క్రీ.పూ. 683
అతడు తన సొంత కుమారుడిని అగ్నిలో బలి ఇచ్చాడు, భవిష్యవాణిని ఆచరించాడు, శకునాలను కోరాడు, మృతులతో మాట్లాడేవారిని ఆత్మలతో మాట్లాడేవారిని సంప్రదించాడు. అతడు యెహోవా దృష్టిలో చాలా చెడుగా ప్రవర్తిస్తూ ఆయనకు కోపం రేపాడు.
- 2 రాజులు 21:7సుమారు క్రీ.పూ. 698
అతడు చెక్కించిన అషేరా స్తంభాన్ని తీసి ఆలయంలో నిలిపాడు. ఆ ఆలయం గురించి యెహోవా దావీదుకు, అతని కుమారుడైన సొలొమోనుకు, “ఇశ్రాయేలు గోత్రాలన్నిటిలో నేను ఎన్నుకున్న యెరూషలేములో, ఈ దేవాలయంలో నా పేరు నిత్యం ఉంచుతాను.