కంటెంట్‌కు వెళ్లండి

Jerusalem

753 verses · 2 known names

ఇలా కూడా పిలుస్తారు: Jerusalem's

31.7700, 35.2300 గూగుల్ మ్యాప్స్‌లో చూడండి

Jerusalem ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. సీయోనులో నుండి యెహోవా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు; మీ జీవితకాలమంతా యెరూషలేము అభివృద్ధిని చూస్తారు.

  2. సీయోనులో నుండి యెహోవా స్తుతించబడును గాక, ఆయన యెరూషలేములో నివసిస్తారు. యెహోవాను స్తుతించండి.

  3. యెరూషలేమా! నేను నిన్ను మరచిపోతే, నా కుడిచేయి దాని నేర్పును మరచిపోవాలి.

  4. నేను నిన్ను జ్ఞాపకం చేసుకోకపోతే, యెరూషలేము నాకు ఎక్కువ సంతోషం కలిగించేది అని నేను భావించకపోతే నా నాలుక నా అంగిలికి అంటుకుపోవాలి.

  5. యెహోవా, యెరూషలేము పడిపోయిన రోజున ఎదోము ప్రజలు ఏమి చేశారో జ్ఞాపకం చేసుకోండి. “దానిని నాశనం చేయండి. పునాదుల వరకు దానిని ధ్వంసం చేయండి!” అని వారు అరిచారు.

  6. యెహోవా యెరూషలేమును కట్టిస్తారు; ఇశ్రాయేలు వారిలో నుండి చెరగొనిపోబడిన వారిని ఆయన సమకూరుస్తారు.

  7. యెరూషలేమా, యెహోవాను ఘనపరచు; సీయోనూ, నీ దేవుని స్తుతించు.

  8. దావీదు కుమారుడును యెరూషలేము రాజును అయిన ప్రసంగి మాటలు:

  9. ప్రసంగినైన నేను, యెరూషలేములో ఇశ్రాయేలుకు రాజుగా ఉన్నాను.

  10. “చూడు, యెరూషలేములో నాకన్నా ముందు పాలించిన రాజులందరికంటే నేను గొప్పజ్ఞానిని; ఎంతో జ్ఞానాన్ని తెలివిని సంపాదించాను” అని నాలో నేను అనుకున్నాను.

  11. దాసదాసీలను నేను వెల చెల్లించి కొన్నాను, నా ఇంట్లోనే పుట్టిపెరిగిన దాసులు కూడా నాకున్నారు. యెరూషలేములో నాకన్నా ముందు నుండి ఉన్న వారందరికంటే ఎక్కువ పశుసంపద గొర్రెల మందలు నాకున్నాయి.

  12. నాకన్నా ముందు యెరూషలేములోని వారందరికంటే నేనెంతో గొప్పవాడినై ఎంతో వృద్ధి చెందాను. వీటన్నిటిలో నా జ్ఞానం నాతోనే ఉంది.

  13. యెరూషలేము కుమార్తెలారా, నల్లనిదానను, అయినా నేను సౌందర్యవతిని, కేదారు డేరాలవంటిదానను, సొలొమోను గుడారపు తెరల్లా నేనూ నల్లనిదాన్ని.

  14. యెరూషలేము కుమార్తెలారా! పొలములోని జింకలను బట్టి లేళ్లను బట్టి మీతో ప్రమాణము చేయిస్తున్నాను: సరియైన సమయం వచ్చేవరకు ప్రేమను లేపకండి, మేల్కొల్పకండి.

  15. యెరూషలేము కుమార్తెలారా! పొలములోని జింకలను బట్టి లేళ్లను బట్టి మీతో ప్రమాణము చేయిస్తున్నాను: సరియైన సమయం వచ్చేవరకు ప్రేమను లేపకండి, మేల్కొల్పకండి.

  16. దాని స్తంభాలు వెండివి, అడుగుభాగం బంగారం, దాని ఆసనం ఊదా రంగు బట్టతో అలంకరించబడింది, దాని లోపలి భాగం యెరూషలేము కుమార్తెల ద్వార ప్రేమతో అలంకరించబడింది.

  17. యెరూషలేము కుమార్తెలారా, నా ప్రియుడు మీకు కనిపిస్తే, ఆయనకు మీరు ఏమి చెప్తారు? ప్రేమను బట్టి నాకు స్పృహ తప్పిందని చెప్తామని ప్రమాణం చేయండి.

  18. ఆయన నోరు అతిమధురం; ఆయన మనోహరము. యెరూషలేము కుమార్తెలారా! ఈయనే నా ప్రియుడు, నా స్నేహితుడు.

  19. నా ప్రియురాలా, నీవు తిర్సా పట్టణంలా అందంగా ఉన్నావు, యెరూషలేములా మనోహరంగా ఉన్నావు, జెండాలు పట్టుకున్న సైన్యంలా గంభీరంగా ఉన్నావు.

  20. యెరూషలేము కుమార్తెలారా! మీతో ప్రమాణము చేయిస్తున్నాను: సరియైన సమయం వచ్చేవరకు ప్రేమను లేపకండి, మేల్కొల్పకండి.

  21. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా యూదా రాజులుగా ఉన్న కాలంలో యూదా గురించి, యెరూషలేము గురించి ఆమోజు కుమారుడైన యెషయాకు వచ్చిన దర్శనము.

  22. యూదా గురించి, యెరూషలేము గురించి ఆమోజు కుమారుడైన యెషయాకు వచ్చిన దర్శనం:

  23. చాలా జనాంగాలు వచ్చి ఇలా అంటారు, “రండి, మనం యెహోవా పర్వతం మీదికి, యాకోబు దేవుని ఆలయానికి వెళ్దాము. మనం ఆయన మార్గంలో నడిచేలా, ఆయన మనకు తన మార్గాల్ని బోధిస్తారు.” సీయోనులో నుండి ధర్మశాస్త్రం, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయటకు వెళ్తాయి.

  24. చూడండి, ప్రభువును, సైన్యాలకు అధిపతియైన యెహోవా యెరూషలేములో నుండి యూదాలో నుండి జీవనాధారాన్ని, మద్దతును తీసివేయబోతున్నారు: అన్ని ఆహార సరఫరాలు, అన్ని నీటి సరఫరాలు,

  25. యెరూషలేము పాడైపోయింది, యూదా పతనమవుతుంది, వారి మాటలు పనులు యెహోవాకు వ్యతిరేకంగా ఉన్నాయి, ఆయన మహిమగల సన్నిధిని వారు ధిక్కరించారు.