కంటెంట్‌కు వెళ్లండి

Egypt

561 verses · 4 known names

ఇలా కూడా పిలుస్తారు: Egyptian, Egyptians, Egyptian's

30.1000, 31.3300 గూగుల్ మ్యాప్స్‌లో చూడండి

Egypt ను ప్రస్తావించే వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. “మనుష్యకుమారుడా, ఈజిప్టు రాజైన ఫరోను గురించి విలాప గీతం పాడి అతనితో ఇలా చెప్పు: “ ‘దేశాల మధ్య సింహంవంటివాడవు; నీవు నీ ప్రవాహంలో కొట్టుకుపోతూ, నీ పాదాలతో నీటిని చిమ్ముతూ, ప్రవాహాలను బురదమయం చేస్తూ, సముద్రాల్లో ఉండే భీకరమైన సముద్ర జీవిలాంటి వాడవు.

  2. అన్ని జాతులలో అతి క్రూరులైన బల శూరుల ఖడ్గంతో నీ సైన్యం పతనమయ్యేలా చేస్తాను. వారు ఈజిప్టువారి గర్వాన్ని అణచివేస్తారు, దాని అల్లరిమూకలు నాశనమైపోతాయి.

  3. నేను ఈజిప్టును పాడు చేసినప్పుడు, అందులో ఉన్నవాటన్నిటిని నాశనం చేసినప్పుడు, దానిలో నివసించే వారినందరిని నిర్మూలం చేసినప్పుడు, నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు.’

  4. “వారు ఆమె కోసం ఈ విలాప గీతం పాడతారు. ఆయా దేశాల కుమార్తెలు దానిని పాడతారు; ఈజిప్టు కోసం, దాని అల్లరిమూకలన్నిటి కోసం వారు దానిని పాడతారు అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.”

  5. “మనుష్యకుమారుడా! ఈజిప్టు అల్లరిమూకల కోసం విలపించు పాతాళంలోకి దిగివెళ్లే వారితో పాటు ఆమెను, బలమైన దేశాల కుమార్తెలను భూమికి అప్పగించు.

  6. “ప్రభువైన మా దేవా, బలమైన హస్తం ద్వారా మీ ప్రజలను ఈజిప్టు నుండి బయటకు రప్పించి నీ నామానికి ఘనత తెచ్చుకున్నావు. మేము పాపం చేశాం, దుర్మార్గంగా ప్రవర్తించాము.

  7. అతడు వారి దేవుళ్ళను, వారి పోతవిగ్రహాలను, వారి విలువైన వెండి బంగారు వస్తువులను పట్టుకుని ఈజిప్టుకు తీసుకెళ్తాడు. కొన్ని సంవత్సరాలు అతడు ఉత్తరాది రాజును ఒంటరిగా వదిలేస్తాడు.

  8. అతడు ఎన్నో దేశాల మీద తన అధికారం కలిగి ఉంటాడు; ఈజిప్టు తప్పించుకోలేదు.

  9. ఈజిప్టులో కూడబెట్టిన వెండి, బంగారు నిధులు, విలువైన వస్తువులన్నీ అతని ఆధీనంలోనికి తీసుకుంటాడు. లిబియానీయులు, కూషీయులు అతనికి లొంగిపోతారు.

  10. అక్కడ ఆమె ద్రాక్షతోటలను ఆమెకు తిరిగి ఇస్తాను, ఆకోరు లోయను నిరీక్షణ ద్వారంగా చేస్తాను. అక్కడ ఆమె తన యవ్వన రోజుల్లో ఉన్నట్లు, ఈజిప్టు నుండి బయటకు వచ్చిన రోజున ఉన్నట్లు స్పందిస్తుంది.

  11. “ఎఫ్రాయిం గువ్వ లాంటిది, బుద్ధిలేక సులభంగా మోసపోతుంది, అది ఈజిప్టును పిలుస్తుంది, అది అష్షూరు వైపు తిరుగుతుంది.

  12. వారు సర్వోన్నతుని వైపు తిరుగరు, వారు పనికిరాని విల్లులా ఉన్నారు. వారి నాయకులు తమ గర్వపు మాటల వలన కత్తివేటుకు పడిపోతారు. ఇందుచేత ఈజిప్టు దేశంలో వారు ఎగతాళి చేయబడతారు.

  13. వారు తమ బలులు నాకు బహుమానంగా ఇచ్చినా, వాటి మాంసం తిన్నా సరే, యెహోవా వారిని బట్టి సంతోషించడం లేదు. ఇప్పుడు ఆయన వారి దుష్టత్వాన్ని జ్ఞాపకం చేసుకుని, వారి పాపాలను శిక్షిస్తారు: వారు ఈజిప్టుకు తిరిగి వెళ్తారు.

  14. వారు యెహోవా దేశంలో నిలిచి ఉండరు, ఎఫ్రాయిం ఈజిప్టుకు తిరిగి వెళ్తుంది, అష్షూరులో అపవిత్ర ఆహారాన్ని తింటుంది.

  15. వారు నాశనాన్ని తప్పించుకున్నా సరే, ఈజిప్టువారిని సమకూరుస్తుంది, మెంఫిసు వారిని పాతిపెడుతుంది. వారికి ప్రియమైన వెండి వస్తువులను దురదగొండ్లు ఆక్రమిస్తాయి, వారి గుడారాలు ముళ్ళతో నిండుతాయి.

  16. “ఇశ్రాయేలు శిశువుగా ఉన్నప్పుడు నేను అతన్ని ప్రేమించాను, ఈజిప్టులో నుండి నేను నా కుమారుని పిలిచాను.

  17. “వారు ఈజిప్టుకు తిరిగి వెళ్లరా? అష్షూరు రాజు వారిమీద అధికారం చేయడా? ఎందుకంటే వారు పశ్చాత్తాపపడడానికి నిరాకరించారు.

  18. వారు వణకుతూ ఈజిప్టు నుండి పక్షుల్లా ఎగిరి వస్తారు, అష్షూరు నుండి గువ్వల్లా అల్లాడుతూ వస్తారు. వారిని తమ ఇళ్ళలో నివసించేలా చేస్తాను,” అని యెహోవా ప్రకటిస్తున్నారు.

  19. ఎఫ్రాయిం గాలిని మేస్తున్నాడు; అతడు రోజంతా తూర్పు గాలిని వెంటాడుతున్నాడు, విస్తారంగా అబద్ధాలాడుతూ, దౌర్జన్యం చేస్తున్నాడు. అతడు అష్షూరుతో ఒప్పందం చేస్తున్నాడు ఈజిప్టుకు ఒలీవనూనె పంపిస్తున్నాడు.

  20. “మీరు ఈజిప్టు నుండి బయటకు వచ్చినప్పటి నుండి యెహోవానైన నేను మీకు దేవునిగా ఉన్నాను; మీ నియమించబడిన పండుగ రోజుల్లో ఉన్నట్లు నేను మిమ్మల్ని మరలా గుడారాల్లో నివసింపజేస్తాను.

  21. యెహోవా ఇశ్రాయేలీయులను ఈజిప్టు నుండి తీసుకురావడానికి ఒక ప్రవక్తను వాడుకున్నారు, ప్రవక్త ద్వారా ఆయన వారిని సంరక్షించారు.

  22. “మీరు ఈజిప్టు నుండి బయటకు వచ్చినప్పటి నుండి యెహోవానైన నేను మీకు దేవునిగా ఉన్నాను; మీరు నన్ను తప్ప మరే దేవున్ని అంగీకరించకూడదు, నేను తప్ప రక్షకుడు ఎవరూ లేరు.

  23. అయితే ఈజిప్టు పాడైపోతుంది, ఎదోము పాడైపోయిన ఎడారిగా అవుతుంది. ఎందుకంటే ఈ దేశాలు యూదా ప్రజలపై దౌర్జన్యం చేశాయి, వారి దేశంలో నిర్దోషుల రక్తం చిందించారు.

  24. అమోరీయుల దేశాన్ని మీరు స్వాధీనపరచుకోవాలని, నేను మిమ్మల్ని ఈజిప్టు నుండి బయటకు తీసుకువచ్చి, నలభై సంవత్సరాలు అరణ్యంలో నడిపించాను.

  25. ఇశ్రాయేలీయులారా! యెహోవా ఈజిప్టు నుండి బయటకు తెచ్చిన కుటుంబమంతటి గురించి నేను పలికిన ఈ మాట వినండి: